Home /News /life-style /

LUCKY FISHER MAN RARE PEARL CONE ENTANGLED NET IN SEA FOUR MEMBERS BUY NGS

Andhra Pradesh: మత్స్యకారుడ్ని వరించిన అదృష్టం... వలకు చిక్కిన అరుదైన ముత్యపు శంఖం.. ఇదీ ప్రత్యేకత

మత్స్య కారుడి వలలో ముత్యపు శంఖం

మత్స్య కారుడి వలలో ముత్యపు శంఖం

నిత్యం వేటకు వెళ్లే ఓ మత్స్య కారుడ్ని ఇవాళ లక్ వరించింది. చాలా అరుదైన ముత్యుపు శంఖం అతడి వలకు చిక్కింది. దీంతో ఆ శంఖాన్ని కొనేందుకు విపరీతంగా పోటీ పడ్డారు జనం.. ఇంతకీ ఆ శంఖం ప్రత్యేకత ఏంటో తెలుసా..?

    ప్రతి రోజు భయం భయంగానే వేటకు వెళ్తారు మత్స్యకారులు.. ముఖ్యంగా నదులు, సముద్రాల్లో వేటకు వెళ్లే వారి ప్రాణాలకు ఎప్పుడూ భరోసా ఉండదు.. ఎప్పుడు ఎలాంటి ముప్పు సంభవిస్తుందో తెలియదు.. అయితే ప్రాణాలకు తెగించి.. కుటుంబ పోషణ కోసం చేపల వేటను కొనసాగిస్తూ ఉంటారు. అయితే అందులో కొందరికి మాత్రం అప్పుడప్పుడూ లక్ ఫేవర్ చేస్తూ ఉంటుంది. అరుదైన చేపలు, చాలా అరుదైన వస్తువులు వారి వలకు చిక్కుతాయి. అలా ఎవరి వలలో పడితే వారు అదృష్ట వంతులవుతున్నారు. కొన్ని నెలల కష్టానికి ఒక్కరోజులోనే ఫలితం వస్తుంది. అయితే ఇలాంటివి చాలా అరుదుగానే జరుగుతున్నాయి. ఎందుకంటే సముద్రంలో ఎంతో సంపద నిక్షిప్తమై ఉంటుంది. ఎన్నో జీవ చరాలు, మరెన్నో ఖనిజాలు, అంతమైన ముత్యపు చిప్పలు, శంఖాలు, రంగు రంగుల రాళ్లు నెలవై ఉంటాయని మనందరికీ తెలిసిందే. ప్రపంచం ఇప్పటి వరకూ చూడని మరెన్నో వింతలు సముద్ర గర్భంలో ఉన్నాంటారు సముద్ర పరిశోధకలు. అలాంటి వాటిలో కొన్ని మత్స్య కారుల ద్వారా వెలుగులోకి వచ్చేవి ఉన్నాయి.

    తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో అరుదైన ముత్యపు శంఖం వలకు చిక్కింది. ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం.. ఇవాళ ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపల కోసం వేసిన వలలో అరుదైన ముత్యపు శంఖం చిక్కింది. అది చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని ఇతర మత్సకారులతో పంచుకున్నాడు.

    అతడి వలలో ఊహించని విధంగా మత్యపు శంఖ లభించింది. అందులో ముత్యాలు ఉంటాయని తెలియడంతో.. ఆ శంఖాన్నికొనుగోలు చేసేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడ్డారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ ముత్యపు శంఖాన్ని అమీనాబాద్ మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద వేలం పాటకు పెట్టారు. ఈ వేలంలో ముత్యపు శంఖానికి 18 వేల రూపాయల ధర పలికింది. కాగా, దీనిని తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఓపెన్ చేస్తే ముత్యాలు ఉంటాయని మత్స్యకారుల నమ్మకం. కాగా, ముత్యాలు ఉంటాయనే నమ్మకంతో ఉప్పాడ ప్రాంతానికి చెందిన నలుగురు మత్స్యకారులు కలిసి దీనిని కొనుగోలు చేశారు. మరి అందులో నిజంగా ముత్యాలు ఉన్నాయా లేదా అన్నది కొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist

    తదుపరి వార్తలు