కొత్త జంటలు SEXకు ఆసక్తి చూపట్లేదట.. రొమాన్స్ కూడా లేదంటున్న 51 శాతం మంది.. అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు

చాలా మంది వివాహితులు పెళ్లైన కొత్తలో మినహా రాను రాను సెక్స్ పట్ల ఆసక్తి చూపించట్లేదు. తాజాగా రియల్ ఫిక్స్ పోడ్ కాస్ట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. బ్రిటన్ లో చాలా మంది దంపతులు కేవలం పిల్లల కోసమే కలిసి ఉంటారని తేల్చింది.

news18-telugu
Updated: November 9, 2020, 2:00 PM IST
కొత్త జంటలు SEXకు ఆసక్తి చూపట్లేదట.. రొమాన్స్ కూడా లేదంటున్న 51 శాతం మంది.. అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే దంపతుల మధ్య అన్యోన్యత ఎంతో ఉండాలి. వారి మధ్య బంధం బలంగా ఉన్నప్పుడే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఇందులో శృంగారం కూడా ఓ భాగమే. అయితే చాలా మంది వివాహితులు పెళ్లైన కొత్తలో మినహా రాను రాను సెక్స్ పట్ల ఆసక్తి చూపించట్లేదు. తాజాగా రియల్ ఫిక్స్ పోడ్ కాస్ట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. బ్రిటన్ లో చాలా మంది దంపతులు కేవలం పిల్లల కోసమే కలిసి ఉంటారని తేల్చింది.
2 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 35 శాతం మంది తమ జీవిత భాగస్వామితో వాదనకు దిగుతారట. ఇదే సమయంలో 51 శాతం మంది తమ రిలేషన్ షిప్ లో ఎలాంటి రొమాన్స్ ఉండట్లేదని చెబుతున్నారు. జాతీయ సగటు ప్రకారం పెళ్లైన వారు నెలకు నాలుగు సార్లు కూడా శృంగారంలో పాల్గొనడం లేదు. మూడో వంతు (77 శాతం) సంబంధం సౌకర్యవంతంగా ఉందని, 15 శాతం మంది పునరావృత స్థితిలో ఉంటుందని, 12 శాతం మంది తమ జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. యూకేలో 1/6 వంతు మంది మహిళలు, పురుషులు కేవలం తోడు కోసమే సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

తమ ఫలితాలు వివాహ జీవితంలో సంతోషంగా ఎంత మంది ఉన్నారనే దానిపై జరిగిందని రియల్ ఫిక్స్ పోడ్ కాస్ట్ వ్యాఖ్యాత హట్టి బిషప్ తెలిపారు. వేలాది మంది పురుషులు, స్త్రీలు రిలేషన్ షిప్స్ సంపూర్ణంగా లేనట్లు తెలుస్తోందని, వివాహ బంధం నుంచి బయటకు రావడం కష్టంగా ఉన్నప్పటికీ ఇది ఎక్కువగా ఆనందానికి దారితీస్తుందని ఆయన అన్నారు. వివాహితులు కలిసి ఉండాలా, లేదా అనే విషయాలను తమ కొత్త పోడ్ కాస్ట్ ఫీచర్లలో కల్పిస్తామని అన్నారు. వివాహం ఒత్తిడితో కూడుకొని ఉంటుందని, ఇందుకు వారందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నాని చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం వివాహిత పురుషులు, స్త్రీలల్లో కేవలం 14 శాతం కంటే తక్కువ మంది తమ జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండని భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే వీరిలో పురుషులు పెళ్లి చేసుకున్నందుకు అధికంగా చింతిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా వివాహం.. ప్రేమను పూర్తిగా వేరుచేస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా నాలుగో వంతు మంది ఒంటరిగా ఉండటం ఇష్టంలేక తమ జీవిత భాగస్వామితోనే కలిసి ఉండేందుకు ఇష్టపడుతున్నారని వెల్లడైంది. సగం కంటే తక్కువ (47 శాతం మంది) పిల్లలు కారణంగా చూపుతున్నారు. నాలుగో వంతు మంది ఇతరులు ఏమనుకుంటారో అని ఆందోళన చెందుతున్నారు. ఇష్టంగా వివాహం చేసుకున్న వారిలో ఆరో వంతు మంది తమ జీవిత భాగస్వామి మోసం చేసిందని తెలిపారు. వన్ పోల్. కామ్ ప్రకారం ఐదు శాతం మహిళలతో పోలిస్తే 14 శాతం మంది పురుషులు చాలా సార్లు మోసం చేశారు. ఈ అధ్యయనం సంతోషకరమైన వివాహం సంకేతాలను వెల్లడించింది.

77 శాతం మంది పరస్ఫర విశ్వాసాన్ని అతి ముఖ్యమైన మూలస్తంభంగా పేర్కొన్నారు. ప్రతీ 10 మందిలో నలుగురు సంతృప్తికరమైన జీవితాన్ని ఎంచుకున్నారు. మిగిలిన వారు నిజాయితీ, ఇతరుల ఆసక్తులు, నిస్వార్థ భావనలను ఎంచుకున్నారు. వీటిని ఆధారం చేసుకుని బంధం ఎక్కువ కాలం కొనసాగుతున్నంత కాలం కామం, శృంగార కోరికలు అంత రహస్యమైనవి కావని బిషప్ తెలిపారు. సాధారణంగా ఒకరినొకరు అభినందించుకోవడం, నమ్మకం, గౌరవంతో ఉంటే బంధం బలపడుతుందన్నారు. శృంగారం, ఉత్సాహం లాంటి అంశాలు సంబంధాన్ని ఎక్కువ కాలం నడిపిస్తాయని చెప్పారు. వివాహ బంధంలో కష్టాలు రావడానికి కారణాలుగా.. రొమాన్స్ లేకపోవడం, సెక్స్ లేకోపోవడం, తక్కువ ఉత్సాహం, కోరికలు లేకపోవడం, వాదనలు, తగినంత సమయాన్ని కేటాయించకపోవడం, ఆర్థిక సమస్యలు, విభిన్న అభిరుచులు, ఆసక్తులు, తగినంత మాట్లాడకపోవడం, సోమరులుగా ఉండడం, స్వార్థమని తేల్చారు.
Published by: Nikhil Kumar S
First published: November 9, 2020, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading