Heart diseases: యువతలో గుండె జబ్బుల ముప్పు.. కారణాలు ఇవే..

Heart Diseases: వ్యాధి ప్రభావానికి గురైన తరువాత, దాదాపు సగం మంది రోగుల జీవిత కాలం 20 సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుతుంది. 30 శాతం మంది అదనంగా 10 సంవత్సరాల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది.

news18-telugu
Updated: October 20, 2020, 5:39 PM IST
Heart diseases: యువతలో గుండె జబ్బుల ముప్పు.. కారణాలు ఇవే..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో గుండె జబ్బుల తీవ్రత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత అనారోగ్యాల్లో చాలామంది కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) లేదా గుండె ధమనులు కుంచించుకుపోయే వ్యాధి బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. 30 ఏళ్ల లోపు వయసున్న వారిలో సీఏడీ సోకడానికి 95శాతం కారణాలు మద్యపానం, పొగ తాగడం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం, డయాబెటిస్ వంటివేనని అధ్యయనం గుర్తించింది. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST) సంస్థ ఈ పరిశోధన చేసింది. కరోనరీ ఆర్టరీ వ్యాధుల వల్ల గుండెకు రక్తం, పోషకాలను సరఫరా చేసే ధమనులు కుంచించుకుపోతాయి. దీంతో గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఫలితంగా గుండె నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

సీఏడీ బారిన పడి, కొరోనరీ యాంజియోగ్రఫీ చికిత్స చేయించుకున్న 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న రోగుల డేటాను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. వీరిలో 92 శాతం మంది మగవాళ్లు ఉన్నారు. వీరందరిలో 64 శాతం మందికి పొగ తాగే అలవాటు, 88 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందని పరిశోధకులు తెలిపారు. 21 శాతం మంది మాత్రమే మద్యానికి బానిసైనవారు ఉన్నారు. నాలుగు శాతం మందికి మధుమేహం ఉంది. వీరందరిలో సర్జరీ అవసరమైన అతి చిన్న వ్యక్తికి వయసు 15 సంవత్సరాలు మాత్రమే.

అలవాట్లు మార్చుకోట్లేదు
సీఏడీ బారిన పడి వైద్యం, కౌన్సెలింగ్, యాంజియోగ్రామ్ చికిత్స తీసుకున్న తర్వాత కూడా 34 శాతం మంది రోగులు పొగ తాగే అలవాటును కొనసాగించారని అధ్యయనం వెల్లడించింది. 17 శాతం మంది ఆల్కహాల్ తీసుకోవడం కొనసాగించారు. వ్యాధి నిర్ధారణ తర్వాత 50 శాతం కంటే ఎక్కువ మంది రోగులు శారీరకంగా బలహీనంగా మారిపోయారు. 79 శాతం మందికి ఆహారంలో పండ్లు, కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్నారని పరిశోధనలో తెలిసింది.

మెడిసిన్ ఆపేస్తున్నారు
సీఏడీ బారిన పడిన వారిలో 41 శాతం మంది రోగులు వైద్యుల సూచనలు పాటించట్లేదని, మెడిసిన్ వాడట్లేదని అధ్యయనం గుర్తించింది. లక్షణాలు లేకపోవడం వల్ల మందులు అవసరం లేదని వారు చెప్పారు. వైద్యపరంగా చికిత్స తీసుకున్న పేషెంట్లలో సగంమంది మెడిసిన్ వాడటం ఆపేశారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే మందులు వాడటం ఆపేసినట్లు అధ్యయనం తెలిపింది. ఐదేళ్ల వయసున్న రోగులు యాంజియోప్లాస్టీ తరువాత కోలుకుని సాధారణ జీవితం గడిపే అవకాశాలు 84శాతం ఉన్నాయి. 10, 15, 20 సంవత్సరాల వయసున్న వారిలో ఇది వరుసగా 70, 58, 52 శాతంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది.

జీవిత కాలం తగ్గుతుంది

వ్యాధి ప్రభావానికి గురైన తరువాత, దాదాపు సగం మంది రోగుల జీవిత కాలం 20 సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుతుంది. 30 శాతం మంది అదనంగా 10 సంవత్సరాల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న చాలా మంది రోగుల జీవించే వయసు తగ్గుతుందని అధ్యయనం సూచిస్తుంది. 30ఏళ్ల లోపు వయసున్న రోగులకు వ్యాధి వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి సరైన అవగాహన ఉండట్లేదని అధ్యయన బృందం గుర్తించింది. ఇలాంటి వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 20, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading