Mother's Day 2019 : ఈ గిఫ్ట్స్ ఇస్తే అమ్మకు భరోసానిచ్చినట్లే..

ప్రతీకాత్మక చిత్రం

Mother's Day 2019 | మే 12 న ప్రపంచమంతా మదర్స్‌డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ రోజున చాలామంది వారి తల్లులకు బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం..

  • Share this:
    మే 12 న ప్రపంచమంతా మదర్స్‌డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ రోజున చాలామంది వారి తల్లులకు బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం..
    ఫైనాన్షియల్ అడ్వైజర్ : మీ మదర్ గనుక ఏదైనా జాబ్ చేస్తున్నట్లైతే ఆమెకి ఫైనాన్షియల్ అడ్జైజర్‌గా సలహాలివ్వండి.. రిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏవైనా పాలసీలు ప్లాన్ చేసుకోవచ్చు.
    స్టాక్/మ్యూచ్యూవల్ ఫండ్స్ : ఇప్పటికే మీ మదర్ ఏవైనా పాలసీలు, మ్యూచ్యూవల్ ఫండ్స్‌లోపెట్టుబడులు పెడుతుంటే..సరైన సలహాలు ఇవ్వండి.. లేకపోతే మంచి ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ మీరే చూడండి..
    గోల్డ్ బాండ్స్ : గోల్డ్ బాండ్స్ కూడా చక్కని గిఫ్టింగ్ ఆప్షన్స్. అన్నీ బ్యాంకుల్లోనూ ఈ సౌలభ్యం ఉంటుంది. దీని గురించి అన్ని వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చయడం మంచిది.
    హెల్త్ ఇన్స్యూరెన్స్ : ఇన్స్యూరెన్స్ పాలసీలు అనేవి ధైర్యాన్నిచ్చే మంచి ఆప్షన్స్. ఈ పాలసీలు మదర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేయడమంటే వారికి జీవితం పట్ల భరోసానివ్వడమే..
    ఫిక్స్‌డ్ డిపాజిట్ : ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా మంచి గిఫ్టింగ్ ఆప్షన్. మనం ఫిక్స్ చేసిన అమౌంట్‌కి సంవత్సారినికి కొంత వడ్డీని కూడా చెల్లిస్తాయి బ్యాంకులు. చాలా బ్యాంకింగ్ సంస్థలు 8 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. అంతేకాదు, వృద్ధుల విషయంలో అయితే 0.25 నుంచి 0.5శాతం వడ్డి చెల్లిస్తాయి.
    సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ : అదేవిధంగా తల్లులకి 60 సంవత్సరాలు గనక నిండినట్లైతే.. వీరికోసం సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్స్ వంటివాటిని గవర్నమెంట్ రన్ చేస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పతకాలు అన్నింటిలోకి అధిక వడ్డీ రేటు ఉంటుంది ఈ పథకంలో. ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ పథకాన్ని అవసరమనుకుంటే మరో మూడేళ్లో కుూడా పొడిగించుకోవచ్చు. ఇందులో ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
    మదర్స్‌డేకి బొమ్మలు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలాంటివి కాకుండా పైన చెప్పిన మంచి ప్లాన్స్‌ని అమ్మకి గిఫ్ట్స్‌గా ఇస్తే మనకి బతుకునిచ్చిన అమ్మకి మనం భరోసా ఇచ్చినట్లే..
    First published: