40 ఏళ్ల వయస్సులో ఫిట్‌నెస్ గుండెకు మంచిది!

మీ వయస్సు 40 దాటిందా? మీరు రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తున్నారా? అయితే మీ గుండెకు ముప్పేమీ లేదు. మధ్య వయస్సులో ఫిట్‌నెస్‌తో ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 56 శాతం తక్కువని ఓ పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: September 29, 2018, 8:45 AM IST
40 ఏళ్ల వయస్సులో ఫిట్‌నెస్ గుండెకు మంచిది!
నమూనా చిత్రం
  • Share this:
మధ్యవయస్సులో వ్యాయామం చేసేవాళ్లకు వృద్ధాప్యంలో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. ఒకవేల హృదయ సంబంధిత సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సైకియాట్రి నిర్వహించిన అధ్యయనంలో ఇదే విషయం తేలింది. మధ్య వయస్సులో ఫిట్‌నెస్‌తో ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 56 శాతం తక్కువ.

మధుమేహం, స్థూలకాయం, కిడ్నీ సమస్యల్లాంటి దీర్ఘకాల వ్యాధులకు డిప్రెషన్‌తో సంబంధముంది. అయితే ఇలాంటి రోగులు తరచూ వ్యాయామం చేస్తే ఈ రోగాలు నయమవుతాయని పరిశోధకులు తేల్చారు. వ్యాయామం చేయడం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. డిప్రెషన్‌తో సంబంధమున్న వ్యాధులు కూడా తగ్గుతాయి.

"వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే డిప్రెషన్‌ను నిరోధించొచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబోయే హృదయ సంబంధ వ్యాధుల రిస్క్‌ తగ్గుతుంది. ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం డిప్రెషన్, గుండెజబ్బులపై ఉంటుందన్న ఆధారాలు అయితే లేవు. మరిన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది."

మధుకర్ త్రివేది, సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్
50 ఏళ్ల సగటు వయస్సుగల 18 వేల మంది గుండె ఆరోగ్యంపై అధ్యయనం చేస్తే తేలిన ఫలితాలివి.
First published: September 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు