Health Tips: ఈ ఫలంలో ఎన్నో పోషకాలు.. 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు.. వివరాలు ఇలా..

తొగరు పండ్లు

Health Tips: తొగరు ఫలం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అయితే దీనికి సంబంధించి ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. పూర్తి వివరాలను తెలుసుకుందాం..

  • Share this:
    తొగరు ఫలం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అయితే దీనికి సంబంధించి ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీనిని సేవిస్తే, క్యాన్సర్ తో పాటు ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తుందట. మీరు మార్కెట్లో సులభంగా తొగరు పండ్లను పొందవచ్చు. కరోనా కాలంలో చాలామంది రోగ నిరోధక శక్తి కోసం ప్రయత్నిస్తున్నారు. రకరకాల పండ్లను తింటూ ఉంటున్నారు. ఈ తొగరు పండ్లు తినడం వల్ల కూడా రోగనిధరక శక్తి పెరుగుతుంది. దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. లావు తగ్గితే అనేక రకాల వ్యాధుల నుంచి మనం బయట పడొచ్చు.

    కావునా తొగరు పండ్లను తిని ఉభకాయం నుంచి కూడా భయటపడే అవకాశం ఉంటుంది. తొగరు జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే సాధారణ ప్రజలను షుగర్ వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడుతుంది. సంతానం కావాలనుకునే వారికి కూడా ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి.. మహిళల పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి కూడా పనిచేస్తుంది.

    తొగరు ఫలంలో బీటా-గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో తొగరు ఫలం జ్యూస్ సేవించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు తెలిపారు. అదనంగా, ఇది సాధారణ క్యాన్సర్ నుంచి కూడా రక్షణ ఇస్తుంది. దీనిని కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొగరు జ్యూస్ తాగకూడదు. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
    Published by:Veera Babu
    First published: