Home /News /life-style /

Mental Health Insurance: ఇకపై మెంటల్ హెల్త్ కు కూడా బీమా కవరేజి

Mental Health Insurance: ఇకపై మెంటల్ హెల్త్ కు కూడా బీమా కవరేజి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mental Health Insurance: సెప్టెంబరు 2020 వరకు కూడా ఆరోగ్య బీమా పథకాల్లో మెంటల్ హెల్త్ ను కవర్ చేయలేదు. ఇటీవల కాలంలో నియంత్రణా పరమైన మార్పులతో బీమా పరిధులు విస్తరించి మానసిక అనారోగ్య కవరేజీని చేర్చారు.

ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి మంచి జీవితాన్ని జీవించే హక్కు ఉంది. మంచి జీవితమంటే భౌతికంగా, మానసికంగా ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా బతకడం. ఈ రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శనివారం(అక్టోబరు 10) మానసిక ఆరోగ్య దినోత్సవం(మెంటల్ హెల్త్ డే). ఇటీవలే మెంటల్ హెల్త్ ను ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం భారతదేశంలో దాదాపు 90 మిలియన్లు(90 లక్షలు) మంది మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకా నిపుణుల సహకారం తీసుకునేవారిని ఇందులో కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. సమాజం ఏమనుకుంటుందోనని చాలా మంది మానసిక అనారోగ్యాన్ని సామాజిక కళంకంగా భావిస్తారు. వేగవంతమైన జీవన శైలి, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి మరింత తీవ్రతరం చేశాయి. ఉద్యోగ సమస్యలు, వైరస్ ముప్పు, నిద్ర భంగం, నిరాశ మొదలైన వాటివల్ల మానిసిక ఆరోగ్యాని మరింత ఆటంకం కలిగిస్తున్నాయి.

చాలా మంది పట్టించుకోవడం లేదు..
ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ మానసిక ఆరోగ్యమనేది చాలా మందికి మొదటి ప్రాధాన్యత కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. "సుఖంగా జీవించడంలో మానసిక ఆరోగ్యం ముఖ్య భాగం" గురించి అవగాహన కల్పించడంలో మనమందరం కృషి చేద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ప్రజల మనస్తత్వాన్ని విస్తృతం చేయడానికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నిజాయితీగా చర్చించడానికి తద్వారా అవసరమైతే వృత్తిపరమైన సాయం పొందడానికి సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్య రుగ్మతల సంకేతాలేంటి
చాలా కేసుల్లో మానసిక ఆరోగ్య రుగ్మతలను పట్టించుకోకపోవడం వల్లనే జరుగుతంది. అసాధారణమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, అలసట, దూరం, నిస్సహాయ భావన, మాదకద్రవ్య దుర్వినియోగం, మానసిక స్థితి, చిరాకు, ఆత్మహత్య ఆలోచనలు, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించలేకపోవడం లాంటి కారణాలు మానసిక ఆరోగ్యానికి సంకేతాలు.

మానసిక అనారోగ్యానికి చికిత్స
ఈ సంకేతాలు దీర్ఘకాలంగా కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మానసిక అనారోగ్య మానసిక, శారీరక మూల్యాంకనాల నిర్ధారణల ఆధారంగా సరైన చికిత్సను త్వరగా అనుసరించవచ్చు. కేసు ఆధారంగ చికిత్స కోర్సు కూడా మారుతుంది. సైకోథెరపీ, మెడికేషన్, ప్రత్యామ్నాయ చికిత్స అనే దశల్లో సరైన మార్గదర్శకత్వంతో నిరంతర సంరక్షణతో ఇది సహాయపడుతుంది. అందరం భిన్నమైన మనుషులమని భావించడం చాలా ముఖ్యం. అందువల్ల, ఒక వ్యక్తికి ఏది పని చేస్తుందో అది మరొకరికి పని చేయకపోవచ్చు. ఇది సరైన రోగ నిర్ధారణ చేయడానికి, సరైన చికిత్స ప్రోటోకాల్ పొందటానికి సరైన వైద్య సంప్రదింపులకు కట్టుబడి ఉండటాన్ని ఇది బలవంతం చేస్తుంది.

మనవంతు తోడ్పాటు అందించాలి
మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకొని 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ప్రగతి శీల, సరైన దిశలో ప్రయాణించడానికి చాలా దూరం ఉంది. మానసిక ఆరోగ్య సవాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు తమకు తాము నిర్ణయాలు తీసుకోలేరు. మనవంతుగా ఇందుకు కొంచెం తోడ్పాటు అందించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితుల లేదా సహచరులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే వారికి తక్షణ సాయం, మద్దతు అందించాలి. ప్రజలు ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సున్నితంగా వ్యవహరించాలి. అవసరాన్ని, పరిస్థితిని తెలుసుకొని ప్రవర్తించాలి.

మానసిక ఆరోగ్యంపై హెల్త్ ఇన్సురెన్స్
సెప్టెంబరు 2020 వరకు కూడా ఆరోగ్య బీమా పథకాల్లో మెంటల్ హెల్త్ ను కవర్ చేయలేదు. ఇటీవల కాలంలో నియంత్రణా పరమైన మార్పులతో బీమా పరిధులు విస్తరించి మానసిక అనారోగ్య కవరేజీని చేర్చారు. ఎస్బీఐ జనరల్ అందించే ఆరోగ్య బీమా పథకాలన్నీ మెరుగుపరిచారు. తద్వార మీకు సురక్షణతో పాటు భరోసాకు ఎస్బీఐ జనరల్ హామీ ఇస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Health Insurance

తదుపరి వార్తలు