Home /News /life-style /

MAKE THIS DELICIOUS EGG RICE FOR LUNCH ALSO SAVE TIME RNK

Lunch Box recipes: లంచ్ కోసం ఈ రుచికరమైన ఎగ్ రైస్ చేయండి.. టైం కూడా ఆదా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lunch Box recipes: పిల్లలను బడికి, పెద్దలు ఆఫీసుకు హడావుడిగా రెడీ అయి వెళ్లాలన్నా ఉన్న సమయం సరిపోదు. అంతేకాదు మనం హెల్తీగా, టేస్టీగా ఉండే ఫుడ్ కూడా రెడీ చేసుకోవాలి. దీనికోసం ఓ అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఈ ఎగ్ రైస్ ను తక్కువ సమయంలోనే చేసుకోండి. రెసిపీ తయారీ విధానం చూద్దాం...

ఇంకా చదవండి ...
Lunch Box recipes: స్కూళ్లు (Schools) ఓపెన్ అయిపోయాయి. ఇక ఆఫీసులకు వెళ్లే పేరెంట్స్ ఉదయాన్నే తమ పిల్లలకు రుచికరంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం ఏది వండాలి అని గందరగోళంతో ఉంటారు. ఇష్టం లేని ఫుడ్ పెట్టినా పిల్లలు తినకుండా ఉంటారు. సరిగ్గా భోజనం చేస్తున్నా.. తినకున్నా... పేరెంట్స్ కు భయమే.. అందుకే ఈ భయాన్ని పోగొట్టేందుకు రుచికరమైన ఆహారం వండినా చింతించకండి. ఆ విధంగా హెల్తీగా, టేస్టీగా వండాలంటే ఈ ఎగ్ రైస్ (Egg rice) చేసుకోండి. ఇదిగో రెసిపీ...



కావలసినవి:
బియ్యం - 1 కప్పు
గుడ్డు - 4
ఉల్లిపాయలు - 1
పచ్చిమిర్చి - 1
కారం -1 tsp
ఉప్పు - 1 tsp
కొత్తిమీర తరుగు - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
నూనె - 4 tsp
పసుపు పొడి - 1 / 4 tsp

ఇది కూడా చదవండి: ఈ 5 కూరగాయలు ఉడికించిన తర్వాత మరింత పోషకాలుగా మారుతాయి ... వారానికి ఒకసారి తినండి ...


తయారీ విధానం..
ముందుగా అన్నంలో కాస్త ఉప్పు వేసి పొడిపొడిగా వండుకోవాలి.
ఇప్పుడు ఎగ్ రైస్ తయారీకి స్టవ్ ఆన్ చేసి ఒక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర ఫ్రై అయ్యే వరకు కుక్ చేయాలి.

ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత రెసిపీలో తగినంత  పసుపు కూడా వేయాలి.

ఉల్లిపాయ కొద్దిగా బంగారు గోధుమ రంగులో మారే వరకు వేయించాలి. అప్పుడే రెసిపీ రుచికరంగా వస్తుంది.

ఇప్పుడు అందులో గుడ్డు పగలగొట్టి, అవి పూర్తిగా విరిగిపోకుండా కలుపుతూ ఉండండి.

తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.

ఇది కూడా చదవండి: మన భారతీయ వంటకాల్లో ఇంగువ ఎందుకు తప్పనిసరి అని మీకు తెలుసా?


కోడిగుడ్డు ఫ్రై కాగానే ఉడకబెట్టిన రైస్ ను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. మీ వద్ద స్ప్రింగ్ ఆనియన్ ఉంటే, మీరు దానిని కూడా చల్లుకోవచ్చు.

ఆ తర్వాత రెసిపీలో కారం కూడా చల్లి మళ్లీ బాగా కలపాలి. ఉప్పు సరిపోకపోతే అందులో కొద్దిగా చల్లితే ఎగ్ రైస్ రెడీ. చివరగా కొత్తిమీరాతో గార్నీష్ చేసుకుంటే రుచికరమైన ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయినట్లే.. పిల్లలు కూడా దీన్ని బాగా తింటారు.

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:

Tags: Recipes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు