హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mother's Day Gift Ideas: వావ్.. రూ.500కే అమ్మకోసం అద్భుతమైన గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో..

Mother's Day Gift Ideas: వావ్.. రూ.500కే అమ్మకోసం అద్భుతమైన గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మదర్స్ డే 2022(Mothers Day) మే 8న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart) వంటి ప్రధాన ఇ-రిటైలర్‌లు సేల్‌ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నాయి. వినియోగదారులు తగ్గింపు ధరలలో అనేక గాడ్జెట్‌లను(Gadgets) సొంతం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

మదర్స్ డే 2022(Mothers Day) మే 8న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart) వంటి ప్రధాన ఇ-రిటైలర్‌లు సేల్‌ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నాయి. వినియోగదారులు తగ్గింపు ధరలలో అనేక గాడ్జెట్‌లను(Gadgets) సొంతం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. మదర్స్‌ డే రోజున తల్లి కోసం ప్రత్యేకంగా ఏదైనా కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో చాలా గ్జాడ్జెట్స్‌ తక్కువ ధరకు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ అయ్యే TWS ఇయర్‌బడ్‌లు, గది మూడ్‌ని సెట్ చేయడానికి స్మార్ట్ లైట్లు, చదవడం ఇష్టపడే వారి కోసం ఇ-రీడర్ వంటివి సేల్‌లో డిస్కౌంట్‌ ధరలపై లభిస్తున్నాయి.

మదర్స్ డే 2022 నాడు తల్లి కోసం కొనేందుకు వీటిని పరిశీలించండి.

రూ.500 కంటే తక్కువ ధరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న వస్తువులు..

ZunPulse Wi-Fi స్మార్ట్ బల్బ్ 10W- రూ.499: ఫోన్‌ ద్వారా గది మూడ్‌ని సెట్ చేయవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్ బల్బులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఫోన్ యాప్ ద్వారా కూడా స్విచ్ ఆన్ చేయవచ్చు. ZunPulse Wi-Fi స్మార్ట్ బల్బ్ 10W ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పనిచేస్తుంది. ఐఫోన్ వినియోగదారులు బల్బ్‌తో యాప్‌ ద్వారా కనెక్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

JBL C50HI వైర్డ్ ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్‌ విత్‌ మైక్‌ - రూ.449: 3.5mm ఆడియో జాక్‌తో స్మార్ట్‌ఫోన్‌లతో పని చేయగల JBL ఇన్-ఇయర్ ఇయర్‌ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇయర్‌ఫోన్‌లు బ్లూ, రెడ్‌, బ్లాక్‌ కలర్‌లలో లభిస్తాయి.

నోవా టెంపరేచర్ కంట్రోల్ ప్రొఫెషనల్ NHS 860 హెయిర్ స్ట్రెయిట్‌నెర్ - రూ.494: రూ.500ల కంటే తక్కువ ధరకు లభిస్తున్న ఉత్తమ వస్తువుల్లో నోవా హెయిర్ స్ట్రెయిట్‌నర్ కూడా ఉంది. దీంట్లో టెంపరేచర్‌ను కంట్రోల్‌ చేయడానికి చాలా ఆప్షన్‌లు ఉన్నాయి. నాలుగు రకాల టెంపరేచర్‌ సెట్టింగ్స్‌ ఉన్న హెయిర్ స్ట్రెయిట్‌నెర్ సిరామిక్ పూతతో వస్తుంది.

రూ.1,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న వస్తువులు..

ZunPulse Wi-Fi స్మార్ట్ బల్బ్ 12W- రూ.1000: ప్రకాశవంతమైన స్మార్ట్ లైట్ కోసం చూస్తున్నట్లయితే, Zun Pulse 12W స్మార్ట్ లైట్ మంచి ఎంపిక అవుతుంది. చదవడం, సినిమాలు చూడటం వంటి వాటి కోసం వీలుగా మల్టిపుల్‌ లైట్ మోడ్‌లతో యాప్ వస్తుంది . ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌తో సులభంగా పని చేస్తుంది. ఐఫోన్ వినియోగదారులకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

OnePlus 1000mAh పవర్‌బ్యాంక్ - రూ.999: పవర్‌బ్యాంక్‌లు కూడా ఈ శ్రేణిలో పరిశీలించాల్సిన వస్తువులు. ఇప్పుడు ఎక్కువగా కొవిడ్‌ నిబంధనల మధ్య ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి పవర్‌బ్యాంక్‌లు చాలా అవసరం.

3 స్టేజ్ డిమ్మింగ్ లైట్‌తో SYSKA SSK-TL-8605L పవర్‌లైట్ 10W LED టేబుల్ ల్యాంప్ - రూ.759: ల్యాంప్స్ మరొక మంచి ఎంపిక వీటితో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. SYSKA ల్యాంప్‌ మూడు దశల లైటింగ్‌ను అందిస్తుంది. లైట్‌ను సర్దుబాటు చేయడానికి దీనిని సులువుగా వంచుకొనే సదుపాయం కూడా ఉంది.

రూ.2,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న వస్తువులు..

Oppo Enco Air 2 - రూ.1,999: మదర్స్‌ డే రోజున బహుమతిగా ఇవ్వడానికి రూ.2,000లోపు ఏదైనా కొనాలని చూస్తుంటే అత్యుత్తమ TWS ఇయర్‌బడ్‌లలో ఒకటి. ఇయర్‌బడ్‌లు బాస్-హెవీ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఎయిర్‌పాడ్స్-వంటి డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

డిజో వాచ్ 2 స్పోర్ట్స్ - రూ.1,999: స్మార్ట్‌వాచ్‌లు ఈ రోజుల్లో హెల్త్ మెట్రిక్‌లను ట్రాక్ చేయడంలో చాలా ఉపయోగపడుతున్నాయి. డిజో వాచ్ 2 అందంగా కనిపించడమే కాకుండా, అనేక ఫీచర్లను అందిస్తుంది.

ఫిలిప్స్ 9W LED స్మార్ట్ కలర్‌తో ఎకో ఫ్లెక్స్ కాంబో - రూ.1,799: Amazon Flex అనేది ఒక స్మార్ట్ స్పీకర్, ఇది నేరుగా పవర్ అవుట్‌లెట్‌లోకి ప్లగ్ అవుతుంది. బాత్రూమ్, లాండ్రీ రూమ్ లేదా గ్యారేజ్ వంటి ఎక్కడైనా అలెక్సాను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిమోట్ మూలల్లో స్మార్ట్ పరికరాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

https://www.news18.com/news/tech/mothers-day-2022-gift-ideas-top-tech-you-can-buy-under-rs-2000-5123815.html

First published:

Tags: Happy mothers day, Mother day

ఉత్తమ కథలు