MAHA SHIVRATRI 2019 WHAT IS LORD SHIVAS MOST FAVOURITE KNOW HERE FULL DETAILS RA
మహా శివుడికి అత్యంత ఇష్టమైనది ఇదే.. మీరూ ఆచరించండి..
ప్రతీకాత్మక చిత్రం
మహాశివరాత్రి పండుగ వచ్చేసింది.. ఈ రోజున ప్రతీ ఒక్కరూ శివాలయాలకు వెళ్ళి ఆ దేవదేవుడిని దర్శించుకుంటారు. ఇంట్లోనూ పూజలు చేస్తుంటారు. అయితే, ఉన్నవారైనా లేనివారైనా ఆ పరమేశ్వరుడిని ఆశీస్సులు పొందాలంటే అభిషేకం చేస్తే చాలు..
అభిషేకం.. పరమశివుడు అత్యంత ఇష్టపడేది ఈ ప్రక్రియే.. నిరంతరం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే.. నిత్యం ఆయనని నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతారు. అభిషేక ప్రియుడు శివుడు అని ఈయనకి పేరు.
ఈయన కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి.. దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి.. చల్లని నీరు పోయడం వల్ల ఆయన చల్లబడతాడు అని చెబుతారు.
అందుకే ఆయనకు నిరంతరం నీటితో అభిషేకిస్తే చాలు.. నీటిలో ఉబ్బిపోతాడు.. అందుకే ఉబ్బులింగడు అని పేరు కూడా ఉంది.