• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • MAHA SHIVARATRI 2021 MEDAK DISTRICT YEDUPAYALA VANA DURGA TEMPLE IS ALL SET FOR FESTIVAL BA MDK

Maha Sivaratri 2021: మహాశివరాత్రికి ముస్తాబైన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Maha Sivaratri 2021: మహాశివరాత్రికి ముస్తాబైన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ముస్తాబు

తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతర గా ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. మంజీరా నది తీర ప్రాంతంలో ఉన్న ఏడుపాయల దుర్గ భవాని మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.

 • Share this:
  తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతర గా ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. మంజీరా నది తీర ప్రాంతంలో ఉన్న ఏడుపాయల దుర్గ భవాని మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ జాతర మూడు రోజులపాటు జరుగుతుంది. ఏడుపాయల అనగానే ఏడు పాయలు ఒకే దగ్గర కలిసి నీరు పారి దుర్గ భవాని అమ్మవారి పాదాల వద్దకు నీరు చేరి అమ్మవారికి చల్లదనం అవుతుంది అని పెద్దలు అనేవారు. దట్టమైన గుండ్ల మధ్యలో వెలిసిన దుర్గ భవాని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో ఈ జాతరకు వస్తారు. ఏడుపాయల జాతరకు ఇజ్రాయిల్ తో పాటు శివసత్తుల వారు బోనాలు ఎత్తుకొని డాన్సులు చేస్తూ జాతరకు వచ్చిన భక్తులకు ఆకర్షణీయంగా ముగ్గులు వేసి బోనాలు ఎత్తుకుని డప్పు చప్పట్లతో డ్యాన్సులు చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటారు.

  మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి లో వెలసిన ఏడుపాయల వన దుర్గాభవానీ ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయి. మెదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పుజలు చేస్తారు. 11న భక్తులు ఉపవాసాలు ఉండి సాయంత్రం 6గంటలకు అమ్మవారి దర్శనం చేసుకొని ఉపవాసాలు వదులుతారు. 12 తేదీ నాడు ఎడ్ల బండ్లు తిరుగుతాయి. 13 రథోత్సవం జరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రథమ చికిత్స, అంబులెన్స్, టాయిలెట్స్, మంచినీటి కులాయిలు తెలిపే పెద్ద చిత్ర పటాలను ఆకదక్కడ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

  ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ముస్తాబు


  ప్రస్తుతం కరోనా సీజన్ కావడంతో అక్కడ పనిచేసే సిబ్బందికి కావలసిన మాస్కులు, గ్లౌజులు, రేడియం స్టిక్కర్ జాకెట్ లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించుటకు, దొంగతనాలు జరుగకుండా నియంత్రించడానికి 1,100 మంది పొలీసు సిబ్బందిని నియమించారు. ప్రత్యేకించి షీ బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

  ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ముస్తాబు


  మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని అందరు అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని, జాతర అనతరం కూడా రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షం అందరిపై ఉంటుందని అన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు