Health : మెనోపాజ్ సమస్య వెంటాడుతోందా... ఈ ఆహారం తీసుకుంటే ఎంతో మేలు...

Health Tips for Menopause Problem : వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలకు సరికొత్త సమాధానాలు దొరుకుతున్నాయి. తాజాగా మెనోపాజ్ సమస్యకు డాక్టర్లు ఈ పరిష్కారం చెబుతున్నారు.

news18-telugu
Updated: February 21, 2020, 2:23 PM IST
Health : మెనోపాజ్ సమస్య వెంటాడుతోందా... ఈ ఆహారం తీసుకుంటే ఎంతో మేలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Health Tips for Menopause Problem : మెనోపాజ్ సమస్య... మధ్య వయసు మహిళలకు ఎక్కువగా ఉంటుంది. ఐతే... ఆ వయసులోనే వాళ్లు ఎక్కువ బిజీగా ఉంటారు. తెల్లారింది మొదలు పిల్లల్ని రెడీ చెయ్యడం, రెండు మూడు రకాల వంటలు చెయ్యడం, వారు ఆఫీసులకు వెళ్లేందుకు రెడీ అవ్వడం ఇలా రోజంతా పనులు ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలో వారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోలేరు. మెనోపాజ్ సమస్య వెంటాడుతున్నా... దానిపై దృష్టి పెట్టే సమయం కూడా లేక... మనసులోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు సీజనల్ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా, రెగ్యులర్‌గా తినాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఈ కూరగాయలు, ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకు సంబంధించి... జరిపిన పరిశోధన వివరాల్ని మెనోపాజ్ జర్నల్‌లో వివరించారు. హార్మోన్ థెరపీలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న మహిళలు... ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

నార్త్ అమెరికా మెనోపాజ్ సొసైటీ (NAMS) ప్రకారం... ఈ రోజుల్లో తినే ఫ్రై ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక మాంసాహారం, పిజ్జా, బర్గర్ల వంటివి మెనోపాజ్ సమస్యల్ని ఏమాత్రం తగ్గించట్లేదని తెలిసింది. అదే ఆహారపు అలవాట్లు మార్చుకుంటే... తాజా ఆహారాన్ని తీసుకుంటే... ఈస్ట్రోజన్ ఉత్పత్తి, మెటబాలిజం, మెనోపాజ్ లక్షణాల విషయంలో ఆరోగ్యకర పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు.

మధ్యధరా సముద్ర దేశాల మహిళలు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, పప్పులు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు. వాళ్లలో మెనోపాజ్ సమస్యలు తక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఐతే... ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా అతిగా తినడం మంచిది కాదు. అంటే... ఒకే రకం పండ్లను తినడం, ఒకే రకమైన కూరగాయల్ని అధికంగా తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోగా... వ్యతిరేక ప్రభావం కూడా ఉంటుందంటున్నారు డాక్టర్లు. అందువల్ల అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలూ తింటూ ఉండాలని సూచిస్తున్నారు.

ఈ మొత్తం పరిశోధన ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకైతే... తాజా ఆహారం తినడం వల్ల చక్కటి ఫలితం ఉందంటున్నారు. కాబట్టి... మధ్య వయసు మహిళలు... మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్నవారు... పండ్లు, కూరగాయలు, ఆకుకూరలూ ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు