హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..

Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Daily walking: ఫిట్‌నెస్‌ విషయంలో మరీ కఠినంగా ఉంటూ.. పదివేల అడుగులను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఐదు వేల కంటే తక్కువ అడుగులు నడిచినా అకాల మరణ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రస్తుత ఆధునిక పోకడలకు అలవాటుపడిన మనిషి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌‌‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాడు. సంపూర్ణం ఆరోగ్యానికి నడక కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌గా ఉండాలంటే రోజుకు కనీసం 10 వేల అడుగులు నడవాలని ఫిట్‌నెస్‌‌‌ ట్రాకింగ్ డివైజ్‌లు సూచిస్తున్నాయి. దీనికి శాస్త్రీయత కూడా ఉందని ప్రజలు భావించి నడకకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ విషయంలో మరీ కఠినంగా ఉంటూ.. పదివేల అడుగులను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఐదు వేల కంటే తక్కువ అడుగులు నడిచినా అకాల మరణ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. 2019లో హార్వర్డ్ ఆచార్యులు డాక్టర్ ఇమిన్ లీ తన సహచరులతో ఈ విషయంపై పరిశోధన చేశారు. రోజుకు కనీసం మహిళలు 4,400 అడుగులు వేసినా కూడా.. అకాల మరణ ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గించుకోవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు.

పురుషుల కంటే మహిళల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి..? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..


మహిళలు కనీసం రోజుకు 5 వేల అడుగులు నడిస్తే.. అకాల మరణ ప్రమాదం తగ్గుతుందని, రోజుకు 7500 అడుగులు వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. గతేడాది దాదాపు 5వేల మంది మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులపై జరిపిన అధ్యయనంలో దీర్ఘాయువు కోసం రోజుకు 10 వేల అడుగులు నడవాల్సి అవసరం లేదని తేలింది. రోజుకు 8 వేల అడుగులు వేసినా.. లేదా ఇందులో సగం, అంటే 4 వేల అడుగులు వేసినా గుండె జబ్బులు, అకాల మరణాన్ని నిరోధించవచ్చని తెలిపింది.

Sexual Wellness: కరోనా సమయంలో శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!


పదివేల అడుగులే లక్ష్యమా..?

రోజూ 10 వేల అడుగులు నడవడం వల్ల ఎలాంటి హాని లేకపోయినప్పటికీ దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. బెల్జియంలో 2005లో నిర్వహించిన ఓ అధ్యయనంలో స్థానికులకు పెడోమీటర్లు ఇచ్చి రోజుకు కనీసం 10 వేల అడుగుల నడవాలని పరిశోధకులు సూచించారు. ఈ పరిశోధనలో సుమారు 600 మంది పురుషులు, స్త్రీలు పాల్గొన్నారు. వీరిలో కేవలం 8 శాతం మంది మాత్రమే 10 వేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. నాలుగేళ్లపాటు కొనసాగిన ఈ అధ్యయనంలో 10 వేల అడుగుల లక్ష్యాన్ని ఎక్కువ రోజులు ఎవరూ చేరుకోలేదు.

రోజుకు 10 వేల అడుగులు నడిచే బదులు ఫిజికల్ యాక్టివిటీకి సమయాన్ని కేటాయిస్తే మంచిదని డాక్టర్ ఇమిన్ లీ స్పష్టం చేశారు. రోజుకు కొన్ని వేల అడుగులు నడిస్తే సరిపోతుందని తెలిపారు. అమెరికా, ఇతర దేశాల ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల్లోనూ 10 వేల అడుగుల కంటే ఫిజికల్ యాక్టివిటీకే సమయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు.

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..


వ్యాయామం, నడక రెండింటితో ప్రయోజనం..

వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, కచ్చితంగా ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచించారు. రోజులో 7 నుంచి 8 వేల అడుగుల నడిస్తే సరిపోతుందని డాక్టర్ ఇమిన్ లీ అభిప్రాయపడ్డారు. నడకకు ఫిజికల్ యాక్టివిటీని జోడిస్తే మొత్తం 16 వేల అడుగులతో సమానమని తెలిపారు. రోజువారీ కార్యకలాపాలైన షాపింగ్, ఇంటి పనుల విషయంలో ప్రజలు రోజుకు కనీసం 5 వేల అడుగులు నడుస్తారని, దీంతో పాటు 2 నుంచి 3 వేల అడుగులు నడిస్తే 7 నుంచి 8 వేల అడుగులు నడిచినట్లవుతుందని విశ్లేషించారు.

1960వ దశకంలో 10వేల అడుగుల నడక చాలా పాపులరైందని డాక్టర్ ఇమిన్ లీ తెలిపారు. 1964 టోక్యో ఒలింపిక్స్ తర్వాత వాచ్ మేకర్లు ఫిట్‌నెస్‌‌‌ పై దృష్టి పెట్టి పెడోమీటర్లకు 10000 మీటర్ల నడకగా మార్కెటింగ్ వ్యూహరచన చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఫిట్‌నెస్‌‌‌ ట్రాకింగ్ డివైజ్‌లు 10వేల అడుగుల నడకకు ప్రామాణికంగా మారాయి.

First published:

Tags: Health, Health benefits, Walking

ఉత్తమ కథలు