• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • MAHA SHIVRATRI 2019 MOST SPIRITUAL PLACE OF LORD SHIV TEMPLE KNOW HERE DETAILS RA

శివుడి విగ్రహం లేకున్నా.. శివరాత్రి ఉత్సవాలు.. నిత్యపూజలు జరుగుతాయి.. ఎక్కడంటే..

శివుడి విగ్రహం లేకున్నా.. శివరాత్రి ఉత్సవాలు.. నిత్యపూజలు జరుగుతాయి.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

శివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతాయి.. దేశంలోని చాలా మంది ఆలయాలకి వెళ్ళి ఆ పరమశివుడి విగ్రహాలను, లింగరూప దైవాన్ని చూసి భక్తితో పూజిస్తారు. కానీ, ఓ ఊరిలో దేవుడి విగ్రహం కానీ లింగం లేకున్నా కూడా భక్తులు ఉత్సవాలు చేయడంతో పాటు నిత్యం పూజిస్తారు.. అదెక్కడంటే..

  • Share this:
    వాయులింగేశ్వరుడిని మనం ఎంతో భక్తితో పూజిస్తాం.. అయితే, నిజంగానే దేవుడి విగ్రహం లేని చోట నిత్యపూజలు జరుగుతున్నాయి తమిళనాడులోని పుదుకొట్టైలో. ఓడేయర్ కోయల్ అనే ఈ ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు.. అయినా నిత్యపూజలు, ఆరాధనలు జరుగుతాయి అక్కడ. ఇక్కడి శివుడిని ఆత్మానంద స్వామి అంటారు.
    శరీరంలోని ఆత్మ కనిపించకుండా ఉన్నట్లే.. ఇక్కడి స్వామివారి విగ్రహం కూడా కనిపించదని చెబుతారు. ఆత్మలేదని మనం నమ్మకుండా ఉండం కదా.. అలాగే.. ఈ ఆలయంలో విగ్రహం కనిపించకపోయినా పూజిస్తామని చెబుతున్నారు భక్తులు.

    8వ శతాబ్ధంలో మనికవ సాగర్ అనే వ్యక్తి కట్టించారని చెబుతారు. అన్నీ ఆలయాల్లో లాగే ఇక్కడ శివుడికి ఎదురుగా నందీశ్వరుడు, చండీకేశ్వరుడు, ధ్వజస్థంభం కూడా ఉండదు. ఇక్కడ అమ్మవారు కూడా ఉండరు.. అయితే, అమ్మవారిని యోగాంబల్ అంటారు. ఆలయంలోని పై గోడపై పంచభూతలు.. స్తంభంపై నవగ్రహాల విగ్రహాలుంటాయి. ఎక్కడాలేని విధంగా 27 నక్షత్రాలు, సప్త స్వరాలు విగ్రహాల రూపంలో ఉంటాయి.
    స్వామి వారి విగ్రహం లేనప్పటికీ.. ఇక్కడ నైవేద్యంగా పెట్టిన అన్నంనుంచి ఆవిరినే శివుడిగా భావించి పూజలు చేస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
    Published by:Amala Ravula
    First published: