Custard Fruit Salad at Home : పెళ్లిళ్లు, వేడుకలు, పండుగలప్పుడు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం ఈ రోజుల్లో కామన్. రుచికరమైన, ఆరోగ్యకరమైన కస్టర్డ్ సలాడ్ తీసుకుంటే... ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా అందులో కలిపే పాలు మంచి టేస్ట్ ఇస్తాయి. ఇక పండ్లలో విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటివి ఉంటాయి. పాలలోనూ ఎన్నో పోషకాలుంటాయి. ఐరన్, ప్రోటీన్ లభిస్తాయి. అందుకే పిల్లలు, పెద్దవాళ్లూ అందరూ కస్టర్డ్ ఫ్రూట్ (సీతాఫలం) సలాడ్ తీసుకోవచ్చు. ఇలాంటి సలాడ్లు రెస్టారెంట్లలో చాలా రేటు ఎక్కువే. అదే ఇంట్లో చేసుకుంటే... అందరూ తినవచ్చు. పెద్ద కష్టం కూడా కాదు. జస్ట్ 20 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఫలితంగా టైమ్, మనీ సేవ్ అవుతాయి. అది ఎంత బాగుంటుందంటే... మళ్లీ మళ్లీ మీరే చేసుకుంటారు. అదెలాగో తెలుసుకుందాం.
కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సినవి :
- పాలు - 3 కప్పులు
- షుగర్ - 4 టేబుల్ స్పూన్లు
- కస్టర్డ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- ద్రాక్ష - అర కప్పు
- మామిడి - అరకప్పు (ఆప్షన్)
- యాపిల్ - అరకప్పు
- సపోటా - అరకప్పు
- దానిమ్మ గింజలు - అరకప్పు
కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం :
Step 1 : రెండు కప్పుల పాలలో షుగర్ వెయ్యండి. మీడియం హీట్‌లో పెట్టి ఉడికించండి. మిగతా 1 కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపండి. పాలు బాగా ఉడికాక, కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా వాటిలో పోయండి. బాగా కలపండి. 5 నిమిషాలు ఉడకనివ్వండి. పాలు చిక్కగా అవ్వాలి.
Step 2 : పాల మిశ్రమాన్ని స్టవ్ నుంచీ దించేయండి. అలా ఆరనివ్వండి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టండి. 15 నిమిషాల నుంచీ 20 నిమిషాలు కూల్ అవ్వనివ్వండి.
Step 3 : ఈ లోగా... ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత పాలను ఫ్రిజ్ లోంచీ బయటకు తీసి... కట్ చేసిన ఫ్రూట్స్‌ని అందులో వేసి కలపండి. మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి... ఓ గంట ఉంచి... తర్వాత తింటే ఉంటుందీ... టేస్టే టేస్టు.
Step 4 : తినేముందు ఆ మిశ్రమంపై బాదం, జీడిపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా తినవచ్చు. ఫ్రెండ్స్‌కి కూడా పెట్టొచ్చు. ఎంత బాగుంటుందంటే... వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits, Health Tips, Tips For Women, Women health