Makar sankranti 2019: ఈ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసి తీరాల్సిందే..

సంక్రాంతి సంబరాన్ని ప్రతిఒక్కరూ ఎంతో సంతోషంగా చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు అంబరాన్నంటుతాయి.

Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 7:52 AM IST
Makar sankranti 2019: ఈ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసి తీరాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 7:52 AM IST
హరిద్వార్, ఉత్తరాఖండ్..
మకర సంక్రాంతి సంబరాలు హరిద్వార్‌లో కన్నులపండుగుగా కొనసాగుతాయి. భారతదేశంలో అతి పురాతన, పవిత్ర గమ్యస్థానంగా ఉన్న ఈ ప్రాంతానికి ఈ సమయంలో ప్రజలు తరలివస్తారు. ఇక్కడి గంగానది ప్రజలతో నిండిపోతుంది. సూర్యుడికి అర్పణాలు, దాతృత్వ కార్యక్రమాలు అర్పిస్తుంటారు. ఈ కారణంగా కొంతవరకు నది కలుషితమవుతున్నప్పటికీ.. ఆ శోభ మాత్రం పండుగకళని తీసుకొస్తుంది.

pongal-reuters-875
మహిళల ప్రత్యేక పూజలు


అమృత్‌సర్.. కేవలం అమృత్‌సర్‌లోనే కాదు.. లుథియానా, జలంధర్‌లో కూడా ఈ సమయంలో పండుగ శోభ సంతరించుకుంటాయి. అయితే, మనం ఇక్కడ సంక్రాంతి అని జరుపుకునే పండుగను.. లోహ్రి అనే పేరుతో జరుపుకుంటారు. పంజాబ్‌లో రబీ పంటల కాలం. ఈ రోజున రైతులు, ప్రజలు అందరూ కూడా కొత్త, సాంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతారు. భోగి మంటలు వేసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా.. పల్లీలు, మొక్కజొన్న, నువ్వులతో చేసిన స్వీట్స్‌తో పండుగకు మరింత ఆనందాన్ని తీసుకొస్తారు. పంజాబీ జానపద పాటలను పాడుతూ.. ధోల్, భంగ్రా, గిద్దా వంటి సాంప్రదాయ నృత్యాలు కూడా చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు.sankranti sweets
సంక్రాంతికి తీపి విందు


అలహాబాద్ లేదా ప్రయాగరాజ్‌లో కూడా సంక్రాంతి సంబరాలు చూస్తుంటే మనల్ని మనం మైమరిచిపోవడం కాయం. గంగానది గుండా ఉండే ప్రాంతాలు కాబట్టి అదనపు శోభగా కూడా ఉంటాయి. వేలమంది ప్రజలు త్రివేణి సంగమంలో స్నానమాచరించి బియ్యం, తృణధాన్యాలతో కిచిడీ చేసుకుని విందు చేసుకుంటారు. ఈ సమయంలో కైట్ ఫెస్టివల్‌.. పండుగను మరింత కలరఫుల్‌గా మారుస్తుంది.
కర్ణాటకలో ఎల్లూ బెల్లా అనే పేరుతో ఈ పండుగను జరపుకుంటారు. ఈ రోజు ఆవులు, ఎద్దులను పూజిస్తారు. ఇక్కడి మహిళలు ఎల్యుబ్యూరోడ్ కర్మలో పాల్గొంటారు. వివాహమైన మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పండ్లు, పసుపు, చీరలు, గాజులు, చెరకు, పూలు వంటి వస్తువులను తీసుకుని వారి బంధువుల ఇంటికి వెళ్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం.. చెరుకు, నువ్వులు, బెల్లం, కొబ్బరిని పంచిపెడతారు.
Loading...
అసోంలోనూ మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. భొగాలి బీహూ, మగు బీహూ అని స్థానికులు ఈ పండుగను పిలుస్తారు. ఈ సమయంలో ప్రతిఒక్కరూ సాంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై విందులు, సంబరాలతో ఆనందపడతారు. ఈ రోజు ఎంతో రుచికరమైన భోజనం వండుకుని.. భోగీ మంటలు వేసి మంట చుట్టూ జానపద నృత్యాలతో సందడి చేస్తారు. స్థానికులు. మహిళలు పొంగల్‌ని కుటుంబీకులకు వడ్డిస్తారు. వెదురు, ఎండుగడ్డితో మంటలు వేసి చుట్టూ కూర్చుని బంధుమిత్రులతో కబుర్లు చెప్పుకుంటారు.

dance-around-a-bonfire-as-they-celebrate-Lohri1
భోగీ మంటల చుట్టూ మహిళల నృత్యాలు


కోల్‌కతా, వెస్ట్ ‌బెంగాల్‌లోనూ ఈ పండుగని గంగా సాగర్ మేళాగా జరుపుకుంటారు. ఈ మేళాలో పాల్గొనేవారు.. నదిలో పవిత్రస్నానం చేసి అనంతరం పూజలు చేస్తారు. ప్రసిద్ధ కుంభమేళ తర్వాత ప్రజలు అంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తారు. ఇక్కడ పండుగ సమయాన ఉండే కోలాహాలం తప్పక చూసి తీరాల్సిందే.
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...