లైఫ్ పార్టనర్‌తో గొడవపడితే షుగర్ వస్తుందట..

కొంతమంది కపుల్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అలాంటివారు జబ్బులకు గురవుతూనే ఉంటారు. ముఖ్యంగా లైఫ్‌పార్టనర్‌తో గొడవపడితే షుగర్ తప్పకుండా వస్తుందని నిపుణులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

news18-telugu
Updated: April 16, 2019, 6:11 AM IST
లైఫ్ పార్టనర్‌తో గొడవపడితే షుగర్ వస్తుందట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ మధ్యకాలంలో చాలామందిని వేధించే సమస్య షుగర్ వ్యాధి. ఆహారపు అలవాట్లు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. ఈ వ్యాధి చిన్నవయసులోనే దాడిచేస్తుంది. తాజాగా.. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మరో సరికొత్త విషయాన్ని తేల్చి చెప్పింది. తరచూగా జీవిత భాగస్వామితో గొడవపడేవారికి షుగర్ త్వరగా వస్తుందట.
అంతేకాదు, ఆర్థ్రయిటిస్ సమస్య కూడా దాడి చేస్తుందని పెన్సిల్వేనియా పరిశోధకులు తెలిపారు. ఆర్థ్రయిటిస్, మధుమేహం సమస్యలు ఉన్న రెండు వర్గాల వ్యక్తు మీద విడివిడిగా జరిపిన పరిశోధనలో, జీవిత భాగస్వామితో తగాదాలు పడ్డవాళ్లు అదే రోజున వారి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరిగినట్టు చెప్పారు.
ఇప్పటికే ఆహారశైలి, జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో దాడిచేసే మధుమేహం వ్యాధి.. ఇప్పుడు ఈ కారణంతో కూడా వస్తుందని తేల్చి చెప్పారు. కాబట్టి.. సరైన జీవనవిధానంతో.. జీవితభాగస్వామితో కూడా సరిగా ఉంటే ఆరోగ్యానికి మేలు.

ఈ వీడియో చూడండి..


First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...