Sankranti 2021: గాలిపటం తయారీ.. చూడండి.. మీరే స్వయంగా చేసుకోండి..

Sankranti 2021: గాలిపటం తయారీ.. చూడండి.. మీరే స్వయంగా చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

sankranti 2021: ఈ సంక్రాంతి పండుగకి ఇంట్లోనే గాలిపటాలను ఈ విధంగా తయారుచేసుకోండి.. అది ఎలాగో చూడండి..

  • Share this:
సంక్రాంతి పండుగ రానే వచ్చింది.  పతంగుల సందడి తెచ్చింది.  సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు.. అంతటా గాలి పటాల సందడి ఉంటుంది. దేశమంతా వేర్వేరు పేర్లతో పండగ జరుపుకున్నా పంతగులు మాత్రం కామన్. పొంగల్ పండగ వేళ దేశమంతటా రంగు రంగుల పతంగులు ఎగురవేస్తుంటారు. అయితే, వీటిని మీరే ఇంట్లో తయారు చేసి ఎగరేస్తే ఎంతో బాగుంటుంది కదా.. ఆ తయారీ ఎలానో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన వస్తువులు:
కలర్ పేపర్ - 1 షీట్, ఫెవీకాల్ -1, కొబ్బరి చీపురు పుల్లలు - 3, టేప్ -1

తయారీ చేసే విధానం..
ఇప్పుడు పేపర్‌‌ని కరెక్ట్‌గా త్రిభుజం ఆకారంలో మడతపెట్టి.. ఎక్కువగా ఉన్న పేపర్‌ని కట్ చేసుకోవాలి.. ఇప్పుడు కరెక్ట్‌గా చతురస్ర ఆకారంలో పేపర్ రెడీ అవుతుంది. ఇప్పుడు చీపురు పుల్లకి ఫెవికాల్ రాసి పేపర్‌ని రెండు త్రిభుజాలుగా విడదీసే విధంగా మధ్యలో అతికించాలి. తర్వాత.. ఇంకో చీపురుపుల్లని మధ్యలో అతికించిన పుల్లకి అడ్డంగా అటు చివర ఇటు చివర పైకి వలయకారంలో వచ్చేటట్టు ఫెవికాల్ రాసి అతికించాలి. ఇప్పుడు దానికి కిందివైపున ఒక పేపర్‌తో ఎండింగ్‌లా చేసి తోకని అతికించాలి.. దీనికి దారం కడితే సరి.. గాలిపటం రెడీ అయినట్టే..

మన ఇష్టాన్ని బట్టి.. పేపర్‌తో కానీ, స్టైలిష్ కలర్ ప్లాస్టిక్ పేపర్‌తో కాని రెడీ చేసుకోవచ్చు ఈ గాలిపటాలను.. అంతేకాదు.. డిజైన్స్‌ని కూడా మన ఇష్టంగా కట్ చేసుకోవచ్చు.. కానీ చీపురు పుల్లలు మాత్రం ఈ విధంగానే పెట్టాలి...
మరింకెందుకు ఆలస్యం.. మీరే తయారు చేసి మీ పిల్లలకి పండుగ బహుమతిగా ఇచ్చేయండి..చిన్నారులు.. మీరు కూడా ఈ విధంగా గాలిపటాలను తయారుచేసుకోండి..
Published by:Manjula S
First published: