హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Top Cancer Hospitals: భారతదేశంలో టాప్ 10 ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఇవే.. హైదరాబాద్‌లోనే ఎక్కువ..

Top Cancer Hospitals: భారతదేశంలో టాప్ 10 ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఇవే.. హైదరాబాద్‌లోనే ఎక్కువ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cancer Hospitals: ప్రస్తుతం క్యాన్సర్‌కు వివిధ రకాల చికిత్స మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, బాధితులు కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీనికి నివారణ లేదు. శరీరంలోని వివిధ భాగాలు, అవయవాలకు ఈ వ్యాధి సోకవచ్చు. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే బాధితులు కోలుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం క్యాన్సర్‌కు వివిధ రకాల చికిత్స మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, బాధితులు కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలో ప్రముఖ ఆసుపత్రులు క్యాన్సర్‌కు క్వాలిటీ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాయి. అందుకే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది రోగులు క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారు.


అనేక ఇండియన్ హాస్పిటల్స్ అంతర్జాతీయంగా NABH, JCI వంటి అక్రిడిటేషన్‌లను సాధించాయి. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన ఫలితాలు రాబడుతున్నాయి. ఎంతోమంది క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న టాప్ 10 ఇండియన్ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఏవో తెలుసుకుందాం.


1. అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, చెన్నై
చెన్నైలోని అపోలో స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్.. భారతదేశంలోని టాప్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటిగా గుర్తింపు పొందింది. సమర్థమైన సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజిస్ట్‌లతో కూడిన నిపుణుల బృందం, క్వాలిటీ ట్రీట్‌మెంట్ ఈ ఆసుపత్రికి బెంచ్‌మార్క్. హాస్పిటల్‌లో కొత్తగా నిర్మించిన కీమోథెరపీ వార్డు ఉంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం స్పెషల్ కేర్ యూనిట్ ఉంది. ఇక్కడ థైరాయిడ్, ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్పెషలైజ్డ్ క్లినిక్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, మెడికల్ అండ్ సర్జికల్ ఆంకాలజీ, డిజిటల్ మామోగ్రఫీ, హిస్టోపాథాలజీకి సంబంధించిన ట్రీట్‌మెంట్స్ అందిస్తుంది. రేడియోసర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీని ప్రారంభించిన మొదటి హాస్పిటల్ గ్రూప్ ఇది.


2. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్

అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రపంచ స్థాయి ట్రీట్‌మెంట్‌ను అందిస్తుంది. ఇందుకు అమెరికాతో పాటు భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన మెడికల్, సర్జికల్ టెక్నాలజీల కలయికతో బెస్ట్ క్యాన్సర్ కేర్ ట్రీట్‌మెంట్‌ అందిస్తోంది. ఈ హాస్పిటల్‌లో ప్రతి మెడికల్, సర్జికల్ స్పెషాలిటీలో అత్యంత అనుభవజ్ఞులైన, ఆంకాలజీపై పూర్తి అవగాహన ఉన్న వైద్యుల బృందం ఉంది. పెద్దలు, పిల్లలలో బ్లడ్ క్యాన్సర్‌ చికిత్స కోసం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ అందుబాటులో ఉంది


3. అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్

క్యాన్సర్ రోగుల అవసరాలను తీర్చడానికి అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ హైదరాబాద్‌లో పూర్తి సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని నిర్మించింది. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స తర్వాత సంరక్షణ వరకు మంచి సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్‌డ్ మెడికల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. రోగులు పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ట్రీట్‌మెంట్ అందించే సదుపాయాలు ఉన్నాయి. హాస్పిటల్‌లో ట్యూమర్ బోర్డ్ పేరుతో ప్రత్యేకమైన బృందం ఉంటుంది. ఈ బోర్డు ప్రతి క్యాన్సర్ కేసును సుదీర్ఘంగా చర్చించి, సాధ్యమైనంత ఉత్తమమైన ట్రీట్‌మెంట్ ప్లాన్‌ను ఎంపిక చేస్తుంది.


4. ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ NCR

ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ హెల్త్‌కేర్ గ్రూప్. ఈ సంస్థ గుర్గావ్‌లో 1000 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించింది. ఇక్కడి ఆంకాలజీ విభాగం భారతదేశంలోనే అత్యుత్తమమైనది. ప్రపంచ స్థాయి మెడికల్ టెక్నాలజీ, అత్యుత్తమ ట్రీట్‌మెంట్ సదుపాయాలు వంటివి.. ఈ ఆసుపత్రిని క్యాన్సర్ కేర్ ట్రీట్‌మెంట్ అందించే బెస్ట్ హాస్పిటల్‌గా నిలుపుతున్నాయి. ఇక్కడ క్రయోథెరపీ, హార్మోన్ థెరపీ, BRCA జీన్ స్టడీ, CA-125 టెస్ట్ వంటి అధునాతన మెడికల్ టెక్నాలజీతో రోగ నిర్ధారణ, చికిత్స చేస్తారు.


5. అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీ

అపోలో గ్రూప్ ఢిల్లీ యూనిట్‌లోని అపోలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఇంద్రప్రస్థ అపోలో) ఒక ఫేమస్ క్యాన్సర్-కేర్ హాస్పిటల్. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు అత్యుత్తమ సేవలను అందించడానికి క్యాన్సర్ నిపుణులు, ఆంకాలజిస్టులు, సర్జన్‌లు అందుబాటులో ఉన్నారు. వివిధ రకాల క్యాన్సర్‌లతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడానికి ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజిస్టులు కూడా ఉన్నారు.


6. BGS గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్, బెంగళూరు

BGS గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ అనేది పార్క్ పాంటై గ్రూప్ స్థాపించిన వెంచర్. ఇన్‌పేషెంట్ విభాగంలో ఒకేసారి 500 మందికి పైగా రోగులను చేర్చుకునే సామర్థ్యం ఈ హాస్పిటల్‌కు ఉంది. ఇది బెంగుళూరు నగరంలో అత్యుత్తమ క్యాన్సర్ కేర్ డిపార్ట్‌మెంట్‌ ఉన్న మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్. అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత అనుభవజ్ఞులైన వైద్యుల బృందం ఈ హాస్పిటల్ సొంతం.7. ఆర్టెమిస్ హాస్పిటల్, ఢిల్లీ NCR

ఆర్టెమిస్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ గుర్గావ్ నగరంలో ఉంది. 2007లో దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇది భారతదేశంలోని అత్యుత్తమ ఆసుపత్రులలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఇక్కడి క్యాన్సర్ కేర్ విభాగం క్యాన్సర్ రోగులకు ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తోంది. ఇందుకు లేటెస్ట్ మెడికల్, సర్జికల్ టెక్నాలజీలు ఉన్నాయి. ఈ హాస్పిటల్‌ను స్థాపించిన మూడు సంవత్సరాలలోనే ప్రతిష్టాత్మకమైన JCI గుర్తింపును పొందింది.


8. నానావతి హాస్పిటల్, ముంబై

ముంబైలోని పురాతన, అత్యంత ప్రసిద్ధ మెడికల్ సెంటర్లలో నానావతి హాస్పిటల్ ఒకటి. 350 పడకల ఆసుపత్రి, 55 మెడికల్, సర్జికల్ స్పెషాలిటీలు ఉన్నాయి. ఇక్కడి ఆంకాలజీ విభాగానికి మంచి గుర్తింపు ఉంది. ట్రీట్‌మెంట్‌ కోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న రోగులకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్ వంటి రీహ్యాబిలిటేషన్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Cholesterol: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి.. వాటి గురించి మన తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


Heart Diseases: గుండె విషయంలో అజాగ్రత్త వద్దు.. ఆ జబ్బులకు చెక్ పెట్టే మార్గాలు ఇవే..


9. మణిపాల్ హాస్పిటల్, బెంగళూరు

ఈ హాస్పిటల్‌ను మణిపాల్ గ్రూప్ బెంగుళూరులో నిర్మించింది. భారతదేశంలోని టాప్ 10 ఆసుపత్రులలో ఇది ఒకటిగా నిలుస్తోంది. దీని ఆంకాలజీ విభాగం భారతదేశంలోనే అత్యుత్తమమైనది. అన్ని రకాల క్యాన్సర్‌లను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఇక్కడ పూర్తి స్థాయి సదుపాయాలు ఉన్నాయి. క్యాన్సర్ సర్జరీ తర్వాత నిర్దిష్ట శరీర కణజాలాన్ని పునర్నిర్మించడానికి ప్లాస్టిక్ సర్జరీ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.


10. కాంటినెంటల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ & రేడియేషన్ సెంటర్, హైదరాబాద్

కాంటినెంటల్ హాస్పిటల్‌ను పార్క్‌వే పాంటాయ్ లిమిటెడ్ గ్రూప్ స్థాపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ హెల్త్‌కేర్ బ్రాండ్. ఇక్కడ రోగుల కోసం 750 పడకలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్‌లు, ICUలు విస్తృతంగా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ ఈ హాస్పిటల్‌లో ఉంది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Cancer

ఉత్తమ కథలు