Monsoon Diseases: ఈ జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధులు మీ దరికి రావు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

 • Share this:
  కరోనా దెబ్బకు మన జీవన విధానమే మారి పోయింది. జలుబు, దగ్గు, జ్వరం వస్తే ఒకప్పుడు ఎవరూ పట్టించుకోకపోయేవారు. కానీ ఇప్పుడు అవి వస్తేనే వణికిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడు కరోనా లక్షణాలు కావడమే ఇందుకు కారణం. సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం మరవక ముందే థర్డ్ వేవ్ అంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్ వచ్చినా.. రాకున్నా మనం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మానొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. లేకపోతే జలుబు, దగ్గు లాంటి చిన్న సమస్య వచ్చినా.. అది కరోనానా? లేదా సీజనల్ కు సంబంధించినదో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చిరస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

  దోమల నుంచి రక్షణ (Protection from mosquitoes): పాత వాటర్ కూలర్లు, ట్యాంకులు, టైర్లు, పగిలి పోయి పక్కకు పడేసిన కుండలు, గిన్నెలు లాంటివి దోమలకు నిలయాలుగా మారుతాయి. వర్షాలు వచ్చినప్పుడు అందులోకి నీళ్లు చేరి దోమలకు ఆవాసాలుగా మారుతాయి. దీంతో అలాంటి వస్తువులను బయటపడేయాలి. లేకుంటా వాటిలోని నీటిని తొలగిస్తూ ఉండాలి. ఇంకా ఇంటి చుట్టుపక్కల నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి. సాయంత్రం సమయంలో దోమల నుంచి రక్షించుకోవడానికి నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇంకా దోమ తెరలు వాడడం కూడా మంచిది. దోమలు ఇంట్లోకి రాకుండా ఎప్పటికప్పుడు డోర్లు, కిటికీలు మూసి ఉంచాలి.
  Health Benefits with Cardamom: రోజూ నాలుగు యాలుకలు నోట్లో వేసుకుంటే కలిగే 10 ప్రయోజనాలు ఇవే

  వ్యక్తిగత పరిశుభ్రత(Personal hygiene): వ్యక్తిగత పరిశుభ్రను పాటించడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వర్షా కాలంలోనే కాకుండా మిగతా సమయాల్లోనూ బయట నుంచి రాగానే స్నానం చేయడం మంచిది. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అన్నతినడానికి ముందు, వాష్ రూంకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బులతో శుభ్రం చేసుకోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు గుడ్డను అడ్డుపెట్టుకోవాలి.
  Health Tips: బ్రేక్‌ఫాస్ట్ గా ఈ ఐదు ఐటెమ్స్ ను అస్సలు తినకండి.. తింటే డేంజర్.. ఎందుకంటే

  సామాజిక దూరం(Social distancing): కరోనా ప్రాభావం తగ్గిందన్న కారణంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఎత్తేశాయి. ఆంక్షలను సైతం సడలించాయి. దీంతో గుంపులుగా తిరగడం అధికమైంది. ఈ పరిస్థితుల్లో జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలి. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపించిన వారికి దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దు.
  Stomach Problems: కడుపులో సమస్యలకు అసలు కారణం ఇదే.. వీటిని గుర్తుంచుకోండి

  ఆహారం, నీరు(Food and water hygiene): శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా కూడా అనేక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీధుల వెంట అమ్మే ఆహారం తీనకుండా ఉండడం మంచిది. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం మేలు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. గోరు వేచ్చని నీరు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం కూడా మంచిదే.

  బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి..
  ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు,వృద్ధులు, చిన్నరులను సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లనివ్వకపోవడమే మంచిది.
  Published by:Nikhil Kumar S
  First published: