Monsoon: ఈ సీజన్‌లో మగవారు తమ చర్మసంరక్షణపై తీసుకోవాల్సిన బెస్ట్‌ టిప్స్‌!

షేవింగ్‌ చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాయకపోతే.. చర్మం దురదలు వస్తుంది. మంచి మాయిశ్చరైజర్‌ పూస్తే.. స్కిన్‌ రీహైడ్రేట్‌ అవుతుంది. పొడిబారకుండా ఉంటుంది. వీటివల్ల చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి.

షేవింగ్‌ చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాయకపోతే.. చర్మం దురదలు వస్తుంది. మంచి మాయిశ్చరైజర్‌ పూస్తే.. స్కిన్‌ రీహైడ్రేట్‌ అవుతుంది. పొడిబారకుండా ఉంటుంది. వీటివల్ల చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి.

  • Share this:
ఎప్పుడూ అందం అనగానే ఆడవారే గుర్తుకువస్తారు. అందం అలా ఆడవారితో ముడిపడిపోయింది. అయితే, ఈరోజుల్లో మగవారు కూడా బ్యూటిపై కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వీరికోసం ముఖ్యంగా వర్షాకాలం Monsoon లో వారి చర్మం పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
ముఖ్యంగా ఈ సీజన్‌లో సహజంగానే చర్మంపై మార్పులు వస్తాయి. హ్యూమిడిటీలో మార్పు వల్ల ఇన్ఫెక్షన్లు కూడా ప్రబలుతాయి. అందుకే కచ్ఛితంగా కొన్ని జాగ్రత్తలు ఈ కాలంలో తీసుకోక తప్పదు.
మగవారు కూడా వారి హెయిర్‌కు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. వాతావరణంలోని మార్పులు మగవారి చర్మం, జుట్టుపై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

షేవింగ్‌..
మీరు ఎంత బిజీగా ఉన్నా..ఫేషియల్ Facial, బాడీ షేవ్‌ చేసుకోవడంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదు. కనీసం ట్రిమ్‌ చేసుకోవాలి. జుట్టు పొడుగ్గా ఉంటే ఈ సీజన్‌లో డస్ట్‌ ఎక్కువగా పేరుకుపోతుంది. పైగా మన శరీర చెమట కూడా చేరిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు కటింగ్, షేవింగ్‌ చేసుకోవాలి.

కొంతమంది మగవారు కాస్త స్టైలిష్‌గా ఉంటుందని గడ్డాలు, మీసాలు షేవింగ్‌ చేసుకోకుండా మెయిన్‌టైన్‌ చేస్తారు. అయితే, అప్పుడు కచ్ఛితంగా వీటికి సంబంధించిన షాంపూలతో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత లైట్‌గా మాయిశ్చరైజర్‌ ఫేస్‌కు పెట్టుకోవాలి. దీనివల్ల దురదులు, గడ్డంలో నుంచి ఎటువంటి వాసన రాకుండా ఉంటుంది.

షేవింగ్‌ జెల్‌..
ఏ షాంపూలైనా, జెల్, మాయిశ్చరైజర్, సోప్స్‌ కచ్చితంగా ఆ సీజన్‌కు సంబంధించినవే వాడాలి. మన్నిక ఉన్న షేవింగ్‌ ఫోమ్  shaving foam, జెల్‌లు వాడితే ఎక్కువ కాలం ఫలితం ఉంటుంది. స్కిన్‌ కూడా హైడ్రేటేడ్‌గా ఉంటుంది. అంతేకాని షేవింగ్‌ కోసం సాధారణ సబ్బు, నీరు వాడకూడదు.

ఆల్కహాల్‌ బేస్‌ లేని మాయిశ్చరైజర్‌ల వల్ల బ్యాక్టిరియా లేదా వైరస్‌లు నశిస్తాయి. కానీ, వీటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ఆర్గానిక్, ఆలోవేరా, గ్రీన్‌టీ బేస్‌ ఉన్నవి వాడాలి. చెమట వల్ల చర్మం జిడ్డు పేరుకుపోతుంది. ఇది జుట్టుకు అంటుకుపోతుంది. అప్పుడు ఆ హెయిర్‌ను తొలగించడం కష్టతరం అవుతుంది. అందుకే షేవింగ్‌కు ముందు ఎల్లప్పుడూ ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. ఇది డెడ్‌స్కిన్‌ సెల్స్‌ను తొలగించడంతోపాటు రేజర్‌ ఈజీగా గ్లైడ్‌ అవుతుంది.
Published by:Renuka Godugu
First published: