శివరాత్రి రోజు శివలింగానికి పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు?

అభిషేక ప్రియుడైన శివుడిని అర్చించేందుకు ప్రజలు పాలు పట్టుకుని క్యూ లైన్లలో నిలబడ్డారు. చాలా మంది పాలు, తేనె, నెయ్యి, బిల్వపత్రాలు, పంచామృతాలతో బారులు తీరారు.

news18-telugu
Updated: February 21, 2020, 3:41 PM IST
శివరాత్రి రోజు శివలింగానికి పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పవిత్ర పండుల్లో ఇది కూడా ఒకటి. తెల్లవారుఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అభిషేక ప్రియుడైన శివుడిని అర్చించేందుకు ప్రజలు పాలు పట్టుకుని క్యూ లైన్లలో నిలబడ్డారు. చాలా మంది పాలు, తేనె, నెయ్యి, బిల్వపత్రాలు, పంచామృతాలతో బారులు తీరారు. మహా శివరాత్రి రోజు ఉపవాసాలు చేస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు శివరాత్రికి ఉపవాసాలు చేస్తే, తమకు కూడా శివుడి లాంటి భర్త లభిస్తాడని నమ్మకం. అయితే, శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారు? దానికి చాలా కొన్ని కారణాలు చెబుతారు పెద్దలు.

శివరాత్రికి మహాశివుడు తాండవం ఆడుతుంటాడట. శివతాండవం చేయడం అంటే విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం చేసేది కూడా. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి సాత్విక ఆహారం అయిన పాలతో అభిషేకం చేస్తారని నమ్మకం. అంతేకాదు, పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో అందుకే ఉపయోగిస్తారు. అయితే, పాలతోనే ఎందుకు అభిషేకం చేస్తారనే అంశంపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మహాశివరాత్రి రోజే సముద్ర మథనం జరిగింది. అందులో ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. గరళంతో భగభగ మండిపోతున్న గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోసి శివుడిని శాంతింపజేశారు.

మరోవైపు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసంతో పాటు జాగారం కూడా చేస్తారు. భక్తులు జాగారం ఎందుకు చేస్తారనే దానికి మరో కథ ఉంది. గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడిని నిద్రపోకుండా రాత్రంతా జాగారం చేయాలని దేవతలు సూచిస్తారు. దీంతో శివుడు నిద్రపోకుండా ఉండేందుకు దేవతలు రాత్రంగా నృత్యాలు, గీతాలాపనలతో కాలక్షేపం చేస్తారు. తెల్లవారిన తర్వాత సంతృప్తి చెందిన మహాశివుడు వారిని వరాలిచ్చాడని ప్రతీతి.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు