భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పరిసరాల పరిశుభ్రతను సరిగా పాటించకపోవడం ఒకటి. గ్రామీణ ప్రాంతాలతో సహా నగరాల్లో కూడా పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు కొరవడింది. దీని వల్ల అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల వంటివి పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ కలిసి నిర్వహించిన జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్‌ల (జెఎమ్పీ) తాజా అధ్యయనం ప్రకారం.. 15% మంది భారతీయులకు టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో లేవు. గ్రామీణ జనాభాలో 3.3%, పట్టణ జనాభాలో 1.7% మందికి ఇప్పటికీ తగినంత పరిశుభ్రత సేవలు అందుబాటులో లేవని ఈ అధ్యయనం తెలిపింది. 22.4% గ్రామీణ జనాభా, 1% పట్టణ జనాభా ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన చేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 1.7% మంది భారతీయులు మెరుగైన పరిశుభ్రత సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని అధ్యయనం వెల్లడించింది. 2.7% మంది ప్రజల కోసం వ్యక్తిగత పరిశుభ్రత సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.
* పారిశుధ్యం, పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
బహిరంగ మల విసర్జన వల్ల దాని నుంచి వైరస్లు, బ్యాక్టీరియాను పరిసరాల్లోకి వ్యాపిస్తాయి. ఈ వైరస్లు, బ్యాక్టీరియా కారణంగా అతిసారం, కలరా, విరేచనాలు, హెపటైటిస్ ఎ, టైఫాయిడ్, పోలియో వ్యాధుల వచ్చే ప్రమాదం ఉంది. మలంపై కీటకాలు వాలి.. ఇతర ప్రదేశాల్లో తిరుగుతూ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. భూగర్భజలాలు లేదా బావుల్లోని విసర్జన చేస్తే.. నీటి వనరులను కలుషితమై వ్యాధులు ప్రబలుతాయి.
* సరైన పారిశుధ్యం, పరిశుభ్రత పాటించకపోతే ఆర్థిక నష్టాలకు ఎదుర్కోక తప్పదు
పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్ధిక నష్టం వాటిల్లుతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో నివసించడం వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. దాని వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ రోగాల చికిత్సకు అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు ప్రత్యక్ష ఆర్థిక నష్టాల్లోకి వస్తాయి. ఇక రోగాల వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు చెత్త నియంత్రణ కోసం సమయం కూడా వృధా అవుతుంది. అలాగే మళ్ళీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు శ్రమపడాల్సి ఉంటుంది. 2006 నివేదిక ప్రకారం.. పారిశుధ్యం, పరిశుభ్రత కోసం ఇండియా 2.44 ట్రిలియన్ రూపాయలు ఖర్చు పెట్టింది. పర్యాటక, ఆరోగ్య, నీటికి సంబంధించి పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడానికే 2 ట్రిలియన్ రూపాయలకు పైగా ఖర్చు అయింది.
** భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
* ఆరోగ్య సంబంధిత ప్రభావం:
అకాల మరణాలు, వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులు, అనారోగ్యంతో విలువైన సమయం కోల్పోవడం వంటివి ఆరోగ్య సంబంధిత ప్రభావాలుగా పేర్కొంటారు. ముఖ్యంగా అతిసారం (diarrhoea) వల్ల చాలా మంది ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. మలేరియా, తట్టు, ట్రాకోమా(trachoma), అలరీ(ALRI) జబ్బుల వల్ల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
* నీటి శుభ్రత ప్రభావం (Water-Treatment Impact)
నీటి శుభ్రత ప్రభావం గురించి తెలుసుకుంటే.. మనం వాడే నీటిని శుద్ధి చేయడం, వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయడం, సుదూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకురావడం వల్ల ఖర్చులు అవుతాయి. పైపు నీటిని కొనుగోలు చేయడం. ఇంటి నీరు, తాగునీటిని శుద్ధి చేయడం వల్ల కూడా ఆర్థిక స్థితిపై భారం పడుతుంది.
* యాక్సెస్ సమయం ప్రభావం:
బహిరంగ మలవిసర్జన ప్రదేశాల వల్ల లేదా పాఠశాలలు, ఆఫీసుల్లో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అదనపు సమయం వృథా అవుతుంది.
* పర్యాటకంపై ప్రభావం:
పర్యాటక ప్రదేశాలలో టాయిలెట్స్ లేక అనేక మంది విదేశీ పర్యాటకులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనివల్ల పర్యాటక ఆదాయం తగ్గిపోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సరైన ఫెసిలిటీస్ లేకపోతే పర్యాటకులు దేశానికి రారు. ఒకవేళ వచ్చిన వారు అనారోగ్యం పాలవుతుంటారు. దీనివల్ల టూరిజంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
నివేదికల ప్రకారం.. పైన పేర్కొన్న నాలుగు ప్రభావాల వల్ల కలిగే మొత్తం నష్టం జీడీపీలో 6.4% కి సమానం.
* అపరిశుభ్రత వల్ల పాఠశాల డ్రాప్ అవుట్లపై పడే ప్రభావం
ప్రతి ఐదు స్కూళ్లలో రెండు స్కూల్స్ కు బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు లేవు. సరైన పారిశుధ్యం కార్యక్రమాలు కొరవడడంతో డ్రాపౌట్లు సంఖ్య పెరుగుతోంది. ఇక బాలికల పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు దీని వల్ల వారిలో తక్కువ అక్షరాస్యత రేట్లకు ఉంటుంది. ఏటా 23% మంది బాలికలు చదువు మానేస్తున్నారు.
* ఇక భారతదేశం ఇప్పుడిప్పుడే పరిశుభ్రత, పారిశుద్ధ్య రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత సమస్యలు తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. స్వచ్ఛ భారత్ అభియాన్ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తోంది.
న్యూస్ 18, హార్పిక్ ఇండియా చొరవతో ప్రారంభమైన మిషన్ పానీలో మీరు కూడా ఒక భాగమై భారతదేశంలో పరిశుభ్రత సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో పరిశుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడొచ్చు. మీ కృషి చిన్నదైనా ప్రపంచంపై ప్రభావం పెద్దగా ఉంటుంది. ఇందుకు https://www.news18.com/mission-paani/ విజిట్ చేసి మిషన్ పానీ ఉద్యమంలో జాయిన్ అవ్వండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani