Health Tips : రోజూ ఓ గ్లాస్ పాలతో... గుండె సమస్యలకు చెక్...

పాలు, పాల పదార్థాలు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

రోజూ పాలు తాగమంటే కొంతమంది చిరాకు పడుతుంటారు. కానీ, పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, మారిన వాతావరణం ఇలా అనేక కారణాల వల్ల చిన్నవయస్సులోనే చాలామంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ముప్పుని తప్పించుకునేందుకు డాక్టర్లు ఎన్నో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఐతే... సమస్యలు వచ్చాక... జాగ్రత్తలు పాటించే కంటే... ముందే జాగ్రత్త పడితే ఎంతో మేలు. ఆస్పత్రి ఖర్చులు ఆదా అవ్వడమే కాదు... అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకునే సూచన చాలా ఈజీ, అందరూ పాటించదగ్గది, ఇంకా చెప్పాలంటే మన ఆకలి తీర్చేది. రోజూ పాలు తాగితే చాలు... గుండె సమస్యలు పరార్.

రోజూ గ్లాస్ పాలు తాగండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే గుండె సమస్యలు వస్తాయి. లాస్ ఏంజిల్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. సుమారు 900 మందిని పరీక్షించిన నిపుణులు... ఈ విషయాన్ని గుర్తించారు.

రక్తంలో కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్నవారిలో రక్తపోటు వస్తుంది. క్రమేణా ఈ సమస్య గుండె సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు. ఇప్పటికీ కొనసాగుతున్న పరిశోధన వల్ల... భవిష్యత్‌లో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.


అందువల్ల పాలు తాగాలి. నాకు పడవు, నాకు అలవాటు లేవు అని పక్కన పెట్టేయకుండా... అలవాటు చేసుకొని తాగితే మంచిది. డైరెక్టుగా పాలు నచ్చకపోతే... వాటిలో ఏ హార్లిక్సో, బూస్టో కలుపుకొని తాగినా పర్వాలేదు.
Published by:Krishna Kumar N
First published: