Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...

Health Tips : మానసిక ప్రశాంతత కలగాలన్నా... మెంటల్ హెల్త్ ఉండాలన్నా... మెడిటేషన్ తప్పనిసరి. ఎంత ఏకాగ్రతతో మెడిటేషన్ చేస్తే అంత మంచిది. అదెలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 16, 2020, 2:46 PM IST
Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...
ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...
  • Share this:
Health Tips for Meditation : మెడిటేషన్ ఈ రోజుల్లో అందరూ చేస్తున్నదే. ఐతే... చాలా మంది ధ్యానంలో కూర్చోగానే... కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు, ఆఫీస్ పనులు, ఇంట్లో వంట ఇలా ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. అంతే... ఇక ధ్యానమూ లేదు... ఏమీ లేదు... ఇది మనకు సెట్ కాదులే అనుకుంటారు చాలా మంది. కానీ మనకు తెలుసు... మనం చిన్నప్పుడు ఏ సైకిలో నేర్చుకోవాలంటే... ఒక్కసారిగా అది వచ్చేదా... కొన్ని రోజులు తొక్కాలి... ఒకట్రెండుసార్లు కింద పడాలి... దెబ్బలు తగలాలి... అప్పుడే కదా సైకిల్ వచ్చేది. మైండ్‌పై కంట్రోల్ కూడా అంతే. వెంటనే రాదు. దాని కోసం మనం ఓపిక పట్టాలి. కొన్ని నెలలపాటూ (కనీసం 6 నెలలు) ధ్యానం చెయ్యాలి. అప్పుడు మనసుపై అదుపు వస్తుంది. మైండ్‌లో రకరకాల ఆలోచనలన్నీ తొలగి... ప్రశాంతత కలుగుతుంది. ధ్యానం చెయ్యడం వల్ల మనలో బీపీ (ఉంటే) తగ్గుతుంది. బ్రెయిన్‌లో కణాలు ఉత్తేజితం అయ్యి, ముసలితనం త్వరగా రాకుండా వాయిదా వేస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. చెడు ఆలోచనలు తొలగిపోతాయి. ఇలా చాలా లాభాలున్నాయి.

ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఇలా చెయ్యండి.


మనం ఓ విషయం మనం గుర్తుంచుకోవాలి. కొన్ని రకాల తైలాలు (Oils) మనలో ఏకాగ్రతను పెంచుతాయి. ఈ తైలాలను చెట్లు, మొక్కల రసాలు, పూల నుంచీ తయారుచేస్తారు. ఈ తైలాలను మన శరీరానికి రాసుకుంటే... సువాసన వెదజల్లుతాయి. అప్పుడు ఆ వాసన పీల్చుతూ... మన మనసు ధ్యానంలోకి వెళ్తుంది. శరీరానికి రాసుకోకపోయినా... మనం ధ్యానం చేసే గదిలో... స్ప్రే చేసినా చాలు... ఆ సువాసనకు మనం చక్కగా మెడిటేషన్ చెయ్యగలం.

ఆ తైలాలు ఏవంటే...

గంధపు తైలం (File)


Sandalwood oil : గంధపు తైలానికి మన మనసును ప్రశాంతంగా ఉంచే గుణం ఉంది. ప్రాచీన కాలం నుంచీ గంధంను రకరకాల పూజా కార్యక్రమాల్లో వాడుతున్నారు. గంధపు తైలం మన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడమే కాదు... ఏకాగ్రతను పెంచుతుంది కూడా. ఈ తైలం వాసన పీల్చుతూ... మెడిటేషన్ (ధ్యానం) చేశామంటే... ఇక మనసు హిమాలయ్యాల్లో ఎగురుతున్నట్లే. చెడు ఆలోచనలు పెట్టే బెడా సర్దుకొని వెళ్లిపోగా... అంతర్గతంగా మనస్శాంతి కలుగుతుంది.

లావెండర్ పూలతో ధ్యానానికి మేలు
Lavender oil : లావెండర్ పూల గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం వాటిని రకరకాల కాస్మొటిక్స్‌లో వాడుతున్నారు. ఎందుకంటే లావెండర్ ఆయిల్... మన మొత్తం శరీరాన్ని రిలాక్స్ చెయ్యగలదు. ఈ తైలపు మృదుతత్వం... మన మైండ్‌ను కూల్ కూల్ అంటూ కూల్ చేస్తుంది. ఎంత ప్రశాంతంగా మారిపోతామంటే... అవతలి వాళ్లు రెచ్చగొడుతున్నా... కామ్‌గా ఉంటాం. చెడు ఆలోచనలు, బాధలు, అశాంతి అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

ఏకాగ్రతకు సరైన తైలం క్లారీ సేజ్ తైలం


Clary sage : క్లారీ సేజ్ అనేది ఒకరకమైన మొక్క. ఇది చెడు ఆలోచనలను తరిమికొట్టగలదు. ఇది మన మూడ్‌ని మార్చేస్తుంది. మనలో ఏకాగ్రత పెంచగలదు. మనం శ్వాసపైనే ధ్యాస పెట్టేందుకు వీలు కలిగిస్తుంది. ఇది మనలో మానసిక స్థిరత్వాన్ని (emotional balance) తెప్పించగలదు. మెమరీ పవర్‌ని పెంచే శక్తి కూడా దీనికి ఉంది.

ఇప్పుడీ మూడు తైలాలూ కొనుక్కొని... రోజుకో రకం వాడినా చాలు... చక్కటి ధ్యానం సొంతమవుతుంది. ఈ తైలాల్ని మనం సూపర్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చుకోవచ్చు. కాస్త రేటు ఎక్కువే అయినా... ఇవి కలిగించే ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వీటిని కొనుక్కుంటున్నారు.

 

Pics : కన్నడ ముద్దుగుమ్మ మేఘశ్రీ క్యూట్ ఫొటోస్

ఇవి కూడా చదవండి :

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...

First published: May 16, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading