Home /News /life-style /

MISCARRIAGE LEAVE PAID MISS CARRIAGE LEAVE IS ALSO AVAILABLE IN INDIA BUT IS IT BEING IMPLEMENTED GH MK

Miscarriage Leave: పెయిడ్ మిస్ క్యారేజ్ లీవ్ భారత్ లోనూ ఉంది.. కానీ అది అమలవుతోందా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిజానికి ఇండియా ఇలాంటి `మెట‌ర్నిటీ బెనిఫిట్ యాక్ట్‌-1961 (Maternity Benfit Act-1961)` ఆర‌వై ఏళ్ల క్రిత‌మే తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం మ‌హిళ‌కు మిస్‌క్యారేజ్ అయితే ఆ త‌ర్వాత రోజు నుంచే వ‌రుస‌గా ఆరు వారాల‌ పాటు `పెయిడ్ లీవ్‌` తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
చాలా దేశాల‌తో పోల్చితేఇండియాలో మ‌హిళ‌ల‌ను గౌరవించే సాంప్ర‌దాయం మొదటినుంచి కొనసాగుతూ వస్తోంది. అందుకే గ‌ర్భస్రావమైతే సెల‌వులు మంజూరు చేయ‌డానికి చ‌ట్టాన్ని తీసుకొచ్చిన దేశాల్లో ఇండియా కూడా ఒక‌టి. అయితే ఈ దేశంలో ఆరు వారాల‌ సెల‌వు ఇవ్వాల‌న్న చ‌ట్టం 60 సంవ‌త్స‌రాలుగా కాగితాల‌కే ప‌రిమ‌త‌మ‌య్యిందా? లేదంటే స‌క్ర‌మంగానే అమ‌ల‌వుతుందా అనే సందేహ‌మే ఇప్పుడు చ‌ర్చ‌కొచ్చిన విష‌‌యం.

ఇటీవ‌ల న్యూజిలాండ్ దేశ పార్ల‌మెంటు ఒక చట్టం చేసింది. దీని ప్ర‌కారం గ‌ర్భస్రావ‌మైతే అది స్టిల్‌బ‌ర్త్‌ (Stillbirth) అయినా లేక మిస్‌క్యారేజ్ (Miscarriage) కానియ్యండి ఆ ఉద్యోగినికి మూడు రోజుల సెల‌వు ఇచ్చే చ‌ట్టం ఇది. న్యూజిలాండ్ దేశ ప్ర‌ధాన‌మంత్రి జ‌సిండా ఆర్డెర్న్ త‌న లెజిస్లేష‌న్‌తో క‌లిసి ఈ నెల మార్చి 24వ తారీఖున ఈ చ‌ట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చ‌ట్టంలో ఉన్న ప్ర‌త్యేక‌త ఏమంటే, జెండ‌ర్ తేడా ఏమీ లేకుండా భార్య‌భ‌ర్త‌లు ఇద్దరూ ఈ మూడు రోజుల సెల‌వుల‌ను ‌వినియోగించుకోవ‌చ్చు.

నిజానికి ఇండియా ఇలాంటి `మెట‌ర్నిటీ బెనిఫిట్ యాక్ట్‌-1961 (Maternity Benfit Act-1961)` ఆర‌వై ఏళ్ల క్రిత‌మే తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం మ‌హిళ‌కు మిస్‌క్యారేజ్ అయితే ఆ త‌ర్వాత రోజు నుంచే వ‌రుస‌గా ఆరు వారాల‌ పాటు `పెయిడ్ లీవ్‌` తీసుకునే అవ‌కాశం ఉంది. దీని కోసం ఆ ఉద్యోగిని స‌ద‌రు మిస్‌క్యారేజ్‌కి సంబంధించిన రుజువును అందించాలి. అయితే ఇందులో కావాల‌ని గ‌ర్భాన్ని తొల‌గించుకుంటే, అంటే అబార్ష‌న్ చేయించుకోవ‌డం, ఈ సెల‌వులు వ‌ర్తించ‌వు. అంతే కాకుండా మిస్‌క్యారేజ్ కావ‌డం వ‌ల్ల ఉద్యోగిని అనారోగ్యానికి గుర‌యినప్పుడు స‌‌రైన మెడిక‌ల్‌ ప్రూఫ్ ఉంటే, నెల రోజుల వ‌ర‌కూ పెయిడ్ లీవ్ ఉంటుంది.

భార‌తీయ చ‌ట్టాలు ప్రొగ్రెసీవ్, నిజ‌మే! అయితే కంపెనీలు ఈ చ‌ట్టాల‌ను స‌రిగ్గా అమ‌లు చేస్తున్నాయా? అన్న‌ది ముఖ్య‌మైన ప్ర‌శ్న‌. హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌గా ప‌నిచేస్తున్న నిఖ‌త్ స‌యీద్ అనే మ‌హిళ‌కు ఇప్ప‌టికే రెండు సార్లు మిస్‌క్యారేజ్ అయ్యింది.మాన‌సికంగా, శారీర‌కంగా గ‌ర్బ‌స్థ శిశువు చ‌నిపోతే క‌లిగే బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ చ‌ట్టం గురించి ఆమె‌కు తెలుసు. సెల‌వు గురించి త‌న కంపెనీ హెచ్ ఆర్‌ను క‌నుక్కుంటే వారం రోజులు మాత్ర‌మే లీవ్ ప‌ర్మిష‌న్ ఉంద‌ని చెప్పారు. అంత‌కుమించి సెల‌వులు పెరిగితే జీతం క‌ట్ అవుతుంద‌ని అన్నారు. అయితే నిఖ‌త్ దానిపైన వివాదం పెట్టుకోద‌లుచుకోలేదు. ఎందుకంటే అది త‌న ఉద్యోగానికి సంబంధించిన విష‌యం. నిఖ‌త్ లాంటి ప‌రిస్థితినే ఇండియాలో ఎంతో మంది మ‌హిళా ఉద్యోగినులు ఎదుర్కొంటున్నారు. ముంబైలోని ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్లో ప‌నిచేసే టీచ‌ర్ మాన‌సి సుబ్బ‌రాజ్‌, క‌ల‌క‌త్తాలో బ్యాంక్ మేనేజ‌ర్ అయిన ప్ర‌తిక్షా చావ్లా లాంటి వారు చాలా మంది... మాన‌సి, ప్ర‌తిక్ష ఇద్ద‌రికీ త‌మ మొద‌టి ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ అయ్యింది. అప్పుడు మాన‌సి 10 రోజులు, ప్ర‌తీక్ష వారం రోజులు సెల‌వు కావాల‌ని అడిగారు.

మాన‌సి ప‌నేచేసే స్కూల్లో వార్షిక ప‌రీక్ష‌లు కావ‌డంతో స్కూల్ యాజ‌మాన్యం సెల‌వు ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. అందుకే ఒక్క‌రోజు సెల‌వు తీసుకుందంతే. ఇక ప్ర‌తీక్ష‌కు 14 వారాల గ‌ర్భం త‌ర్వాత శిశువు అనారోగ్యంతో మ‌ర‌ణించింది. ఈ బాధ‌లోంచి ఆమె తేరుకోవ‌డానికి సెల‌వులు అవ‌స‌రం. ప్ర‌తీక్ష టీమ్ లీడ్ కూడా ఒక మ‌హిళే. కానీ ఆమె `ఇవ‌న్నీ మామూలే. దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు` అంది. నిజ‌మే! ఇది స‌ర్వ‌సాధార‌ణం కావ‌చ్చు. కానీ మాన‌సికంగా, శారీర‌కంగా నేను కోలుకోవ‌డానికి నాకు సెల‌వు అవ‌స‌రం ఉంది` అని చెప్పినా సెలవు ఇవ్వకపోవడంతో రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌తీక్ష ఆ ఉద్యోగం మానేసింది. ఒక ఇండిపెండెంట్ ఫైనాన్షియ‌ల్ క‌న్స‌ల్టెంట్‌గా జీవితం ప్రారంభించింది.

బ్లూ-కాల‌ర్ ఉద్యోగాల్లో ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంది. ఇండస్ట్రీల్లో చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ బ‌తికే వీరి ఆర్థిక స్థితి ద‌య‌నీయం. ముంబై శివారుల్లోని ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలో హౌస్‌కీపింగ్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేస్తుంది క‌ల్ప‌న. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమెకు మూడు సార్లు మిస్‌క్యారేజ్ అయ్యింది. అయిన ప్ర‌తిసారీ ఆమె ష‌రా మామూలుగానే ప‌నికి వెళ్లాల్సి వ‌చ్చేది. ఎందుకంటే, అక్క‌డ సెల‌వులు ఉండ‌వు. ఒక‌వేళ సెల‌వు పెడితే ఆమెకు ఆ రోజు కూలి డ‌బ్బులు రావు. అస‌లు ఇండియాలో మిస్‌క్యారేజ్‌లు ఎన్ని జ‌రుగుతున్నాయో స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డం బాధాక‌రం. అయినా ఇటీవ‌ల జ‌రిగిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం ద‌‌క్షిణ ఆసియాలో స్టిల్‌బ‌ర్త్ రేట్లు అధికంగా ఉన్న‌ది భారత్ లోనే. 2015లో జ‌రిగిన మ‌రో అధ్య‌య‌నం ప్ర‌కారం ఇత‌ర జాతుల‌తో పోల్చుకుంటే మొద‌టి ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ అయ్యే అవ‌కాశం భార‌తీయ మ‌హిళ‌ల్లోనే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తుంది.

నిఖ‌త్‌, మాన‌సి, ప్ర‌తీక్ష‌, క‌ల్ప‌నా లాంటి వారు చ‌ట్ట‌ప‌రంగా పొందిన హ‌క్కుని కోల్పోయినందుకు న్యాయ‌పోరాటం చెయొచ్చు. కానీ ఆర్థికంగా క‌లిగే న‌ష్టం వ‌ల్ల‌, అంత‌కుమించి ఉద్యోగ భ‌ద్ర‌త లేని భ‌యం కార‌ణంగా ఆ ప‌ని చేయ‌లేక‌పోయారు. నిజానికి ఇలా మ‌హిళ‌ల మాన‌సిక‌, శారీర‌క ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోకుండా ఉంటే అది ఆ ప‌ని ఉత్ప‌త్తిపైన ప్ర‌భావం చూపుతుంది.

న్యూజిలాండ్ ‌లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో లేబ‌ర్ మెంబ‌ర్ ఆఫ్ పార్ల‌మెంట్‌గా ఉన్న గిన్నీ ఆండ్ర‌సెన్ మాట్లాడుతూ...`ఈ చ‌ట్టం మ‌హిళ‌ల‌కు ఈ సెలవు అవ‌స‌ర‌మైతే దాన్ని అడిగే హ‌క్కును క‌ల్పిస్తుంది. వేద‌న‌తో ప‌నిచేయ‌కుండా, `ఏదో జీవితాన్ని ఈ బాధ‌లోనే కొన‌సాగించేద్దాంలే!` అనుకోకుండా, ఈ వేద‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి మాన‌సికంగా, శారీర‌కంగా వారికి టైమ్ కావాల‌ని వారికి తెలుస్తుంది` అన్నారు. మ‌హిళా సంర‌క్ష‌ణ ప‌రంగా మన దేశంలో చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి అడ్డంకులూ లేవు నిజమే కానీ కంపెనీలు, సంస్థ‌లు ఈ చ‌ట్టాల‌ను అమ‌‌లు చేయ‌డం లేద‌న్న‌ది అంతే నిజం.
Published by:Krishna Adithya
First published:

Tags: Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు