• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • MODERN DAY BRIDES FACING THESE COMMON PRESSURES NOWADAYS GH SSR

modern day bride: నేటి తరం వధువులకు ఎన్ని ఒత్తిళ్లో.. ఇవి ఇంకెవరికీ అర్థం కావు..

modern day bride: నేటి తరం వధువులకు ఎన్ని ఒత్తిళ్లో.. ఇవి ఇంకెవరికీ అర్థం కావు..

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అది అమ్మాయిల విషయంలో అయితే మరింత ప్రధానమైంది. ఎందుకంటే పెళ్లితో అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్లి అక్కడే తన జీవితం అన్నట్లుగా నివసిస్తుంది. అమ్మానాన్నలను, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు.. ఇలా తన చుట్టూ అల్లుకున్న...

  • Share this:
పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అది అమ్మాయిల విషయంలో అయితే మరింత ప్రధానమైంది. ఎందుకంటే పెళ్లితో అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్లి అక్కడే తన జీవితం అన్నట్లుగా నివసిస్తుంది. అమ్మానాన్నలను, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు.. ఇలా తన చుట్టూ అల్లుకున్న బంధాలన్నింటికీ దూరమై కొత్త బంధాలను ఏర్పర్చుకోవడానికి కొత్త ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుంది. మిగిలిన దేశాల్లో అయితే పెళ్లి విషయంలో భార్యాభర్తలిద్దరూ సమానమే అయినా.. భారత్ లాంటి దేశాల్లో పెళ్లి విషయంలో అమ్మాయిలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి అమ్మాయి పెళ్లి అనగానే పెళ్లి చూపుల నుంచి పెళ్లయి అత్తారింటికి వెళ్లే వరకూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సమాజం అమ్మాయిలపై అలాంటి ఒత్తిళ్లను తెలియకుండానే రుద్దుతోంది. అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయంటే..

చాలామంది పెళ్లి చూపుల్లో అమ్మాయిల రూపురేఖల ఆధారంగా వారిని బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అమ్మాయి విలువ కేవలం ఆమె అందం, శరీరాకృతిని బట్టి కాదని వారి కలలు, వారు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని వారి విలువను లెక్కగట్టాలని ఏ ఒక్కరూ గుర్తించరు. అబ్బాయిలతో సమానంగా లేదా వారి కంటే ఎక్కువగానే ఉద్యోగాల్లో, క్రీడల్లో.. తమ తమ రంగాల్లో విజయాలు సాధించినా శరీరాకృతి, రంగు ఆధారంగానే వారిని విలువ కడతారు. ఇది వారిలో ఒత్తిడిని పెంచుతుంది. సమాజం వారికి నిర్ణయించిన స్టాండర్డ్స్ లో ఉండేందుకు అమ్మాయిలు ఎంతో ఒత్తిడికి గురవుతారు.

ఫలానా రంగులో ఉంటేనే మంచి సంబంధం దొరుకుతుంది. ఇంత సన్నగా ఉంటేనే మంచి కుటుంబానికి కోడలిగా వెళ్లగలుగుతుంది అన్న మాటలు అమ్మాయిల్లో సమాజంలోని బ్యూటీ స్టాండర్డ్స్ ని చేరుకునేందుకు ఒత్తిడిని పెంచుతుంటాయి. కాస్త లావుగా ఉన్నవారు మంచి సంబంధం కోసం సన్నగా మారేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు. ఇది వారిలో చాలా ఒత్తిడిని పెంచుతుంది.
ఇదే కాదు.. ఒక అమ్మాయి భర్త కంటే అందంగా, తెల్లగా ఉండాలి. భర్త కంటే ఆమె ఎత్తు తక్కువగా ఉండాలి కానీ మరీ తక్కువగా ఉండకూడదు అంటూ సమాజంలో ఉన్న స్టాండర్డ్స్ నల్లగా, ఛామన ఛాయలో ఉన్నవారికి.. ఎత్తు మరీ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నవారికి ఒత్తిడిని పెంచుతున్నాయి. ఛామన ఛాయ, నలుపు రంగులో ఉన్నవారు చాలా సార్లు ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటారు.
అమ్మాయిల ముఖం పై ఏదైనా మచ్చలున్నా, లేక ఆమె జుట్టు కాస్త రింగులుగా ఉన్నా సరే విమర్శలు ఎదురవుతాయి. ఇన్ని మచ్చలుంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీ జుట్టు ఇలా ఉండి వయసు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేస్తోంది. నీకు సంబంధాలు రావాలంటే కాస్త హెయిర్ స్టైల్ మార్చాల్సిందే లాంటి మాటలు కూడా ఎదురవుతుంటాయి. ఇక దుస్తుల గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుంటే మంచి సంబంధాలు వస్తాయని మన పెద్దవాళ్లలో ఓ నమ్మకం.

అయితే ఈ విమర్శలకు ద ఎండ్ చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ లోపాలుంటాయి. కానీ ఆ లోపాలను మాత్రమే కాదు.. వాళ్లు సాధించిన విజయాలను కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్లగా ఉంది అంటూ రిజెక్ట్ చేసిన అమ్మాయి తన టీమ్ లో నలభై మందికి లీడర్ కావచ్చు.. లావుగా ఉందని చెప్పి వద్దన్న అమ్మాయి పెద్ద డిజైనర్ కావచ్చు.. జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు. రింగుల జుట్టు ఉందంటూ వద్దన్న అమ్మాయి మోడల్ గా పేరు తెచ్చుకోవచ్చు.. మచ్చలున్నాయి అంటూ కాదన్న అమ్మాయి జీవితాలను కాపాడే డాక్టర్ కావచ్చు.. అందుకే వారి శరీర తత్వం, వారి రంగు ఆధారంగా కాకుండా వారి వ్యక్తిత్వాన్ని ఆధారంగా తీసుకొని సంబంధాలు కుదుర్చుకోవాలి. అమ్మాయిలు కూడా ఎవరో పెట్టిన ఈ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తమను మార్చుకోవడానికి ప్రయత్నించకుండా మీదైన వ్యక్తిత్వంతో వారి ముందుకు వెళ్లండి. మిమ్మల్ని మీరుగా ఇష్టపడేవారినే పెళ్లి చేసుకోండి.
Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు