Walnuts: వాల్నట్స్ తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదలరు

Benefits of Walnuts: ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అత్యధికంగా అందించే వాటిలో నట్స్ లో వాల్నట్స్ ఒకటి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాకుండా నిరాశకు లోనుకావడం, కుంగిపోవడం లాంటి లక్షణాలను తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకుస్తాయి.

news18-telugu
Updated: September 26, 2020, 3:49 PM IST
Walnuts: వాల్నట్స్ తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదలరు
Walnuts: వాల్నట్స్ తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదలరు
  • Share this:
మంచి ఆహారాన్ని సమతూల్యంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని ఎలాంటి ముప్పు ఉండదు. పోషకాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని శరీరానికి తగిన మోతాదులో తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాల్నట్స్ తినే ఉంటారు. తెలుగులో వీటినే అక్రోట్లని అంటారు. ఇవి పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అప్పుడు వాటి పాముఖ్యతను మనకు అర్థంకాకపోయినా వాటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఔన్సు వాల్నట్స్‌లో 4 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల ఫైబర్, ఇంకా ఎక్కువ మోతాదులో మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, విటమిన్-బీ లాంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుడా ఎంయూఎఫ్ఐ, ఓమేగా-3 లాంటి ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి. ఓమేగా-3ని అందించే ఏకైక మొక్క ఆధారిత ఆహారం ఈ వాల్నట్సే. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్రెషన్ కు సరైన నివారణ..

ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అత్యధికంగా అందించే వాటిలో నట్స్ లో వాల్నట్స్ ఒకటి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాకుండా నిరాశకు లోనుకావడం, కుంగిపోవడం లాంటి లక్షణాలను తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకుస్తాయి.

Health tips, good health, walnut, benefits of walnuts, health benefits of walnuts, nutritions in walnuts, Walnuts can heal depression, వాల్నట్స్ వల్ల ఉపయోగాలు, వాల్నట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, వాల్నట్స్ వల్ల నిరాశను నివారించవచ్చు, వాల్నట్స్ లో ఉండే పోషకాలు
వాల్నట్స్ (ప్రతీకాత్మక చిత్రం)


యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి..
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో వాల్నట్స్ ముందు వరుసలో ఉంటాయి. విటమిన్-ఈ, ఎలాజిక్ యాసిడ్, మెలాటోనిన్, కెరోటినాయిడ్లలో లాంటి ఇతర గింజల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

అజీర్తి సమస్య ఉండదు..వాల్నట్స్ జీర్ణసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. జీవక్రియ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. "వాల్నట్స్ పేగు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను పెంచే ప్రీబయోటిక్ లక్షణాల మంచి ఎంపిక అని పరిశోధల్లో తేలింది" అని ప్రముఖు పోషకాహార నిపుణులు టాండన్ అన్నారు.

Health tips, good health, walnut, benefits of walnuts, health benefits of walnuts, nutritions in walnuts, Walnuts can heal depression, వాల్నట్స్ వల్ల ఉపయోగాలు, వాల్నట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, వాల్నట్స్ వల్ల నిరాశను నివారించవచ్చు, వాల్నట్స్ లో ఉండే పోషకాలు
వాల్నట్స్ (ప్రతీకాత్మక చిత్రం)


గుండెకు మంచిది..
వాల్నట్స్ హృదయానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. మంటను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఓమేగా-3కి సంబంధించి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అని పోషకాహార నిపుణులు కవితా దేవగణ్ వివరించారు.

బరువు తగ్గేందుకు సరైన ఎంపిక..
వాల్నట్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశముంది. ఇవి ఆకలిని తగ్గించేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని చిరుతిండిగా తీసుకుంటే ఇంకా మంచిది. సలాడ్లలో వీటిని తినవచ్చు. లేదా అరటి, మామిడి జ్యూస్ ల్లో పొడిగా వేసుకొని తీసుకోవచ్చు. అంతేకాకుండా పచ్చి వాల్నట్స్ ను కూడా తినవచ్చు. వీటి పోషకాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్యంగా ఉండేదుకు సాస్ ల్లోనూ వేసుకుని తినవచ్చు.

ఈ విధంగా వాల్నట్స్ ను అధికంగా తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా పైన చెప్పిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వీటిని ఇస్తే ఎంతో మంచిది.
Published by: Kishore Akkaladevi
First published: September 26, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading