ఆడవాళ్ల కంటే మగాళ్లలో బ్రెయిన్ త్వరగా పాడవుతుందట... ఆసక్తి రేపుతున్న పరిశోధన విషయాలు

Brain Theory : ఇది మగాళ్లకు విచారం కలిగించే విషయం. అయినా తెలుసుకుంటే... బ్రెయిన్ త్వరగా పాడవకుండా జాగ్రత్త పడొచ్చు.

Krishna Kumar N | news18-telugu
Updated: February 8, 2019, 10:55 AM IST
ఆడవాళ్ల కంటే మగాళ్లలో బ్రెయిన్ త్వరగా పాడవుతుందట... ఆసక్తి రేపుతున్న పరిశోధన విషయాలు
బ్రెయిన్‌పై ఆసక్తికర అంశాలు
Krishna Kumar N | news18-telugu
Updated: February 8, 2019, 10:55 AM IST
మగాళ్లకూ, మహిళలకూ కొన్ని అంశాల్లో తేడాలు ఉన్నట్లే... బ్రెయిన్ కూడా తేడాగానే ఉందంటున్నారు పరిశోధకులు. జనరల్‌గా మనిషికి ముసలితనం వస్తున్న కొద్దీ.. బ్రెయిన్ కుచించుకుపోతూ (చిన్నది అవుతూ) ఉంటుంది. ఈ విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిల మెదడే త్వరగా కుచించుకుపోతోందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తల చేసిన పరిశోధనలో తేలింది. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో... మగాళ్ల కంటే... అమ్మాయిల బ్రెయిన్ నాలుగేళ్లు ఆలస్యంగా చిన్నదవుతోందట. ఉదాహరణకు ఓ మగాడికి 50 ఏళ్లకు బ్రెయిన్ కొంత కుచించుకుపోతే... అదే స్థాయిలో మహిళకు కూడా కుచించుకుపోవడానికి 54 ఏళ్ల వయసు రావాల్సివస్తోందన్నమాట.

mens brains, womens brains, study on human brains, health, brain tips, brain sharp ideas, why brain damage, brain cells damage, brain secrets, బ్రెయిన్, మెదడు, పరిశోధన అంశాలు
బ్రెయిన్‌పై ఆసక్తికర అంశాలు


దీనర్థం మగాళ్ల బ్రెయిన్ ఫాస్ట్‌గా పనిచేసేసి, త్వరగా అలసిపోయి, కుచించుకుపోతోందని కాదు. మహిళలతో పోల్చితే మగాళ్లలో ముసలితనం త్వరగా వస్తోందట. మల్లింక్రోడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రేడియోలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మను గోయల్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటున్నామన్న ఆయన... ముసలితనంలో మగాళ్ల కంటే మహిళలే ఎక్కువ తెలివిగా ఆలోచించడానికి ఇదీ ఓ కారణమని చెప్పారు.

mens brains, womens brains, study on human brains, health, brain tips, brain sharp ideas, why brain damage, brain cells damage, brain secrets, బ్రెయిన్, మెదడు, పరిశోధన అంశాలు
బ్రెయిన్‌పై ఆసక్తికర అంశాలు
121 మంది మహిళలు, 84 మంది మగాళ్లపై పరిశోధనలు సాగించగా... వాళ్లలో 20 నుంచీ 82 ఏళ్లవారున్నారు. ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు. ఓవరాల్‌గా మనకు అర్థమయ్యేదొకటే... అబ్బాయిలు కాస్త తమ బ్రెయిన్‌పై కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. అప్పుడప్పుడూ అయినా ఆ సుడోకూ, పజిల్స్ లాంటివి ఆడుతూ... బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలి. అంతేకదా....

ఇవి కూడా చదవండి :


ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం


ఒక గ్రాము తేలు విషం రూ.7,30,000 ఎందుకో తెలుసా? ఆసక్తికర విషయాలు


ఈ సిగరెట్లు తాగితే హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో భయంకర వాస్తవాలు

First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...