• Home
 • »
 • News
 • »
 • life-style
 • »
 • MALE PENIS SIZE SHRINKAGE LEADS TO DANGER BELLS IN HUMAN LIFE HERE IS THE FULL DETAILS OF NEW STUDY HSN

మగాళ్లలో డేంజర్ బెల్స్.. క్రమంగా తగ్గుతూ వస్తున్న పురుషాంగం సైజు.. మరో 25 ఏళ్లలో జరగబోయేది ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

మగాళ్ల పురుషాంగం సైజు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా చేసిన ఓ పరిశోధనలో వెల్లడయింది. దీనికి ప్రధాన కారణమేంటి? పురుషాంగం సైజు తగ్గడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది.?

 • Share this:
  పూర్వకాలంలో రుషులు, ముని పుంగవులు లక్షలు, వేల ఏళ్ల సంవత్సరాలు బతికారని మన పురాణాలు చెబుతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆయు:పరిణామం కూడా తగ్గుతూ వస్తోంది. మొన్నమొన్నటి వరకు మన తాత ముత్తాతలు వంద నుంచి 150 ఏళ్ల వరకు బతికిన ఉదంతాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ప్రస్తుతం సగటు మనిషి జీవిత కాలం కాస్తా 70 నుంచి 80 ఏళ్లకు పడిపోయింది. 90 ఏళ్లు దాటినా ఇంకా ఆయురారోగ్యాలతో ఉన్నారంటే చాలు, అది మీడియాలో ప్రముఖంగా వార్తయిపోతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే సమయంలో పురుషుల శరీర భాగాల విషయంలో కూడా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ, ఏళ్లు గడుస్తున్న కొద్దీ పురుషాంగం సైజు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా ఓ సర్వేలో తేలింది. దీనికి ప్రధాన కారణమేంటన్నదీ, దీని వల్ల కలిగే ప్రమాదమేంటన్నది కూడా ఆ సర్వేలో పరిశోధకులు వెల్లడించారు.

  భారతీయ మగాళ్ల పురుషాంగం సైజు సగటుగా ఏడు నుంచి 8 అంగుళాల మేర ఉంటుందని వైద్య రికార్డులు చెబుతున్నాయి. పూర్వ కాలంలో ఈ సైజు ఇంకా ఎక్కువగానే ఉండేది. ప్రస్తుతం ఈ సైజు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. కొందరు మగాళ్లలో పురుషాంగం సైజు ఏడు అంగుళాల కంటే కూడా తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో సంతానోత్పత్తి విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పురుషుల శాతం కూడా పెరుగుతోందంట. శృంగార పరంగా భాగస్వామిని సంతృప్తి పరుస్తున్న మగాళ్ల శాతం కూడా అధిక స్థాయిలో ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం వాతావరణ కాలుష్యమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..

  పురుషాంగం సైజును ప్రభావితం చేసే, శృంగార సామర్థ్యాన్ని పెంపొందించే హార్మొన్ల ఉత్పత్తి వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలే తేల్చారు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే థాలెట్స్ రసాయనం ఫలితంగా సంతానోత్పత్తి పడిపోతోంది. అదే స్థాయిలో చిన్న సైజు పురుషాంగంతో పుట్టే మగ శిశువుల సంఖ్య పెరుగుతోంది. ’ట్రెండ్ అంటూ చెప్పుకుంటున్న ఆధునిక ప్రపంచం స్త్రీ పురుష పునరుత్పత్తి వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది. మానవజాతి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోంది‘ అని ఈ పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన శ్వాన్ అనే శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

  ప్లాస్టిక్ ను సరళంగా చేయడానికి థాలెట్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. క్రమంగా ఈ థాలెట్స్ వాడకం టాయ్స్ నుంచి ఆహారం వరకు చేరింది. థాలెట్ రసాయనం మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత సహజ హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీని వల్ల శిశువుల లైంగిక అభివృద్ధి, శృంగార పరమైన విషయాల్లో మార్పులు వస్తున్నాయి. మొదట థాలెట్ రసాయనం ప్రభావాన్ని ఎలుకల్లో శ్వాన్ అనే శాస్త్రవేత్త పరిశీలించారు. ఈ ప్రయోగాల ఆధారంగానే మనుషుల భవిష్యత్తును అంచనా వేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

  అదే సమయంలో 2017వ సంవత్సరంలో ఓ యువతి ఓ పరిశోధనను ప్రచురించింది. దాదాపు 45000 మంది మగాళ్లు ఈ పరిశోధనలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, వీరి ద్వారా దాదాపు 185 అధ్యయనాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనాల ప్రకారం పాశ్చాత్య దేశాల్లోని పురుషుల్లో సరైన స్థాయిలో వీర్యాన్ని విడుదల చేస్తున్న వారి సంఖ్య గత 40 ఏళ్లలో సగానికి పైగా తగ్గిందని తేల్చారు. 2045వ సంవత్సరం నాటికి మగాళ్లు వీర్యాన్ని ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటారని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి.
  ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
  Published by:Hasaan Kandula
  First published: