మానవ శరీరం(Human Body)లో ఏ అవయవం(Organ) పని చేయాలన్నా.. అవయవాలు(Organs) అన్నీ సక్రమంగా వాటికి తగినంత శక్తి అనేది అవసరం అవుతుంది. వీటితో పాటే మరో ముఖ్యమైనది కూడా అవసరం ఉంటుంది. అదే ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని పేరే రక్తం(Blood). ఇది మన శరీరంలోని ఎన్నో అవయవాలకు , కణాలకు ఆక్సిజన్ (Oxyzen)ను , శక్తిని సరఫరా చేస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్టోగ్రత హెచ్చుతగ్గుదలలో కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల (Infections) నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపివేస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలున్న రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది బరువు తగ్గడం ఒకటి. అవును మీరు విన్నది నిజమే.. రక్తం దానం చేస్తే.. నిజంగానే బరువు(Weight) తగ్గుతారు. అదెలాగో ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
రక్తం అనేది మానవ శరీరంలో ఎముక మజ్జలో తయారు అవుతుంది. వీటిలో మృదువుగా ఉండే కణజాలంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. మొదట ఎముక మజ్జ ఒక స్టెమ్ సెల్ ను తయారు చేస్తుంది. దానిలో అపరిపక్వంగా ఉన్న ఎరుపు, తెలుపు రక్తకణాలను, ప్లేట్‌లెట్లను తయారు చేస్తుంది. తర్వాత ఇవి విభజించబడి రక్తకణాలుగా మారుతాయి. ఇలా తయారు అయిన వాటిలో తెల్లరక్తకణాలు 12 రోజుల వరకు బతికి ఉంటాయి. తర్వాత ఎర్రరక్తకణాలు అనేవి 120 రోజులు బతికి ఉంటాయి. చివరకు ప్లేట్‌లెట్స్ అయితే 10 రోజుల వరకు బతికి ఉంటాయి. తర్వాత ఆ కాలం అయిపోగానే అవి చనిపోతాయి. తర్వాత మరో స్టెమ్ సెల్ నుంచి ఈ రక్తకణాలు అనేవి పుడతాయి.
అయితే ఇదే క్రమంలో మనం రక్తం దానం చేస్తే.. ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతాయి. వెంటనే శరీరం రక్తం తయారుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఎముక మజ్జతోపాటు కిడ్నీలు కూడా వీలైనంత ఎక్కువ రక్తాన్ని తయారుచేసేలా పని ప్రారంభిస్తాయి. ఎముక మజ్జకు సహకారంగా కిడ్నీలు ఎరిత్రోపొటీన్ అనే హార్మోన్ ను స్రవిస్తాయి. దీని ద్వారా 24 గంటల్లో రక్తం తయారు అవుతుంది. తర్వాత రెండు వారాల్లోకి హిమోగ్లోబిన్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలా చేరుకునే సమయంలో దానికి అధిక శక్తి కావాల్సి ఉంటుంది.
అప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. ఈ క్రమంలో మన శరీరం నుంచి దాదాపు 500 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. దీంతో మనం సహజంగానే బరువు తగ్గుతాం. 45 కిలోల కన్నా బరువు ఎక్కువగా ఉండి.. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న ఎవరైనా రక్తం దానం చేయవచ్చు. మూడు నెలలకు ఒకసారి 350 ఎంఎల్ రక్తం దానం చేయవచ్చు. బరువు తగ్గడంతో పాటు గుండెకు సంబంధించి వ్యాధులు కూడా దరి చేరవు. క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blood pressure, Donation, Health, Health benefits, Health Tips, Organs, Weight loss