సీజనల్ దగ్గులు, జ్వరాలను ఇలా తగ్గించుకోండి... కేంద్ర ఆయుష్ శాఖ సూచనలు

కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖను ఏర్పాటు చేశాక... ఆ శాఖ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు తగిన సూచనలు చెబుతోంది. తాజాగా మరికొన్ని చెప్పింది.

news18-telugu
Updated: July 1, 2020, 11:57 AM IST
సీజనల్ దగ్గులు, జ్వరాలను ఇలా తగ్గించుకోండి... కేంద్ర ఆయుష్ శాఖ సూచనలు
సీజనల్ దగ్గులు, జ్వరాలను ఇలా తగ్గించుకోండి... కేంద్ర ఆయుష్ శాఖ సూచనలు (File)
  • Share this:
వాతావరణం మారినప్పుడల్లా మనకు చిన్నపాటి అనారోగ్యాలు కలుగుతాయి. అంటే... జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. ఎందుకంటే... మారిన వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం వెంటనే మారదు. పైగా వాతావరణం మారినప్పుడు... కొత్త కొత్త వైరస్‌లు పుట్టి మన బాడీలోకి వెళ్తాయి. అంతే... అప్పటిదాకా చక్కగా ఉండేవాళ్లం కాస్తా... జలుబు, దగ్గుల బారిన పడతాం. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి... ఏ దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా... అది కరోనా ఏమో అనే టెన్షన్ పెరుగుతోంది. అందుకే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పిన సూచనల్ని పాటిస్తే... సీజనల్ ఫ్లూ, ఇతర అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

వర్షాకాలం... వైరస్‌లకు అనుకూలమైనది. వేడి ఎక్కువగా లేని వాతావరణంలో అవి బాగా పెరుగుతాయి. ఇప్పుడు మనకి వానాకాలం కాబట్టి... మనం ఎక్కువ జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇంట్లోనే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించమని ఆయుష్ కోరింది.

Golden Milk : గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే... పాలు చేదుగా అనిపించి తాగడం కష్టమవుతుంది. అందుకే... కొద్దిగానే వేసుకోవాలి. చెడు బ్యాక్టీరియాను చావగొట్టడంలో పసుపుకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గొంతులో తిష్టవేసిన వైరస్‌ అంతు చూడటంలో పసుపు ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే రోజూ ఇలా చెయ్యాలు. పడుకునే ముందు పసుపు పాలను తాగి నిద్రపోతే... చాలా ఉపశమనం కలుగుతుంది.

Steam : మనం ఎంత కండలు తిరిగి ఉన్నా... మన ముక్కు ఆరోగ్యంగా లేకపోతే... నీరసం రాక తప్పదు. జలుబు కంట్రోల్ అవ్వాలంటే... ఓ గిన్నెలో నీళ్లను వేడి చేసి... అందులో కాస్త జండూబామో, అమృతాంజనమో, టీట్రీ ఆయిలో, పుదీనా ఆకులో, నీలగిరి ఆకులో, మెంథాప్లస్సో... అలాంటివి ఏవైనా కొద్దిగా కలిపి... ఆ గిన్నెపై దుప్పటి వేసి అందులో దూరాలి. ఇప్పుడు గిన్నె నుంచి వచ్చే ఆవిరిని ముక్కుతో లోతుగా పీల్చాలి. ఇలా ఓ పదిసార్లు చేశారంటే... ఆవిరి ముక్కు రంద్రాల్లోంచీ లోపలికి వెళ్తూ... దారిలోని అడ్డుగా ఉన్న వైరస్‌లు, చెడు బ్యాక్టీరియాను చావగొడుతుంది. ఆ తర్వాత ఒకింత ఊపిరి బాగా ఆడుతున్న ఫీలింగ్ మీకు కలుగుతుందని ఆయుష్ తెలిపింది.

Symptoms of seasonal flu : మనకు అనారోగ్యం వస్తే... అది కరోనాయో, సీజనల్ ఫ్లూయో కనిపెట్టలేం. అందుకోసం వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. కరోనా తీవ్రం అవ్వడానికి కనీసం మూడు రోజులు తీసుకుంటోంది. కాబట్టి మొదటి రెండు రోజులు ఇంట్లోనే ఉంటూ... అన్ని జాగ్రత్తలూ పాటిస్తే... ఆలోగా వచ్చిన సమస్య తగ్గిపోతే... అది కరోనా కానట్లేనని అర్థమవుతుంది. సమస్య తగ్గకపోతే... అప్పుడు టెస్ట్ చేయించుకోవడం మేలు. సహజంగా సీజనల్‌లో కింది సమస్యలు వస్తాయని ఆయుష్ తెలిపింది.

లక్షణాలు :
- ఊపిరి తీసుకోవడంలో సమస్య- ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
- దగ్గు (పొడి లేదా తడి)
- ఒళ్లునొప్పులు
- తలనొప్పి

పై లక్షణాల్ని చదవగానే... కరోనా లక్షణాల్లా అనిపించడం సహజం. మరి కరోనా కూడా ఓ వైరస్సే కదా. అందువల్ల దానికీ దాదాపు అవే లక్షణాలు ఉన్నాయి.
First published: July 1, 2020, 11:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading