హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

క్యాన్సర్ బారిన పడే అవకాశం స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ?ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

క్యాన్సర్ బారిన పడే అవకాశం స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ?ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Males get most types of cancer : క్యాన్సర్(Cancer) లాంటి తీవ్రమైన జబ్బు వచ్చే ప్రమాదం ఆడవారి కంటే పురుషులకే(Men) ఎక్కువ అని చెబితే మీరు నమ్ముతారా? ఇది నిజం కాదని మీరు అనుకోవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Males get most types of cancer : క్యాన్సర్(Cancer) లాంటి తీవ్రమైన జబ్బు వచ్చే ప్రమాదం ఆడవారి కంటే పురుషులకే(Men) ఎక్కువ అని చెబితే మీరు నమ్ముతారా? ఇది నిజం కాదని మీరు అనుకోవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం. అన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం మహిళల కంటే పురుషులకు చాలా రెట్లు ఎక్కువ అని ఇప్పటి వరకు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది మాత్రమే కాదు, క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా పురుషులలో ఎక్కువగా ఉంది. ఇందుకు కారణం తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.

కొత్త అధ్యయనంలో బయటపడ్డ విషయాలు

మెడికల్ న్యూస్ టుడే నివేదిక ప్రకారం అన్ని రకాల క్యాన్సర్ కేసులు పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో 1.71 లక్షల మంది పురుషులు, 1.22 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. పరిశోధకులు సుమారు 16 సంవత్సరాలు ఈ వ్యక్తుల డేటాను సేకరించి విశ్లేషించారు. ఈ పరిశోధన ఫలితాలు చాలా ఆశ్చర్యపరిచాయి. జీవసంబంధమైన వ్యత్యాసం కారణంగా స్త్రీలు, పురుషులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం భిన్నంగా ఉంటుందని కనుగొనబడింది. జీవనశైలి, ధూమపానం, ఆల్కహాల్, బాడీ మాస్ ఇండెక్స్, ఎత్తు, శారీరక శ్రమ, ఆహారం, వైద్య చరిత్ర దీనిపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు.

Jaggery Benefits : బెల్లంతో ఎనర్జీ..ఇంకా బోలెడు ప్రయోజనాలు

ఈ ఫ్యాక్టర్స్ కూడా బాధ్యత వహించవచ్చు

ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, రోగనిరోధక వ్యవస్థలు, జన్యుశాస్త్రం వంటి పురుషులు, స్త్రీల హార్మోన్లలో తేడాల వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా భిన్నంగా ఉంటుందని ఈ అధ్యయనం యొక్క పరిశోధకులు అంచనా వేశారు. మహిళల్లో కనిపించే X క్రోమోజోమ్ అటువంటి ప్రమాదకరమైన జన్యువులను కూడా అణిచివేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు సిద్ధమవుతున్న ఔషధాల క్లినికల్ ట్రయల్స్‌లో దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి సరైన కారణాన్ని వెల్లడిస్తేస్త్రీలు, పురుషులు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

స్త్రీలు- పురుషులలో క్యాన్సర్ ప్రమాదం

-పురుషులలో మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మహిళల కంటే 3.30 రెట్లు ఎక్కువ.

-గ్యాస్ట్రిక్ కార్డియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పురుషులలో 3.49 రెట్లు ఎక్కువ.

-స్వరపేటిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పురుషులలో 3.53 రెట్లు ఎక్కువ.

-పిత్తాశయ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పురుషులలో తక్కువగా ఉంటుంది.

First published:

Tags: Cancer