హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

అప్పుడు అబ్బాయి... ఇప్పుడు అమ్మాయి..!

అప్పుడు అబ్బాయి... ఇప్పుడు అమ్మాయి..!

16 ఏళ్ల వయస్సులో సాహూ అబ్బాయిలను చూసి ఆకర్షితురాలయ్యేది. అబ్బాయి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అసూయగా ఫీలయ్యేది. నన్నెందుకు అలా అడగరని భావించేది. ట్రాన్స్‌జెండర్లను కలిసి రూ.3 లక్షలు ఖర్చుపెట్టి ఢిల్లీలో లింగమార్పిడి చేయించుకుంది. అప్పుడే సాహూ కాస్తా మేఘన సాహూగా మారిపోయింది.

16 ఏళ్ల వయస్సులో సాహూ అబ్బాయిలను చూసి ఆకర్షితురాలయ్యేది. అబ్బాయి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అసూయగా ఫీలయ్యేది. నన్నెందుకు అలా అడగరని భావించేది. ట్రాన్స్‌జెండర్లను కలిసి రూ.3 లక్షలు ఖర్చుపెట్టి ఢిల్లీలో లింగమార్పిడి చేయించుకుంది. అప్పుడే సాహూ కాస్తా మేఘన సాహూగా మారిపోయింది.

16 ఏళ్ల వయస్సులో సాహూ అబ్బాయిలను చూసి ఆకర్షితురాలయ్యేది. అబ్బాయి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అసూయగా ఫీలయ్యేది. నన్నెందుకు అలా అడగరని భావించేది. ట్రాన్స్‌జెండర్లను కలిసి రూ.3 లక్షలు ఖర్చుపెట్టి ఢిల్లీలో లింగమార్పిడి చేయించుకుంది. అప్పుడే సాహూ కాస్తా మేఘన సాహూగా మారిపోయింది.

ఇంకా చదవండి ...

  ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసింది. కానీ బతకడానికి అడుక్కోవాల్సి వచ్చింది. నృత్యాలు చేస్తూ పొట్టపోసుకోవాల్సి వచ్చింది. ఆమె చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక కాదు. చాలా ఉద్యోగాలున్నాయి. కానీ ఎవరూ జాబ్ ఇవ్వలేదు. కారణం... ఆమె మగాడిగా పుట్టి అమ్మాయిలా పెరగడమే. సమాజంలో సమానత్వం, గౌరవమర్యాదలు అందుకోవడానికి కొన్నేళ్లపాటు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొంది 28 ఏళ్ల మేఘన సాహూ. మధ్యతరగతి కుటుంబంలో అబ్బాయిలా పుట్టిన సాహూకు చిన్నప్పటి నుంచి కాటుక, లిప్‌స్టిక్ పెట్టుకోవడం, అమ్మాయిలా ముస్తాబవడమంటే ఎంతో ఇష్టం. అలా చేసిన ప్రతీసారీ స్నేహితులు, బంధువులు విచిత్రంగా చూసేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. తల్లిదండ్రులు తిట్టేవాళ్లు. కొట్టేవాళ్లు.

  నన్ను హేళన చేయడం, మందలించడం, తిట్టడం లాంటి చర్యలతో ఇక నేను మేకప్ వేసుకోవడం ఆపేశాను. తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకున్నాను. అబ్బాయిలా నటించడం మొదలుపెట్టాను. కానీ నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని నాకు తెలుసు. నా గొంతు కూడా అలాగే ఉండేది.

  మేఘన సాహు

  16 ఏళ్ల వయస్సులో సాహూ అబ్బాయిలను చూసి ఆకర్షితురాలయ్యేది. అబ్బాయి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అసూయగా ఫీలయ్యేది. నన్నెందుకు అలా అడగరని భావించేది. తనకూ ఓ బాయ్‌ఫ్రెండ్ ఉంటే బాగుండని అనుకునేది. ఎందుకంటే... తను ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్‌షిప్ చేసేది. అబ్బాయిలతో మాట్లాడాలంటే భయం, బెరుకు తనలో ఎక్కువ. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో రెండు పడవలపై ప్రయాణిస్తున్నట్టుగా మారింది తన పరిస్థితి. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఓసారి హిజ్రాల ముందు సాహును హేళన చేశారు స్నేహితులు.

  నేను హిజ్రా సమాజానికి చెందినవాడినని హేళన చేశారు. వాళ్లు అన్న మాట నిజమేనేమో అని నాకూ అనిపించింది. ఓసారి హిజ్రాలను కలిసి వాళ్ల ప్రవర్తన, మార్పులను గమనించాను. నాలోనూ అలాంటి మార్పులున్నాయని నాకు అర్థమైంది. వాళ్లతో మాట్లాడిన సందర్భం జీవితాన్ని మార్చేసింది.

  మేఘన సాహు

  తను అబ్బాయి కాదు అమ్మాయి అన్న చేదు నిజాన్ని ఎవరూ అంగీకరించలేదు. తనతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. అందరి ముందూ పరువు తీయొద్దని హెచ్చరించేవారు. సాహూ ఒడిశాలోని సంబాల్‌పూర్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ఉద్యోగం వచ్చింది. జీతం నెలకు రూ.25,000. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో మళ్లీ ఊహించని మలుపు. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. అబ్బాయిల పట్ల ఆకర్షణ గల తాను అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? అని భయం సాహూలో మొదలైంది. పెళ్లి చేసుకొమ్మని ఇంట్లో రోజూ ఒత్తిడి చేస్తుండటంతో ఇల్లొదిలి వెళ్లిపోయి... తనకు నచ్చినట్టు జీవించాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

  సాహూ అమ్మాయిలా జుట్టు పొడవుగా పెంచుకోవడంతో 2013లో ఉద్యోగంలోంచి తొలగించారు. ఇంట్లో మాత్రమే కాదు... సమాజంలో కూడా అలాంటి ఛీత్కారాలు తప్పవని అప్పుడే అర్థమైంది. గతంలో పరిచయమైన ట్రాన్స్‌జెండర్లను కలిసి రూ.3 లక్షలు ఖర్చుపెట్టి ఢిల్లీలో లింగమార్పిడి చేయించుకుంది. అప్పుడే సాహూ కాస్తా మేఘన సాహూగా మారిపోయింది. కొన్నాళ్ల తర్వాత చేతిలో డబ్బుల్లేవు. ఉద్యోగం లేదు.

  అమ్మాయిగా మారిపోయాను కాబట్టి ఇక ఉద్యోగం సులువుగా దొరుకుతుందనుకున్నాను. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఉద్యోగం ఇవ్వం అని నా మొహమ్మీద చెప్పలేదు. కానీ ఎలాంటి ఉద్యోగం లేదని చెప్పి మాట దాటేసేవాళ్లు.

  మేఘన సాహు

  తనలా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లతో కలిసి ఢిల్లీలోని బార్లల్లో నృత్యాలు చేసి డబ్బులు సంపాదించుకునేది. కానీ వ్యభిచారులన్న అనుమానంతో పోలీసులు కొట్టేవాళ్లు. దీంతో ఆ ఉద్యోగం వదిలేసింది. ఆ తర్వాత రైళ్లల్లో అడుక్కొని రోజూ రూ.300-500 వరకు సంపాదించేది. అయితే తన తోటి హిజ్రాలు అనేక మందితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించింది. భువనేశ్వర్‌లోని ఏసీ గది వదిలేసి రైల్వేట్రాక్‌లపై నివసించేది. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంది. మళ్లీ ఒడిషాకు వచ్చి ఓ ఎన్జీఓలో చేరింది. అక్కడే జీవితం మరో మలుపు తిరిగింది.

  అనేక మంది హిజ్రాలు హెచ్ఐవీ బారిన పడుతున్నారని తెలుసుకొని వారికి అవగాహన కల్పించేది మేఘన. ఎన్జీఓలో ప్రతీ నెల రూ.6,000-7,000 వరకు ఆదాయం వచ్చేది. ఎన్జీఓలో పనిచేస్తున్న ఆమెను వసుదేవ నాయక్‌ చూశాడు. అప్పటికే వసుదేవ నాయక్‌కు పెళ్లైంది. ఓ బిడ్డ కూడా ఉంది. అయితే నాయక్‌ను భార్య వదిలేసి వెళ్లడంతో... బిడ్డతో ఒంటరిగా ఉంటున్నాడు. మేఘనను చూసి ప్రేమలో పడిపోయాడు. కానీ ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మనసులో మాట చెప్పాడు. తనను తనలా గుర్తించేవాళ్లు దొరకడంతో మేఘన సంతోషానికి అవధుల్లేవు. 2017లో మేఘన, నాయక్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జీవితం చాలా బాగా గడుస్తోంది. మేఘన సాహూ ఇప్పుడు ఓలా క్యాబ్ డ్రైవర్‌గా ఉపాధి పొందుతోంది.

  ఓలాలోని క్యాబ్ పార్ట్‌నర్‌గా చేరేందుకు వెళ్లినప్పుడు కంపెనీ సంతోషంగా ఆహ్వానించింది. అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చింది. తొలి రోజు తొలి రైడ్‌ ఎవరు బుక్ చేసుకుంటారో అని కాస్త కంగారు పడింది. మహిళా ప్యాసింజర్ రైడ్ బుక్ చేసుకోవడం, తను మేఘనను అక్కా అని పిలవడంతో అస్సలు నమ్మలేకపోయింది. తనలా మిగతా ట్రాన్స్‌జెండర్లు కూడా ఇలాగే ఉపాధి చూసుకోవాలని కోరుకుంటోంది మేఘన. డ్రైవర్‌గా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు మేఘన. కారణం ఓలా అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతే.

  పొదుపు చేసిన డబ్బులతో తన భర్తకు సెకండ్ హ్యాండ్ కార్ కొనిచ్చింది. భర్త కూడా డ్రైవర్. మేఘన నెలకు రూ.15,000-18,000 సంపాదిస్తోంది. భర్తతో పాటు కొడుకునూ చూసుకుంటోంది. ఇప్పుడు ఆమె మొహంపై చెరగని చిరునవ్వు కనిపిస్తోంది. భారతదేశంలో మేఘన లాంటి ట్రాన్స్‌జెండర్లు 4.88 లక్షలు ఉంటారని 2011 నాటి గణాంకాలు చెబుతున్నాయి. ఓ వ్యక్తి లైంగిక ధోరణి అనేది తన వ్యక్తిత్వంలో అంతర్భాగమని 2014 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అప్పట్నుంచీ ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో థర్డ్ జెండర్‌గా గుర్తింపు వచ్చింది.

  ఇవి కూడా చదవండి:

  పెళ్లి గిఫ్ట్ 5 లీటర్ల పెట్రోల్!

  రూ.కోటి 30 లక్షల కారు కొన్న రైతు!

  వాట్సప్‌లో మూడు కొత్త ఫీచర్స్!

  అమెజాన్‌లో మీ డేటా భద్రమేనా?

  కాళ్లు కడిగిన నీళ్లు కార్యకర్తతో తాగించిన ఎంపీ!

  First published:

  Tags: LGBTQ, Ola, Transgender

  ఉత్తమ కథలు