మాంసాహారం శరీరానికి ఎంతో మేలును చేస్తుంది. శరీరానికి తగిన ప్రోటీన్లను అందించడంతో పాటు నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే మాంసాహారాల్లోనూ మటన్ కు ప్రత్యేకమైన స్థానముంది. అంతేకాకుండా విభిన్నరకాలైన వంటకాలను దీంతో చేసుకోవచ్చు. ఎప్పుడూ మటన్ కూర అయితే ఏం బాగుంటుంది. ఈ సారి విభిన్నంగా మటన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ సూప్ ఆరోగ్య పరంగానూ ఎంతో మంచిది. దీన్ని మాంసా రసమ్ అని అంటారు.
మటన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
మటన్ (మేక కాళ్లు మాత్రమే)... 200 గ్రాములు
నల్ల మిరియాలు... 10 గ్రాములు
యావా, బార్లీ... 10 గ్రాములు
ఉలవలు... 10 గ్రాములు
అల్లం పొడి... 10 గ్రాములు
మటన్ సూప్ తయారీ విధానం..
ముందుగా మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం బార్లీ, ఉలవలు, అల్లం పొడిని 750 మిల్లీ లీటర్ల నీటిలో వేసి 200 మిల్లీ లీటర్ల వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోయాలి.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ మటన్ సూప్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర పోషణను పెంచేందుకు కూడా తోడ్పడుతుంది. ఇది ప్రోటీన్ సోర్స్, మినరల్ రిజర్వాయర్, గ్లూకోసమైనన్, హైఅలురోనిక్ ఆమ్లం, కొండ్రోయిటిన్ ఉండటం వల్ల కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది సిస్టిన్, హిస్టిడిన్, గ్లైసిన్, సమ్మేళనం. అంతేకాకుండా ఇందులో అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటుంది.
జాగ్రత్తలు..
మటన్ సూప్, ఉడకబెట్టిన పులుసు మొదలైనవి.. జీర్ణ సామర్థ్యాన్ని పరిగణించిన తర్వాత వాడాలి.