Home /News /life-style /

Men hair care: మగవారి పలుచని హెయిర్‌ను ఇంటి చిట్కాతో కవర్‌ చేయవచ్చు!

Men hair care: మగవారి పలుచని హెయిర్‌ను ఇంటి చిట్కాతో కవర్‌ చేయవచ్చు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hair fall: వెంట్రుకలు రాలిపోవడం సహజం. ఇక వయస్సు పైబడినా కొద్ది ముఖ్యంగా మగవారిలో హెయిర్‌ లాస్‌ సమస్య ఉంటుంది. ఇది రానురాను బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంటంది. ఇలాంటి సమస్య ఎదురైనపుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుని బాధపడతారు. అయితే మీకు ఉన్న పలుచని హెయిర్‌ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా కూడా కవర్‌ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
వయస్సుతో సంబంధం లేకుండా హెయిర్‌ కోల్పోయినవారు Hair loss  అలాగే ఉండాల్సిన పనిలేదు. టెక్నాలజీ వృద్ధి చెందింది. ఎన్నో విజయవంతమైన చికిత్సలు ఉన్నాయి. సరైన డెర్మటాలజిస్టును కలిసి ట్రీట్మెంట్‌ కూడా పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మగవారిలో హెయిర్‌ ఫాల్‌ మూడు విధాలుగా ఉంటుంది.

  1. తల క్రౌన్‌ పార్ట్‌ crown part నుంచి వెంటుకలు రాలిపోవడం.

  2. తల మొత్తం హెయిర్‌ ఫాల్‌ కావడం.

  3. అక్కడక్కడా హెయిర్‌ లాస్‌ అవ్వడం.
    హెయిర్‌ పూర్తిగా కోల్పోవడానికి ముందే కొన్ని చిట్కాలను పాటించాలి. ఆండ్రోజెనిటిక్‌ అలోపేషియా, ఏజింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, స్ట్రెస్, మెడికేషన్స్, వ్యాయామం లేకపోవడం, స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్, లూపస్, డయాబెటీస్‌ Diabetes రోగాల కారణంగా కూడా హెయిర్‌ లాస్‌ అవుతుంది. ఏ కారణం వల్ల వెంటుకలు ఊడిపోతాయో తెలియదు. కానీ, ఈ హెయిర్‌ ఫాల్‌ను కాస్త తగ్గించుకోవచ్చు. ఇంతకు ముందు పౌడర్స్, కాన్సిలర్‌లతో పలుచని హెయిర్‌ను కవర్‌ చేసే రోజులు పోయాయి. దీనికి మూడు విధాలుగా కంట్రోల్‌ చేయవచ్చు.



  • డెర్మటాలజిస్టు Dermatologist ద్వారా హెయిర్‌ కంట్రోల్‌ చేసుకోవడం.

  • హెయిర్‌ స్టైలిస్టును కలిసి హెయిర్‌ కేర్‌ తీసుకోవడం.
    ఆండ్రోజెనిటిక్‌ అలొపెషియా సమస్యకు శాశ్వత ట్రీట్మెంట్‌ ఉండదు. కానీ, హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేయవచ్చు.


ఇది కూడా చదవండి: డ్రగ్స్‌ తీసుకోవడానికి కారణాలు.. ఆశ్చర్యకర నిజాలు?



 ఇంటి చిట్కాలతో కూడా హెయిర్‌ ఫాల్‌ సమస్యను ఎలా అరికట్టాలో చూద్దాం.

  • ఉసిరికాయ Amla , నిమ్మకాయ రసాన్ని కలిపాలి. దానిలో ఆమ్లా పౌడర్‌ను కూడా జత చేసి పలుచని హెయిర్‌ ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత హెయిర్‌ వాష్‌ చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి ప్రయత్నించండి.

  • ఎగ్‌ యోక్‌ మాస్క్‌..
    ఎగ్‌ యోక్‌ను బాగా కలపాలి. దీన్నిపై అప్లై చేసుకుని 30 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌ పెట్టుకోవాలి.

  • గోరువెచ్చటి కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటూ ఉండాలి. లేదా గ్రీన్‌ టీని వారానికి ఒకసారి వాడటం వల్ల హెయిర్‌ ఫాల్‌ సమస్య తగ్గుతుంది.

  • కొబ్బరి పాలు 1/2 కప్పు, మూడు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌తో హెయిర్‌ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. కుదుళ్ల భాగం నుంచి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత షవర్‌ క్యాప్‌తో తలను 15 నిమిషాలపాటు కవర్‌ చేసుకుని, ఆ తర్వాత షాంపూ చేసుకోవాలి.


ఇది కూడా చదవండి: మీ కాళులో చెడు కొలెస్ట్రాల్ ఉంటే.. ఈ లక్షణాలు..!



  • విటమిన్‌ ఈ హెయిర్‌ మాస్క్‌.. రెండు క్యాప్సూల్స్, ఒక స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్, కొకనట్‌ ఆయిల్, కొద్దిగా ఎసెన్‌షియల్‌ ఆయిల్‌ కలిపి పెట్టుకోవాలి. ఇది హెయిర్‌ బ్రేకేజీని కూడా నివారిస్తుంది.

  • ఇంకా తలను రోజూ కడగకూడదు. హెయిర్‌ డ్రైయర్స్‌ను వాడద్దు. హెయిర్‌ కలర్స్‌ను కూడా లిమిటెడ్‌గా వాడాలి. పలుచని హెయిర్‌ను తగ్గించుకోవడం సులభం. డెర్మటాలజిస్టును కూడా ఒకసారి కలిసి వారి సూచనలు తీసుకోవడం మేలు.

Published by:Renuka Godugu
First published:

Tags: Hair problem tips

తదుపరి వార్తలు