హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Men Health: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. టెస్టోస్టెరాన్ తగ్గినట్లే? శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం

Men Health: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. టెస్టోస్టెరాన్ తగ్గినట్లే? శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Men Health: వయస్సు మీద పడేకొద్దీ.. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే వీర్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీనినే ఆండ్రోపాజ్ అంటారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    సాధారణంగా మహిళలందరూ 50 ఏళ్ల తర్వాత మెనోపాజ్‌(Menopause)ను అనుభవిస్తారు. అండాశయ నిల్వలో క్షీణత కారణంగా ఈ దశ వస్తుంది. అంటే ఆ వయసులో వారికి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పీరియడ్స్ ఆగిపోతాయి. లైంగిక వాంఛలు కూడా తగ్గుతాయి. ఐతే పురుషులు కూడా ఇదే విధమైన అనుభవాన్ని అనుభవిస్తారని మీకు తెలుసా..? టెస్టోస్టెరాన్ స్థాయి అకస్మాత్తుగా తగ్గడం వల్ల పురుషుల్లోనూ ఇలాంటి దశ వస్తుంది. దీనిని ఆండ్రోపాజ్ లేదా మేల్ మెనోపాజ్ అంటారు. ఆండ్రోపాజ్‌లో ఉన్న మగవారికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. కోరికలు కూడా అంతగా ఉండవు. ఇది సాధారణమే అయినప్పటికీ.. దీని గురించి బయట ఎక్కువగా చర్చించనందున.. చాలా మందికి తెలియదు. వయసు పెరిగే కొద్దీ పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ (Testosterone) ఉత్పత్తి తగ్గడం సహజమే. మధుమేహం ఉన్న వారిలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.

    కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది.. తింటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్.. తెలుసుకోండి

    ఆండ్రోపాజ్ (Andropause) సంకేతాలు:

    చిన్నపనికే అలసట కలుగుతుంది,

    దేనిపైనా ఏకాగ్రత ఉండదు.

    మానసిక తీక్షణత తగ్గుతుంది.

    ఒంట్లో శక్తి సామర్థ్యాలో తగ్గుతాయి.

    చిన్న కారణానికే చిరాకు వస్తుంది.

    కండరాల్లో అప్పుడప్పుడూ నొప్పి వస్తుంది.

    చేతులు, కాళ్లు చల్లగా అవుతాయి.

    శరీరంపై దురద కలుగుతుంది

    లైంగిక సామర్థ్యం, కోరికలు తగ్గిపోతాయి.

    ఆండ్రోపాజ్‌కి కారణమేమిటి?

    పురుషులలో టెస్టోస్టెరాన్ వల్లే అనేక క్రియలు జరుగుతాయి. టెస్టోస్టెరాన్ ఎముకల ఆరోగ్యానికి, రక్త ఉత్పత్తికి కూడా ముఖ్యమైనది. వయస్సు మీద పడేకొద్దీ.. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే వీర్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీనినే ఆండ్రోపాజ్ అంటారు. ఆండ్రోపాజ్ 40 సంవత్సరాల వయస్సులో లేదా అంతకుముందు కూడా ప్రారంభం కావచ్చు. ఐతే అందరికీ వస్తుందని చెప్పలేం. కొందరిలో మాత్రం అంతా సాధారణంగానే ఉంటుంది. ఒకవేళ ఆండ్రోపాజ్ వచ్చినా.. చాలా మంది బయటకు చెప్పుకోరు. వైద్యుడి దగ్గరకు వెళ్లరు. ఒకవేళ చెబితే.. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని ఆందోళన పడుతుంటారు. కానీ ఇది చాలా సాధారణమైన విషయమని అందరూ తెలుసుకోవాలి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే.. తప్పనిసరిగా డాక్టర్‌ని కలవాలి. మీలో టెస్టోస్టెరాన్ స్థాయిని ఎంత ఉందో తెలుసుకునేందుకు రక్త పరీక్ష చేస్తారు. ఒకవేళ తక్కువగా ఉంటే హార్మోన్ పునఃస్థాపన చికిత్స (HRT) సూచించే అవకాశముంది. దీనితో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

    (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Health, Health Tips, Life Style, Lifestyle

    ఉత్తమ కథలు