Wife: భార్యకు షాకింగ్ అనుభవం.. మరో మగాడితో భర్త అలాంటి అనుభవం కోరుకుంటున్నాడని తెలిసి..

ప్రతీకాత్మక చిత్రం

నా పేరు ప్రీతి(పేరు మార్చాం). నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలైంది. మా ఆయన మంచివారు. ఆయనకు వ్యాపారం, ఇల్లు తప్ప వేరే ఆలోచన లేదు. కుటుంబం కోసం కష్టపడే మనస్తత్వం ఆయనది. కానీ.. పడక గదికొచ్చేసరికి ఎందుకనో ఆయన ఆసక్తి చూపడం లేదు.

 • Share this:
  శృంగారం గురించి మాట్లాడటం, ఎవరైనా చెబుతుంటే వినడం తప్పు.. అసలు సెక్స్ గురించి చర్చించడం చాలా పెద్ద తప్పు అనే భావన ఈ సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. నాలుగు గోడల మధ్య మాత్రమే మాట్లాడుకోవాల్సిన అంశంగా సమాజంలో ఎక్కువ మంది ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే.. సంసారంలో కీలకమైన శృంగారం అంశాన్ని ఒక బూతుగా, అదేదో చర్చించకూడని ప్రక్రియగా చూసే రోజులు పోయి.. సెక్స్ పట్ల అవగాహన ఉండాలన్న అభిప్రాయం సమాజంలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. శృంగారం అనేది దాంపత్యంలో ఒక మధురమైన అనుభూతి. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో అసంతృప్తులు మొదలైతే ఆ కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. అందుకే.. ఈ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే తత్వం ఎంతో అవసరం. శృంగార సమయంలో భార్యాభర్తలిద్దరూ భావప్రాప్తి పొందితేనే ఆ సంసారం సుఖమయంగా ఉంటుంది. లేని పక్షంలో అశాంతి రేగుతుంది. ఈ క్రమంలో భార్యాభర్తలు ఒకరితో మరొకరు చర్చించుకోలేక సెక్సాలజిస్ట్‌లను సంప్రదించి వారి సందేహాలను నివృతి చేసుకుంటుంటారు. అలా ఓ వివాహిత తన భర్త విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ.. వ్యక్తం చేసిన సందేహం, ఆ సందేహానికి సమాధానం ఇది.

  నా పేరు ప్రీతి(పేరు మార్చాం). నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలైంది. మా ఆయన మంచివారు. ఆయనకు వ్యాపారం, ఇల్లు తప్ప వేరే ఆలోచన లేదు. కుటుంబం కోసం కష్టపడే మనస్తత్వం ఆయనది. కానీ.. పడక గదికొచ్చేసరికి ఎందుకనో ఆయన ఆసక్తి చూపడం లేదు. ఇన్నేళ్లలో చాలా తక్కువ సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొన్నాం. ఈ క్రమంలోనే.. ఒక పాప పుట్టింది. కొన్నేళ్ల నుంచి ఆయన పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఎక్కువ సేపు ఫోన్లలోనే కాలం గడిపేస్తున్నారు. వేరే మహిళతో సంబంధం నడుపుతున్నారేమోనని అనుమానం వచ్చి ఆయన కాల్ చేసి మాట్లాడుతున్న నంబర్‌కు కాల్ చేయగా ఆయన మా ఆయన దుకాణంలో పనిచేసే గుమస్తా అని తెలిసింది. మీ ఆయన నన్ను శృంగారంలో పాల్గొనమని ఇబ్బంది పెడుతున్నాడని.. ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ఆ గుమస్తా నాతో ఫోన్‌లో చెప్పాడు. ఆ మాటలు విని నాకేం అర్థం కాలేదు. మా ఆయన ఒక మగవాడితో శృంగారం కోసం పరితపిస్తుండటం నాకు ఆశ్చర్యమేసింది. ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు. లేకపోతే నా సంసారం కుప్పకూలుతుందేమోనని భయంగా ఉంది.

  సమాధానం: మీ ఆయనకు హోమో సెక్సువల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే తన గుమస్తాతో శారీరక సుఖం కోరుకుంటున్నాడు. ఇలాంటి వారు మహిళలతో శృంగారం చేయడం కంటే పురుషులతో శృంగారం చేయడానికే ఇష్టపడతారు. మీ ఆయనకు తగిన కౌన్సెలింగ్ అవసరం. ఇలాంటి వాళ్లంతా హోమో సెక్సువల్ లక్షణాలు ఉన్నవాళ్లే అని కచ్చితంగా చెప్పలేం. కొందరు నీలి చిత్రాలను వీక్షించడం లేదా ఇంకెవరినో చూసి ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఈ తరహా ఆలోచనలకు కారణమవుతుంది. మీ ఆయన కూడా అలాంటి వారే. సైకలాజికల్ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించడం ద్వారా మీ ఆయనలో మార్పు తీసుకురావచ్చు.
  Published by:Sambasiva Reddy
  First published: