మకర సంక్రాంతి.. ప్రతి జంటకూ తొలిరాత్రి.. ఇది శృంగార పండగ

పండగ వేళ ఇంట్లో బంధువుల సందడి ఉన్నా.. వీలు చూసుకొని మకర సంక్రాంతి రాత్రి శృంగారంలో పాల్గొనాలి.


Updated: January 16, 2020, 7:30 PM IST
మకర సంక్రాంతి.. ప్రతి జంటకూ తొలిరాత్రి.. ఇది శృంగార పండగ
పండగ వేళ ఇంట్లో బంధువుల సందడి ఉన్నా.. వీలు చూసుకొని మకర సంక్రాంతి రాత్రి శృంగారంలో పాల్గొనాలి.
  • Share this:
సంక్రాంతి మూడు రోజుల పండగ. భోగి, మకర సంక్రాంతి, కనుమగా జరుపుకునే సంక్రాంతి పండక్కి అన్ని చోట్లా సందడి ఉంటుంది. ముఖ్యంగా పల్లెల్లో ఎప్పుడూ లేనంత కోలాహలం ఉంటుంది. కొత్త అల్లుళ్ల రాకతో ఇంటికి కొత్త శోభ వస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లతో పిల్లలను ఆశర్వదించడం, సంక్రాంతి ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, కోళ్ల పందేలు, ఎడ్లబండ్ల పోటీలు, పతంగుల రెపరెపలు, పిండి వంటలు, బంధువులతో ముచ్చట్లు, పార్టీలు.. మనకు తెలిసిన సంక్రాంతి పండగ ఇదే. ఐతే సంక్రాంతి రోజు వీటికి మించి మరో ముఖ్యమైన కార్యం ఉందని మీకు తెలుసా..?

సంక్రాంతి భార్యాభర్తలకు ముఖ్యమైన పండగ. శాస్త్రాలు సైతం ఇదే చెబుతున్నాయి. ఉరుకులు పరుగుల ఈ జీవితంలో భార్యాభర్తలు శృంగారాన్ని సరిగా ఆస్వాదించడం లేదు. అంతేకాదు చాలా జంటలు ఉద్యోగ రీత్యా వేర్వేరుగా జీవిస్తున్నాయి. ఇలాంటి వారందరికీ సంక్రాంతి గొప్ప వరం. సంక్రాంతి రోజుల భార్యభర్తలు ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీని ప్రకారం.. పండగ వేళ ఇంట్లో బంధువుల సందడి ఉన్నా.. వీలు చూసుకొని మకర సంక్రాంతి రాత్రి శృంగారంలో పాల్గొనాలి. ఆ రోజు భార్యాభర్తలు కలిసి భోజనం చేయాలి. కలిసి పడుకోవాలి. తొలి రాత్రిలా శృంగారాన్ని ఆస్వాదించాలి. సంక్రాంతి రోజు మన పితృదేవతలు తరచి చూస్తారట. సంతాన వృద్ధి చెందాలని దంపతులను ఆశీర్వదిస్తారట. అందుకే పిల్లలు కనాలనుకుంటున్న భార్యాభర్తలు సంక్రాంతి రాత్రి ఖచ్చితంగా కలవాలట.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>