హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

వేర్వేరు గదుల్లో భార్యాభ‌ర్త‌లు: మంచిదంటున్న జ‌పాన్ వాసులు

వేర్వేరు గదుల్లో భార్యాభ‌ర్త‌లు: మంచిదంటున్న జ‌పాన్ వాసులు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

జ‌పాన్‌లో భార్య‌భ‌ర్త‌లు వేరువేరుగా ప‌డుకుంటున్నారు. దానికి కార‌ణం వారి మ‌ధ్య గొడ‌వ‌లు కార‌ణం కాదు. అలా ప‌డుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు, త‌మ పిల్ల‌ల‌కు మంచి జ‌ర‌గుతుంద‌ని వారి న‌మ్మ‌కం.

  జ‌పాన్‌లో ఎక్కువ మంది భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు ఉద్యోగ‌స్తులు. ఇద్ద‌రికీ వేర్వేరు ప‌నిగంట‌లు ఉంటున్నాయి. ఒక‌రు నిద్ర ఉన్న‌ప్పుడు మ‌రొకరు ప‌ని మీద లేచి ఉండాల్సి వ‌స్తోంది. దీంతో ఒకే ద‌గ్గ‌ర ప‌డుకుంటే ఒక‌రి వ‌ల్ల మ‌రొక‌రికి నిద్రాభంగం క‌లుగుతుంది. దీని వ‌ల్ల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యే అవ‌కాశం ఉంది.

  పిల్ల‌ల మంచి కోసం..

  ముఖ్యంగా త‌ల్లిదండ్రుల్లో ఒక‌రు పిల్ల‌ల ప‌క్క‌న ప‌డుకోవ‌డానికి మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా వారికి పిల్ల‌ల‌తో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్ల‌లు త‌మ భావాల‌ను స్వేచ్ఛ‌గా చెప్పుకోగ‌లుగుతారు. తండ్రి వేరే గ‌దిలో ప‌డుకోవ‌డం వ‌ల్ల ప‌ని వేళ‌ల్లో జ‌రిగే ఆల‌స్యం పిల్ల‌ల నిద్ర‌పై ప‌డ‌కుండా ఉంటుంది చెబుతుతున్నారు. పిల్ల‌లు ఎక్కువ సేపు నిద్రాభంగ క‌లుగ‌కుండా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటార‌ని వారి న‌మ్మ‌కం. దీని ద్వారా మానసిక ప్ర‌శాంత‌త ఏర్ప‌డి చ‌దువులో బాగా రాణిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు.

  వేరుగా ప‌డుకోవ‌డంతో ప్ర‌శాంత‌త‌..

  భార్య భ‌ర్త‌లు వేరుగా ప‌డుకోవ‌డం అంటే చాలా మంది వారి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌నే అభిప్రాయంలో ఉంటారు. కానీ అది స‌రికాదు. ప‌ని ఒత్తిడిలో ఉన్న వారు కాసేపు ఏకాంతంగా ఉంటే ప్ర‌శాంతంగా ప‌డుకోగ‌లుగుతారు. త‌రువాత స‌మ‌యం ఉత్సాహంగా అంద‌రితో సంతోషంగా గ‌డుతారు. లేకుంటే ప‌ని ఒత్తిడి కుటుంబీకుల మీద ప‌డి గొడ‌వ‌లు అయ్యే అవ‌కాశం ఉంది. నిద్ర‌లోని మాధుర్యం ఆస్వాదించాలంటే ప‌ని చేసిన వారు కాసేపు ఏకాంత ఉండాల‌ని జపాన్ వాసులు సూచిస్తున్నారు. దీని ద్వారా భార్యాభ‌ర్త‌ల మధ్య గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని వారు చెబుతున్నారు. పిల్ల‌ల ఆరోగ్యం కుటుంబ శ్రేయ‌స్సు కోస‌మే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని వారు సంతోషంగా చెబుతున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Husband, Japan, Wife, Wife and husband

  ఉత్తమ కథలు