సాధారణంగా మెడిటేషన్ (meditation) చేస్తున్నప్పుడు మీ కళ్లు మూసుకుని విశ్రాంతి పొందుతారు. ఆ సమయంలో డీప్ బ్రీత్ తీసుకుంటారు. మీ శరీరంలోని ఉద్విగ్నత విడుదల చేస్తారు. ఈ మొత్తం విధానంలో బ్రెయిన్ పై దృష్టి కేంద్రీకరిస్తాం. దీంతో ఏమవుతుంది? అని తక్కువ అంచనా వేయకండి.
ఇప్పుటి పరిస్థితులలో స్కూలుకు వెళ్లే విద్యార్థుల నుంచి ఇంట్లో ఉన్నవారు కూడా మానసిక ఒత్తిడికి (stress) లోనవుతున్నారు. ఈ ఒత్తిడి, ఉద్వేగాలను కట్టి ఉంచే ఏకైక మార్గం ధ్యానం. స్ట్రెస్ కు మెడిటేషన్ ఒక అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడిటేషన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ముందుగా మీరు మెడిటేషన్ (meditation) కు సమయాన్ని సెట్ చేసుకోండి. 5 నిమిషాల టైమర్ సెట్ చేసుకుని ధ్యానంలో విశ్రాంతి తీసుకోవాలి. చాలా సమయం మెడిటేషన్ గురించి ఆలోచించకూడదు. ఎలాగో మీ ఫోన్ లోనే టైమర్ అందుబాటులో ఉంటుంది.
మీరు ధ్యానం చేస్తున్న సమయంలో శరీరాన్ని విశ్రాంతి తీసుకోవాలి. మీ కళ్లు మూసి, విశ్రాంతి పొందండి. లోతుగా ఊపిరి పీల్చుకుని మెల్లిగా వదలాలి. ఈ విధానంలో ఊపిరి తల, ఛాతీ, పక్క, కడుపు నుంచి ఊపిరి బయటకు వెళ్తుంది. మళ్లీ ఇదే విధానం ద్వారా గాలి తీసుకుంటాం.
మీ మనస్సును కేంద్రీకరించి, మీరు మీ ఆలోచనలు, దృష్టిలో ఉంచుకుని పని చేస్తున్నప్పుడు వేరే ఏ విషయాన్ని ఆలోచించకూడదు. అస్తిత్వద మీద దృష్టి కేంద్రీకరించి, ఆలోచనలు మీ మనస్సులోకి ప్రవేశిస్తే వాటిని మృదువుగా అంగీకరించి విడిచిపెట్టాలి. మీ దృష్టిని మళ్లీ ప్రస్తుత సమయానికి తీసుకురావాలి. మీరు దీన్ని ఎంత బాగా చేస్తున్నారో, మీ దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఈ 5 నిమిషాల ధ్యానాన్ని ఎక్కువ సమయం కొనసాగించడం వల్ల ఎక్కువ ఉల్లాసం మీ రోజువారీ పనులపై చూపిస్తారు. దీంతో మీకు ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.
ధ్యానం చేసినప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు.. మీరు సౌకర్యంగా ఉన్న వాటిని సమీక్షించండి. ఈ సమయంలో బిగుతుగా ఉండే బట్టలను వేసుకోకండి. లేదా మెడిటేషన్ సమయంలో ఇబ్బందికరంగా కూర్చోవడం సరైంది కాదు. ముందుగా మీరు సౌకర్యవంతంగా కూర్చున్నారో లేదో చెక్ చేసుకోండి.
మెడిటేషన్ సరిగ్గా చేస్తున్నామా? లేదా? అని ధ్యానం చేసేటప్పుడు అనకోకూడదు. ఆలోచనలు తరచూ తలలోకి ప్రవేశిస్తాయి. కానీ, మీరు ప్రస్తుత క్షణానికి మీ దృష్టిని తీసుకువస్తే మాత్రమే మీరు ధ్యానం నుంచి ప్రయోజనం పొందవచ్చు.
ధ్యాన సంగీతాన్ని వినాలి. మీరు మెడిటేషన్ చేయడానికి అరోమాథెరపీని ఉపయోగించడానికి మెడిటేషన్ మ్యూజిక్ కూడా ఉపయోగించవచ్చు. తరచూ మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు కొద్దిసేపు ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఈ 5 నిమిషాల సెషన్లు మీకు అవసరమైనప్పుడు మరింత ప్రభావం చూపుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Yoga