• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • LUCKY FORMER IN KURNOOL HE FOUND ONE STONE IN HIS FORM IT IS COST OF 2 CRORE MORE NGS

Andhra Pradesh: అదృష్టం అంటే ఇదే.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతు..? అదెలా సాధ్యం

Andhra Pradesh: అదృష్టం అంటే ఇదే.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతు..? అదెలా సాధ్యం

ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతు

అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అలాగే ఓ రైతు జీవితాన్ని మార్చేసింది ఓ రాయి.. ఇప్పుడు కోటీశ్వరుడ్ని చేసింది.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

  • Share this:
    రాత్రి రాత్రే రాత మారిపోవడం.. కొన్ని గంటల్లోనే కోటీశ్వరుడై పోవడం..  అనుకోకుండా అదృష్టం ఇంటి తలుపు తట్టడం.. లక్ష్మీ దేవి నడుచుకుని రావడం.. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి.. నిజంగా అదృష్టం అన్నది ఆశ మాత్రమే.. అలాంటివి కలలో మాత్రమే జరుగుతుంటాయి.. నిజమవుతాయా ఏంటి అని అంతా నిట్టూరుస్తారు. కానీ కర్నూలు జిల్లాల్లో అనూహ్య  ఘటన జరిగింది. అది కూడా ఓ పేద రైతును లక్ష్మీ దేవి వరించింది.  అతడు కూడా ఎప్పుడూ కలలో కూడా అనుకోని ఉండడు. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అవుతాడని.. కానీ అదే నిజం ఒక్క రోజులోనే రైతు కోటీశ్వరుడయ్యాడు. ఈ రోజుల్లో నేలను నమ్ముకుంటే అప్పులు.. ఆత్మహత్యలే మిగులుతున్నాయని అంతా నిట్టూరుస్తుంటారు.. కానీ ఓ రైతు నమ్ముకున్న నేల.. సేద్యం కోటీశ్వరుడ్ని చేశాయి.

    ఎప్పుడూ పుడమి తల్లి ఒడిలో ఉంటూ సేద్యం చేసుకునే ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్న గిరిలో ఈ ఊహించని  ఘటన జరిగింది. ఓ రైతు పొలానికి వెళ్లగా.. మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది.  ఆ రాయిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్న రైతు.. కాసేపటి తరువాత తేరుకుని దాన్ని వజ్రంగా భావించి ఇంటికి తీసుకువచ్చాడు. వెంటనే దాన్ని స్థానిక వ్యాపారికి చూపించగా కోటీ 20 లక్షల రూపాయలకు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

    30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్‌ ధర 2 కోట్ల రూపాయల పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్న మాట ఇది. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత.. దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ బతుకు ఈడుస్తున్న ఆ పేద రైతు  ఇంటిని వజ్రం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. ఆ రాయే రైతు జీవితాన్ని ఇప్పుడు మార్చేసింి.

    ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి 37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు.
    Published by:Nagesh Paina
    First published: