Milk shake @ Home : ఇంట్లోనే మిల్క్‌షేక్ ఇలా చేసుకోండి..

ఎండలు పెరిగిపోయాయి. ఉక్కపోతతో అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో చల్లచల్లని పదార్థాలు శరీరంలోకి వెళ్తుంటే ఆ మజానే వేరు. కాబట్టి మిల్క్ షేక్ వంటి డ్రింక్స్‌కి బయట మహా గిరాకీ.. మరి ఆ మిల్క్‌షేక్‌ని మనమే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా..

Amala Ravula | news18-telugu
Updated: March 24, 2019, 3:54 PM IST
Milk shake @ Home : ఇంట్లోనే మిల్క్‌షేక్ ఇలా చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 24, 2019, 3:54 PM IST
కావాల్సిన పదార్థాలు : వేడి చేసి చల్లార్చిన పాలు -అరలీటర్, ఇష్టమైన పండ్లు : ఓ కప్పు, పంచదార : అరకప్పు, క్రీమ్ : 2 టేబుల్ స్పూన్(లేకపోయినా పర్లేదు), టూటీ ఫ్రూటీ : గార్నిష్‌కి సరిపడినంతా, డ్రై ఫ్రూట్స్ : టేస్ట్‌కి తగ్గట్లుగా.. కుంకుమపువ్వు : రెండు రేకులు.., ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ : 2 స్కూప్స్..
తయారీ విధానం : ముందుగా జూస్ జార్ తీసుకోవాలి. అందులో పాలు, చక్కెర, పండ్ల ముక్కలు, పంచదార వేసి గ్రైండ్ చేయాలి. పండ్ల ముక్కలు పూర్తిగా పాలల్లో కలిసిపోయాక ఆ మిల్క్‌ని తీసుకుని గ్లాసులో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 15నిమిషా తర్వాత ఇప్పుడు పైనుంచి ఐస్ క్రీమ్ వేసి డ్రైఫ్రూట్స్, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి ఇవ్వాలి.
తయారీ విధానంలో మనకి ఇష్టమైన పండ్లు, ఐస్‌క్రీమ్, ఖర్జూరం వంటి వాటిని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, కొంతమంది చాక్లెట్స్, బిస్కెట్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు ఆ చాక్లెట్ పౌడర్ లేదా చాక్లెట్స్, బిస్కెట్స్‌ని కూడా ముందుగా మిక్సీ పట్టి అందులో పాలు కలిపి మిల్క్‌షేక్ చేసుకోవచ్చు. ఎండలో బయటికి వెళ్లేముందు, బయటినుంచి వచ్చాక ఈ మిల్క్‌షేక్ తీసుకుంటే ఎన్నో లాభాలు. ఇంట్లోనే ఈ డ్రింక్‌ని తయారు చేసుకుంటాం కాబట్టి.. ఎలాంటి కల్తీ బాధలుండవు.

కాబట్టి ఇలాంటి టేస్టీ డ్రింక్స్‌ని మీరే స్వయంగా ఇంట్లో చేసుకోండి.. హాట్ సమ్మర్‌లో ఇలాంటి కూల్ డ్రింక్స్‌తో హ్యాపీగా గడిపేయండి..

ఇవి కూడా చదవండి..



Summer Fruits : ఈ 6 పండ్లు తీసుకుంటే సమ్మర్ ఎఫెక్ట్ అంతగా ఉండదు..
First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...