HOME »NEWS »LIFESTYLE »mithuna the single malt whiskey of indian brand paul john gets worldwide popularity sk gh

Mithuna Whisky: ప్రపంచాన్ని ఊపేస్తున్న ఇండియన్ విస్కీ.. మిథున రికార్డ్.. కిక్కే కిక్కు..

Mithuna Whisky: ప్రపంచాన్ని ఊపేస్తున్న ఇండియన్ విస్కీ.. మిథున రికార్డ్.. కిక్కే కిక్కు..
ప్రతీకాత్మక చిత్రం

Mithuna Whisky: డార్క్ కోకోవా టోన్స్, స్పైస్ ఫ్లోట్, కాఫీ మోచా ఫ్లేవర్స్, హనీ క్రిస్ప్ టోస్ట్, వనీలా నోట్స్ తో మిథున టేస్ట్ అదిరిపోయేలా ఉంటుందని సదరు సంస్థ సగర్వంగా గ్లోబల్ మార్కెట్లో చెబుతోంది.

  • Share this:
ఇండియన్ బ్రాండ్ విస్కీ మిథున (Mithuna) యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. మత్తులో మంచెత్తెత్తోంది. అది ఇచ్చే కిక్కుకు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే అంతర్జాతీయంగా మిథున పేరు మార్మోగిపోతోంది. అవును.. "మిథున" విస్కీ అప్పుడే గ్లోబల్ బ్రాండ్‌గా ఆవిర్భవించింది. ప్రపంచంలో "మూడవ ఉత్తమమైన విస్కీ"గా ఇది అప్పుడు రికార్డు సృష్టించింది కూడా. "జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2021” (Jim Murray Whisky's Bible)లో చోటు సంపాదించటం ద్వారా మిథున విస్కీ తన బ్రాండ్ వాల్యూ మరింత పెంచుకుంది. అసలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న మొట్టమొదటి ఇండియన్ విస్కీ లిక్కర్ బ్రాండ్ కూడా మిథునే. పాపులర్ విస్కీ జిమ్ ముర్రే ఈ మిథున విస్కీని "a Whisky to devour” అంటూ అభివర్ణించటం విశేషం. ఇది అల్టిమేట్ అని దీనికి మిథున అని పేరు పెట్టడం అత్యంత సరైన పేరని కూడా ఆయన అన్నారు.

పాల్ జాన్ కంపెనీ తయారు చేస్తున్న ఈ సింగిల్ మాల్ట్ విస్కీని 2020, నవంబరులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. మిగతా బ్రాండ్లతో పోల్చితే మిథున 97 స్కోర్ సాధించింది. అంతేకాదు "ఏషియన్ విస్కీ ఆఫ్ ద ఇయర్ 2021” అవార్డు కూడా సొంతం చేసుకుంది. పాల్ జాన్ కంపెనీ గతంలో విడుదల చేసిన "కన్యా" (Kanya) అనే విస్కీ బ్రాండ్ “2018 ఏషియన్ విస్కీ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది, కన్యా విస్కీకి 96 స్కోర్ ఇచ్చినట్టు జిమ్ ముర్రే విస్కీ బైబిల్ చెబుతోంది. రాశుల పేర్లతో విస్కీకి పేర్లు పెడుతున్న పాల్ జాన్ మిథున, కన్యా అనే పేర్లతో బ్రాండింగ్ చేస్తున్నారు.



కెనడా నంబర్ 1:

ఇక జిమ్ ముర్రేస్ విస్కీ బైబిల్ 2021 ప్రకారం.. కెనడా తయారు చేసే అల్బర్టీ ప్రీమియం కాస్క్ స్ట్రెంత్ వల్డ్ "విస్కీ ఆఫ్ ద ఇయర్" టైటిల్ గెలుచుకుంది. దీంతో ఈ బ్రాండ్ వల్డ్ నంబర్ 1 గా ఆవిర్భవించింది. ఈ ఇయర్లీ ఎడిషన్ ర్యాంకింగ్ లో భాగంగా ఏటా 4,700 రకాల విస్కీలను జిమ్ ముర్రే రుచి చూస్తారు. ఏదైనా విస్కీ బ్రాండ్ 94-97.5 రేంజ్ స్కోర్ సాధిస్తే అది సూపర్ స్టార్ విస్కీ కింద పరిగణిస్తారు.

జాన్ పాల్ బ్రాండ్ స్పెషాలిటీ:

డార్క్ కోకోవా టోన్స్, స్పైస్ ఫ్లోట్, కాఫీ మోచా ఫ్లేవర్స్, హనీ క్రిస్ప్ టోస్ట్, వనీలా నోట్స్ తో మిథున టేస్ట్ అదిరిపోయేలా ఉంటుందని సదరు సంస్థ సగర్వంగా గ్లోబల్ మార్కెట్లో చెబుతోంది. పాల్ జాన్ సింగిల్ మాల్ట్స్ ను యూకేలో 2012లో లాంచ్ చేశారు. గోవాలో లభించే సహజసిద్ధమైన రా మెటీరియల్‌తో తయారయ్యే ఈ డ్రింక్స్ ఇటీవల కాలంలో బాగా బిజినెస్ చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఎక్స్ప్రెషన్, 3 ఫ్లాగ్షిప్ ఎక్స్ప్రెషన్స్, 2 సెలెక్ట్ కాస్క్స్, అకేషనల్ లిమిటెడ్ లేదా స్పెషల్ ఎడిషన్స్ రేంజ్ లో ఈ సింగిల్ మాల్ట్స్ వెరైటీలు లభిస్తున్నాయి. ప్రస్తుతం 40 దేశాల్లో ఈ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు లభిస్తున్నాయి. వల్డ్ ఫైనెస్ట్ విస్కీల్లో ఒకటిగా నిలవటం అతిపెద్ద అచీవ్మెంట్ గా జేడీపీఎల్ సీఎండీ పాల్ పీ జాన్ పేర్కొంటూ, ఎట్టకేలకు తమ కల నేటికి సాకారమైందంటున్నారు. లీడింగ్ ఇండియన్ స్పిరిట్స్ కంపెనీగా ఉన్న జేడీపీఎల్‌లో అమెరికాకు చెందిన సాజెరాక్ (Sazerac) కంపెనీ పెద్ద స్టేక్ హోల్డర్‌గా ఉంది.
Published by:Shiva Kumar Addula
First published:January 21, 2021, 13:35 IST

टॉप स्टोरीज