Health Tips : మూత్రసంబంధిత సమస్యలను దూరం చేసే ఉలవలు
చిరుధాన్యాలతో ఎన్నిలాభాలో..
పెరిగిన అవగాహన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అందరికీ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే, వీటిని తినడం వల్ల ఆరోగ్యమే.. కానీ, ఇందులో ఏవి తీసుకుంటే ఏం లాభమో.. తెలుసుకుని తింటే.. అధికప్రయోజనాలు సొంతమవుతాయి.
రాగులు : శరీరానికి చలువ చేసే వీటిని మీ డైట్లో చేర్చుకోండి. వీటితో అంబలి, జావ, రాగి ముద్దలాంటివి చేసుకుని తినండి. అంతేకాదు, రక్తం వృద్ధి చేసి శరీరానికి బలం ఇవ్వడంలో రాగులు బెస్ట్ ఆప్షన్. కొర్రలు : అధికబరువుతో ఇబ్బంది పడేవారు అన్నంకి బదులు కొర్రలు వండుకుని తినండి. బరువు త్వరగా తగ్గుతారు. వీటిని తినడం వల్ల బలం రావడమే కాదు.. భవిష్యత్లో ఉదర సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం వంటివి వచ్చే అవకాశాలు తక్కువ. సామలు: ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం అధికంగా ఉండే సామలు కూడా ఆరోగ్యానికి అదనపు శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య దూరమై కాల్షియం అధికంగా పొందుతాం. అందువల్ల ఎముకలు, నరాలు బలంగా మారతాయి. పేగు క్యాన్సర్ వంటివాటిని దూరం చేసుకోవచ్చు. సామలు బాలింతల్లో పాలఉత్పత్తిని పెంపొందిస్తాయి.. ఉలవలు : రంగుల్లో లభించే ఉలవలు ఆరోగ్యానికి ఎంతోమంచివి. మూత్రసంబంధిత సమస్యలను తగ్గించడంలో వీటికి సాటి మరేమీ లేవు. మూత్రశయంలో ఏర్పడిన రాళ్లను ఇవి కరిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Published by:Amala Ravula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.