Home /News /life-style /

MALDIVES BECAME THE BIGGEST 2020 INTERNATIONAL TOURISM SUCCESS STORY SSR GH

Maldives: కరోనా సమయంలోనూ బెస్ట్ డెస్టినేషన్ ఇదేనట.. ఎందుకో తెలుసా?

మాల్దీవులు

మాల్దీవులు

మాల్దీవులు..భారతదేశానికి ఆనుకొని ఉన్న హిందూమహా సముద్రంలో, శ్రీలంక క్రింది భాగంలో ఉండే చిన్న దీవులు ఇవి. దీని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ కరోనా సమయంలోనూ పర్యాటకులకు బెస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా నిలిచింది. ముఖ్యంగా, కరోనా సమయంలో...

ఇంకా చదవండి ...
మాల్దీవులు..భారతదేశానికి ఆనుకొని ఉన్న హిందూమహా సముద్రంలో, శ్రీలంక క్రింది భాగంలో ఉండే చిన్న దీవులు ఇవి. దీని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ కరోనా సమయంలోనూ పర్యాటకులకు బెస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా నిలిచింది. ముఖ్యంగా, కరోనా సమయంలో భారతీయ సినీతారలు, సెలెబ్రెటీలందరూ వెకేషన్ కోసం మాల్దీవులకు క్యూ కట్టారు. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడం, మాల్దీవులు మాత్రమే పర్యాటకులను అనుమతించడంతో చాలా మంది సెలబ్రెటీలు సేదతీరడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దీంతో కరోనా సమయంలోనూ మాల్దీవులు ట్రెండింగ్ డెస్టినేషన్ గా నిలిచింది.

కరోనా నియమాలు ఖచ్చితంగా పాటించడం, టూరిస్టులకు అద్భుతమైన సదుపాయాలు కల్పించడంతో మాల్దీవులు సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, కరోనాకు ముందు సాధారణంగా సంవత్సరానికి 1.7 మిలియన్ల మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చేవారు. అయితే, 2020లో కరోనా కారణంగా సుమారు 500,000 మంది టూరిస్టులు మాత్రమే మాల్దీవులను సందర్శించారు. టూరిస్టుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ, కరోనా కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో టూరిస్టులు రావడంతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పర్యాటక ప్రదేశంగా మాల్దీవులు నిలిచింది.

కరోనా కారణంగా ప్రపంచంలో అనేక పర్యాటక ప్రదేశాలు మూసివేసినప్పటికీ, మాల్దీవులు మాత్రం వైరస్ తో సంబంధం లేకుండా, 2020 జూలైలో పర్యాటకులకు అనుమతులు అందించింది. కేవలం భారత్ మాత్రమే కాదు.. అన్ని దేశాల నుంచి వచ్చిన టూరిస్టులను అనుమతించింది. మాల్దీవుల్లోని చాలా హోటళ్ళు, రిసార్ట్స్, ద్వీపాల్లో సామాజిక దూరం పాటించడం, కరోనా నిబంధనలను అనుసరించడం పక్కాగా అమలు చేశారు. తాహితీ, బాలి, ఫుకెట్ వంటి ఇతర ప్రసిద్ధ ఆసియా పసిఫిక్ ద్వీప ప్రదేశాలు కరోనా సమయంలో పర్యాటకులను అనుమతించలేదు. దీన్ని మాల్దీవులు సద్వినియోగం చేసుకుంది. ఇక థాయిలాండ్, శ్రీలంక దేశాలు తమ దేశాలకు పర్యటనకు వచ్చేవారు ముందుగా రెండు వారాల పాటు తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్లో ఉండాలనే నిబంధన విధించాయి. కానీ, మాల్దీవులు మాత్రం ఈ నిబంధనలేవీ అమలు చేయకుండా 2020 జూలైలో బేషరతుగా తిరిగి టూరిజాన్ని ప్రారంభించింది. అయితే కరోనా ముప్పు పెరుగుతుండడంతో సెప్టెంబరు నుంచి మాత్రం పర్యాటకులకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ చూపించాలనే నిబంధన చేర్చింది.

అంచనాలను మించి పర్యాటకుల రాక..

2020లో మొత్తం పర్యాటకుల సంఖ్యను 5 లక్షలకు అంచనా వేయగా, 5,55,494 మంది మాల్దీవులను సందర్శించారు. కరోనా సమయంలోనూ పర్యాటకుల సంఖ్య తమ అంచనాను అధిగమించిందని మాల్దీవులు మార్కెటింగ్ & పిఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తోయిబ్ మొహమ్మద్ అన్నారు. ‘మాల్దీవుల ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఇక్కడ టూరిజం పెరగడానికి ప్రధాన కారణం. కఠినమైన పరిశుభ్రత ప్రోటోకాల్స్ అమలు చేయడం వల్ల కరోనా సమయంలోనూ పర్యాటకుల సంఖ్య పెరిగిందని భావిస్తున్నాం. మాల్దీవులు పర్యాటకులకు సురక్షితమైన భూతల స్వర్గంగా పర్యాటకులు భావిస్తారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి మరో కారణం” అని అన్నారు.

ఏదేమైనా, కరోనా సమయంలో పర్యాటకులను అనుమతించినప్పటికీ మహమ్మారిని అదుపులో ఉంచగలిగింది అక్కడి ప్రభుత్వం. 2021 ఫిబ్రవరి నాటికి, దేశంలో 17,828 కరోనా కేసులు మాత్రమే నమోదవ్వగా, కేవలం 58 మంది మాత్రమే కరోనాతో మరణించారు. కరోనా నియంత్రణకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన చర్యలు పనిచేశాయని ఈ సంఖ్యను బట్టే చెప్పవచ్చు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Best tourist places, Corona, Maldives, Tourism

తదుపరి వార్తలు