MOTHERS DAY 2022 TRY TO GIFT THESE ITEMS TO YOUR MOTHER SHE WILL BE HEALTHY FOR EVER GH SK
Mother's Day: రేపు మీ అమ్మకు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వండి.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది..
Mothers Day: తల్లి అందరి జీవితాల్లో ఎంత ప్రత్యేకమో తెలియజేసేందుకు మదర్స్ డే ఒక సందర్భం. ఈ మదర్స్ డే రోజున.. అమ్మను ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచే అద్భుతమైన బహుమతితో ఆశ్చర్యపరిస్తే బావుంటుంది. ఎలంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Mothers Day: తల్లి అందరి జీవితాల్లో ఎంత ప్రత్యేకమో తెలియజేసేందుకు మదర్స్ డే ఒక సందర్భం. ఈ మదర్స్ డే రోజున.. అమ్మను ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచే అద్భుతమైన బహుమతితో ఆశ్చర్యపరిస్తే బావుంటుంది. ఎలంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Mother's Day 2022: తల్లులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డే(Mothers Day)ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1908లో యూఎస్‌లో జరిగినప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తల్లి అందరి జీవితాల్లో ఎంత ప్రత్యేకమే తెలియజేసేందుకు మదర్స్ డే ఒక సందర్భం. ఈ మదర్స్ డే రోజున అమ్మను ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచే అద్భుతమైన బహుమతితో ఆశ్చర్యపరిస్తే బావుంటుంది. తల్లికి ఆరోగ్యకరమైన బహుమతులు (Mothers day Gift ideas) అందించేందుకు వీటిని పరిశీలించండి.
* ఫిట్నెస్ ట్రాకర్(Fitness Tracker)
ఫిట్నెస్ ట్రాకర్లను సులభంగా ధరించవచ్చు. వాచ్లకు బదులు వీటిని వినియోగిస్తే బావుంటుంది. ఇది స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్, వ్యాయామాలు, నిద్రపోతున్న సమయాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ పరికరాన్ని ఆన్లైన్ స్టోర్లలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం లగ్జరియస్ పట్టీలను కూడా కనుగొనవచ్చు.
* గ్రీన్ టీ కిట్(Green Tea Kit)
తల్లులు రిఫ్రెష్ డ్రింక్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా టీ. పాలు, చక్కెర కలిసి తీసుకొనే సాధారణ టీని గ్రీన్ టీతో భర్తీ చేయడం అంత సులభం కానప్పటికీ, గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జీవక్రియను అదుపులో ఉంచుకోవడానికి అమ్మకు మంచి బ్రాండ్ గ్రీన్ టీ కిట్‌ను కొనివ్వడం మంచి ఆలోచన.
* యోగా మ్యాట్(Yoga Mat)
తల్లి యోగా లేదా పైలేట్స్‌ను ఇష్టపడితే, ఆమెకు నిజంగా ప్రీమియం-నాణ్యత ఉన్న యోగా మ్యాట్ అవసరం. ఆమె జారకుండా నిరోధించే మ్యాట్‌ను కొనుగోలు చేసి బహుమతిగా ఇస్తే చక్కగా ఉంటుంది. సెల్ఫ్-రోలింగ్ మ్యాట్లలో ఒకదాన్ని కూడా కొనేందుకు పరిశీలించవచ్చు.
* స్పా గిఫ్ట్ కార్డ్(A Spa Gift Card)
రిలాక్సింగ్ స్పా సెషన్‌కు ఎవరూ నో చెప్పరు. తల్లులకు ఇది చాలా అవసరం అనడంలో సందేహం లేదు. పూర్తి శరీర స్పా సెషన్ కోసం ఆమెకు బహుమతి కార్డ్‌ని ఇవ్వండి. ఆమె దానిని ఇష్టపడుతుతారు. దగ్గరలో ఉన్న ప్రసిద్ధ స్పాను కనుగొని, ఆమె కోసం స్లాట్‌ను బుక్ చేయండి.
* గ్రీన్ సప్లిమెంట్స్(Green Supplements)
తల్లికి గ్రీన్ సప్లిమెంట్ టాబ్లెట్లను ఇవ్వడం ద్వారా ఆమె గ్రీన్ ఇన్‌టేక్‌ను ట్రాక్ చేయండి. ఈ సప్లిమెంట్లు ఆకుపచ్చ కూరగాయలు, ఆకుల పోషకాలతో వస్తాయి. ఈ పరిపూర్ణ బహుమతితో తల్లి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. ఈ బహుమతి ఎంపికలతో, తల్లి అన్ని వేళలా సంతోషంగా ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.