Mothers Day 2021: ఈ సింపుల్ రెసిపీలతో అమ్మను సర్‌ప్రైజ్ చెయ్యండి...

Mothers Day 2021: ఈ సింపుల్ రెసిపీలతో అమ్మను సర్‌ప్రైజ్ చెయ్యండి...

Mothers Day 2021: అమ్మకు ఏమిచ్చినా తక్కువే. మదర్స్ డే నాడు అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ... ఈ సింపుల్ రెసిపీలను తయారుచేసి... అమ్మను సంతోషపెట్టొచ్చు.

  • Share this:
    Mothers Day 2021 : మండు వేసవి కాలం. మాతృదినోత్సవం నాడు అమ్మను ఎలా సర్‌ప్రైజ్ చెయ్యాలి. ఆమెకు ఏం ఇవ్వాలి అనేది చాలా మందిలో ఉండే డౌట్. మార్కెట్‌కి వెళ్లి ఏ గిఫ్టో కొని ఇవ్వొచ్చు గానీ... దాని కంటే... మనమే స్వయంగా ఇంట్లోనే ఏదైనా రెసిపీ లాంటిది తయారుచేసి ఇస్తే... అమ్మ ఇంకా ఎక్కువ సంతోష పడుతుంది. ఎందుకంటే... "నా కోసం ఇది చేశారని అమ్మ ఎంతో ఫీలవుతుంది. మానసిక సంతృప్తి చెందుతుంది. ఐతే... తన జీవితాన్నే మన కోసం త్యాగం చేసే అమ్మకు ఏమిచ్చినా తక్కువే. ఏదో అమ్మపై మన ప్రేమను కూడా చాటుకునేందుకు సింపుల్‌గా ఏం చెయ్యవచ్చో తెలుసుకుందాం.

    లెమనేడ్ (Lemonade) : ఎండాకాలంలో నిమ్మ రసాన్ని మించిన రెసిపీ ఏముంటుంది. ఓ నిమ్మకాయి, చల్లటి నీరు, కాస్త చక్కెర, కొద్దిగా ఉప్పు కలిపి... నిమ్మరసం తయారుచేసి ఇవ్వండి. అమ్మ ఎంతో ఆనందపడుతుంది.

    మిల్క్ షేక్ లేదా స్మూతీ (Milk Shakes/ Smoothie) : ఏదైనా పండు తీసుకోండి. అరటిపండు, స్ట్రాబెర్రీ, పైనాపిల్. దాన్ని ముక్కలుగా చేసి... బ్లెండర్‌లో వేసి, కొద్దిగా పాలు, కొద్దిగా స్వీట్‌నర్ వేసి... బ్లెండ్ చెయ్యండి. చిక్కటి మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఇది అమ్మకు ఇచ్చి అభిమానాన్ని చాటుకోండి.

    తాజా సలాడ్, పండ్ల గిన్నె (Fresh Salad/ Fruit Bowl) : రకరకాల పండ్లు, టమాటాల్లాంటి కూరగాయలతో... సలాడ్ చేసి ఇవ్వండి. లేదా... ఓ గిన్నెలో రకరకాల పండ్లను సెట్ చేసి ఇవ్వండి. అమ్మ ముఖంలో చిరునవ్వును చూడండి.

    శాండ్‌విచ్ (Sandwiches) : దోసకాయ లేదా టమాట లేదా పాలకూర తీసుకొని... దానికి సాస్, వెన్న (cheese) జతకలిపి... రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో వాటిని సెట్ చేసి... అమ్మకు ఇచ్చి సర్‌ప్రైజ్ చెయ్యండి.

    ఇది కూడా చదవండి: Anti-Inflammatory Foods: శరీరంలో వేడి పెరుగుతోందా... ఈ ఆహారం తీసుకోండి

    చాకొలెట్ శాండ్‌విచ్ కుకీస్ (Choco Sandwich Cookies) : ఏదైనా బిస్కె్ట్ లేదా కుకీ తీసుకోండి. దాన్ని చాకొలెట్‌లో ముంచి... ఫ్రీజర్‌లో పెట్టండి. గట్టిపడిన తర్వాత... అమ్మకి ఇవ్వండి. అమ్మ మనల్ని ఇది కావాలని ఏదీ అడగదు. మనం ఏం ఇచ్చినా... ఎంతో సంతోషిస్తుంది. ఏడాదంతా అమ్మ మనపై ప్రేమను చాటుతూనే ఉంటుంది. మరి మనం అమ్మపై ప్రేమను చాటుకునే ఈ రోజున ఏదో ఒకటి ఇవ్వడం ద్వారా... ప్రేమానుబంధాన్ని చాటుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: