Home /News /life-style /

MOST WEIGHT LOSS FRIENDLY FATTY FOODS THAT ARE ALSO HEALTHY HERE DETAILS NS

Fatty foods for weight loss: బరువు తగ్గడంపై ఈ అపోహలను వీడండి.. ఈ వివరాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవ్వు పదార్ధాలు తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. కానీ మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి.

    బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువ కెలొరీలు, కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు అనుకుంటారు. కొవ్వులు అధికంగా ఉండే పదార్థాల(Fatty foods)పై ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కొవ్వు పదార్ధాలు తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. కానీ మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి fats ఎంతో అవసరం. ఇవి తగిన మొత్తంలో శరీరానికి అందకపోతే.. కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం శోషించుకోలేదు. అందువల్ల జీవక్రియలు సజావుగా జరగడానికి, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన healthy dietపై దృష్టి పెట్టాలి. Healthy fats ఉండే ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. బరువు తగ్గడానికి సహాయపడే గుడ్లు, చేపలు, డార్క్ చాక్లెట్, కొబ్బరి, అవొకాడో వంటి ఆహార పదార్థాలపై (Weight loss diet) అవగాహన పెంచుకోవాలి.

    1. గుడ్లు (Eggs)
    గుడ్డు సొన (egg yolks) తింటే బరువు పెరుతామని చాలామంది అనుకుంటారు. కానీ ఇదో పెద్ద అపోహ. బరువు తగ్గాలనుకునేవారు నిక్షేపంగా గుడ్డు మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎగ్ వైట్‌(egg white)లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. గుడ్డు సొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.

    2. కొవ్వులు లభించే చేపలు (Fatty fish)
    సాల్మన్(salmon), సార్డినెస్(sardines), మాకేరెల్ (mackerel) వంటి చేపల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ సముద్రపు చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో కెలొరీలు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఈ సముద్రపు చేపల్లో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్.. ఆకలిని నియంత్రిస్తుంది.

    3. డార్క్ చాక్లెట్ (Dark chocolate)
    కొన్ని రకాల డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్లను స్వచ్ఛమైన కోకోవాతో తయారు చేస్తారు. దీంట్లో ఉండే కొకోవా బటర్ (cocoa butter) ఆకలిని నియంత్రిస్తూ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవగా ఉంటాయి. ఇవి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

    4. కొబ్బరి (Coconut)
    కొవ్వులు ఎక్కువగా ఉండే కొబ్బరిని ఆహార పదార్థాల తయారీలో వాడినా, కొబ్బరి నూనెతో చేసే వంటకాలు తిన్నా బరువు పెరుగుతారనేది మరో పెద్ద అపోహ. ఇది బరువును ఏమాత్రం ప్రభావితం చేయదు. కొబ్బరిలో ఉండే ఎక్కువ మొత్తంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ (saturated fats) వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. దీంట్లో ఉండే lauric acid.. హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది. పొట్టచుట్లూ పేరుకుపోయే ప్రమాదకరమైన కొవ్వులను తగ్గించే గుణం కొబ్బరికి ఉంటుంది.

    5. అవొకాడో (Avocado)
    అవొకాడోల్లో mono unsaturated fats అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వీటిల్లో అధికమొత్తంలో ఉండే ఫైబర్, ప్రోటీన్ వంటివి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా ఇవి కాపాడతాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Weightloss tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు