Home /News /life-style /

MADURAI WOMAN MADE 134 DISHES IN 30 MINUTES AND SHE WAS PLACED IN THE INDIA BOOK OF RECORDS PRV

Kitchen Queen: 30 నిమిషాల్లోనే 134 వంటలు చేసిన మదురై మహిళ.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు..

మదురై మహిళ

మదురై మహిళ

మధురై జిల్లా తిరుమంగలానికి చెందిన ఇందిరా రవిచంద్రన్‌(Indira Ravichandran) వంటలు చేయడంలో ఘనాపాటి. తన ఇంటిలో రోజు రకరకాల వంటలు కమ్మగా చేసి కుటుంబసభ్యులకు పెడుతుందట. ఈ క్రమంలోనే వంటలు చేయడంలో రికార్డు సృష్టించాలని ఆమె అనుకున్నారు. ఇందుకోసం సాధన చేసిన ఆమె ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(India book of records)కు కబురందించింది

ఇంకా చదవండి ...
    అద్భుతాలకు మన వంటిల్లూ(kitchen) నిలయమే. ఎందుకంటారా? మనం రకరకాల వంటలు అద్భుతంగా చేసేయొచ్చు. కొత్తకొత్త వంటలూ(recipes) సృష్టించొచ్చు. ఆయా వంటలకు మనమే సృష్టికర్తలం అవ్వొచ్చు. అయితే ఎంతైనా ఆ వంటలు చేయడంలో ఆడవాళ్ల(women)కు తెలిసినంతగా రకరకాల వంటలు మగవాళ్లకి తెలియదులేండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మగవాళ్లే చెఫ్​లుగా ఉండొచ్చు కాబోలు.. కానీ, వంటింటి(kitchen)లో మాత్రం వారి సతీమణి గారే చెఫ్​. చాలా ఇళ్లల్లో వంట చేయడం పెద్ద కష్టమా అంటూ చాలామంది మగాళ్లు తమ భార్యలను సూటిపోటి మాటలు అంటుంటారు. తీరా ఆమె ఒకట్రెండు రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్‌లోకి వెళ్లడానికే వణికిపోతారు. వంటింట్లో వంటలు చేయటమంటే అంతా ఆషామాషీ కాదని ఆ సందర్భంలోనే తెలుస్తుంది. అయితే రోజూ కుటుంబానికి అవసరమైన వంటలు(recipe) చేయడం కాస్త సులభమే అయినా... తక్కువ సమయంలో అందరినీ మెప్పించేలా ఎక్కువ వంటకాలు చేయాలంటే మాత్రం సాహసమనే చెప్పాలి. ఆ సాహసాన్ని చేసి రికార్డు నెలకొల్పారు తమిళనాడు(Tamilnadu)లోని మదురైకి చెందిన ఇందిరా రవిచంద్రన్‌ (Indira Ravichandran) అనే మహిళ. కేవలం 30 నిమిషాల సమయంలో ఏకంగా 134 వంటకాలు సిద్ధం చేసి పాక కళలో సరికొత్త రికార్డు(record) సృష్టించారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

    తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలానికి చెందిన ఇందిరా రవిచంద్రన్‌(Indira Ravichandran) వంటలు చేయడంలో ఘనాపాటి. తన ఇంటిలో రోజు రకరకాల వంటలు కమ్మగా చేసి కుటుంబసభ్యులకు పెడుతుందట. ఈ క్రమంలోనే వంటలు చేయడంలో రికార్డు సృష్టించాలని ఆమె అనుకున్నారు. ఇందుకోసం సాధన చేసిన ఆమె ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(India book of records)కు కబురందించింది. ఆ ప్రతినిధి పర్యవేక్షణలో సోమవారం 30 నిమిషాల్లో శాకాహార, మాంసాహార వంటలు కలిపి మొత్తం 134 రకాల(varieties) ఆహార పదార్థాల(food items)ను తయారు చేసింది. ఆమె తయారు చేసిన వాటిలో దోస, ఇడ్లీ, ఆమ్లెట్, ఊతప్ప, ఐస్‌క్రీమ్, కోడికూర, బిర్యానీ, ఫిష్ కర్రీ వంటి అనేక రుచికరమైన ఆహార పదార్ధాలూ ఉన్నాయండోయ్​.

    గతంలో ఒక గంటలో 122 రకాల వంటకాలను చేసి కేరళకు చెందిన పదేళ్ల బాలుడు హెయన్ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. తాజాగా ఇందిరా రవిచంద్రన్​ 30 నిమిషాల్లో 134 రకాల వంటకాలు తయారు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కిచెన్​ క్వీన్(kitchen queen)​ అనిపించుకున్నారు. దీంతో ఇందిరా రవిచంద్రన్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళనాడులో సెలబ్రెటీగా మారిపోయారు. అనేక టీవీ ఛానళ్లు తమ వంటల కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాలంటూ ఆమెను ఆహ్వానిస్తున్నాయట.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Chennai, Cooking women, Guinness World Record, Master chef, Tamil nadu

    తదుపరి వార్తలు